Janaki Kalaganaledu 15 June Today Episode : రామా కుడిచేతికి తీవ్రగాయం.. ఫైనల్ నుంచి తప్పుకుంటాడా? కన్నబాబు ప్లాన్ సక్సెస్ అయిందా?

Janaki Kalaganaledu 15 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 323 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ బాటిల్ ఖాళీగా ఉండటం చూసి అదే సాక్ష్యం అనుకోవడం కరెక్ట్ కాదు సార్ అంటుంది జానకి. దీంతో మరి ఏ సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని మేము నిర్ణయం తీసుకోవాలి అని అడుగుతుంది ప్రభ. దీంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి అంటుంది జానకి. దీంతో సునందకు ఏం చేయాలో అర్థం కాదు. థాంక్స్ అమ్మ. మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించమని చెప్పండి అంటుంది ప్రభ. దీంతో ఆ కంటెస్టెంట్ తన తప్పు ఒప్పుకుంటుంది. నన్ను క్షమించండి మేడమ్.. నేనే ఆ తప్పు చేశాను. అతడిని ఎలిమినేట్ చేయాలనే నేను అలా అబద్ధం చెప్పాను అంటుంది కంటెస్టెంట్. దీంతో బుద్ధి ఉందా నీకు. నీ వల్ల ఒక ప్రతిభావంతుడు ఈ పోటీలో నుంచి తప్పుకొని ఉండేవాడు అంటుంది. సునందకు కోపం వస్తుంది.

janaki kalaganaledu 15 june 2022 full episode

రేపు ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈ సెమీ ఫైనల్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. అందులో ఒకరు వెనిగర్ తనే కలిపి ఇంకొకరిపై నింద మోపిన శ్రీలత. ఆ తర్వాత ఇంకొక ఎలిమినేట్ ఎవరంటే.. టేబుల్ నెంబర్ 2, విక్రమ్ అని చెబుతుంది. మిగిలిన ముగ్గురు రేపు ఫైనల్స్ కు వెళ్లబోతున్నారు అని చెబుతుంది ప్రభ. ఆ ఫైనల్స్ కూడా ఇక్కడ కాదు. నలుగురు తిరిగే ప్రదేశంలో. ఆ ప్రదేశంలో మీరు వంట చేసి నలుగురి మెప్పు పొందాలి. ఆ నలుగురు రుచి చూసి మీ వంటలను పొగిడితేనే మీలో విన్నర్ ఎవరో మేము చెబుతాం. మిమ్మల్ని మా సీక్రెట్ కెమెరాస్ ఫాలో అవుతూ ఉంటాయి. బాగా అర్థం అయింది కదా. మీ సపోర్టర్స్ ఎవ్వరూ మీతో రాకూడదు. మీ ముగ్గురు రెసీపీలు తయారు చూసి అక్కడ తెలియని వాళ్లతో తినిపించాలి. రేపటి వరకు ఈ టెన్షన్ ను కొనసాగిస్తూ ఈరోజుకు గుడ్ బై. ఆల్ ది వెరీ బెస్ట్ రామచంద్ర. వెరీ వెరీ బెస్ట్ అని అంటుంది ప్రభ. దీంతో జానకి, జ్ఞానాంబ సంతోషిస్తారు.

మరోవైపు మల్లిక.. మోకాళ్ల మీద గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉంటుంది. ఓం నమ:శివాయ అంటూ చేస్తుంటుంది. వెంటనే గోవిందరాజు.. విష్ణుకు ఫోన్ చేస్తాడు. ఒరేయ్ విష్ణు.. మీ అన్నయ్య రామా చివరి పోటీలకు వెళ్లిపోయాడు అని చెబుతాడు గోవిందరాజు. ఆ విషయాన్ని మల్లికకు చెప్పడంతో తనకు కోపం వస్తుంది.

మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజుతో కలిసి రామా, జానకి హోటల్ కు వెళ్తారు. అక్కడ కన్నబాబు వీళ్లను చూస్తాడు. రేపు తెల్లారే సరికి.. ఆ నవ్వులు మీ మొహంలో ఉండవు అని అనుకుంటాడు. కన్నబాబు.. నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో ఇదిగో ఇప్పుడే వచ్చాను అంటాడు.

Janaki Kalaganaledu 15 June Today Episode : రామాను టార్గెట్ చేసిన కన్నబాబు

అవును.. నిన్నటి వరకు మీ అమ్మగారు ఈ చుట్టుపక్కలే ఉన్నారు. మరి ఈరోజు కనిపించడం లేదు ఏంటి అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో ఆవిడ ఇక్కడ చేయాల్సిన పని ఆగిపోయింది. దీంతో నేను పూర్తి చేయడానికి వచ్చాను అంటాడు కన్నబాబు.

మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని విష్ చేయడానికి వచ్చాను అంటాడు కన్నబాబు. దీంతో సమయానికి వచ్చావు.. నీకు ఏం కావాలన్నా ఏమాత్రం సిగ్గుపడకుండా మొత్తం తినేయ్ అంటాడు. రేపు మావాడు 5 లక్షలు గెలవబోతున్నాడు.. అంటాడు గోవిందరాజు.

జాగ్రత్తగా ఉండు అని సలహా ఇస్తాడు కన్నబాబు. దీంతో నేను జాగ్రత్తగానే ఉంటాను అంటాడు రామా. నా కొడుకు చీమకు కూడా హాని చేయడు. ఇక్కడ గెలిచి.. ఊరికి పేరు తేవాలని ఇక్కడికి వచ్చాడు. నా కొడుకుకు దేవుడే తోడుగా ఉంటాడు అని జ్ఞానాంబ అంటుంది.

ఏది ఏమైనా పాత విషయాలను మనసులో పెట్టుకోకుండా.. నన్ను భోం చేయమన్నారే చాలా సంతోషంగా ఉంది. అంకుల్ చాలా థాంక్స్ అంటాడు కన్నబాబు. పర్వాలేదు ముందు ప్రశాంతంగా భోజనం చేయి అంటుంది జ్ఞానాంబ. రాముడు రేపు గెలుస్తాడు.. రేపు ఊరంతా సంబరాలే.. అవన్నీ చూడాలి కదా నువ్వు అంటాడు గోవిందరాజు.

ఒరేయ్ రామా.. నువ్వు గెలవాలని వచ్చావు.. నిన్ను ఓడించాలని నేను వచ్చాను. నిన్ను ఫైనల్ లో పోటీలోనే లేకుండా చేయబోతున్నాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కన్నబాబు. మరోవైపు ఆరుబయట గార్డెన్ లో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు రామా, జానకి.

అక్కడే పైన బిల్డింగ్ మీద ఉన్న కన్నబాబు.. పెద్ద చెట్టును ధ్యానం చేసుకుంటున్న రామా మీద విసిరేస్తాడు. దీంతో అతడి చేతికి గాయం అవుతుంది. వెంటనే జానకి రామాను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. తన కుడి చేతికి గాయం అవుతుంది.

తన కుడి చేతిని పనికిరాకుండ చేశాను. రేపు వంటల పోటీల్లో నిన్ను ఓడిపోయేలా చేస్తాను. జ్ఞానాంబ స్వీట్స్ ను సునంద స్వీట్స్ గా మార్చుతున్నాను అని అనుకుంటాడు. డాక్టర్ ను పిలిచి చూపిస్తారు. చేతికి బాగా దెబ్బతాకిందని చెబుతాడు డాక్టర్.

చేతికి రెస్ట్ ఇవ్వాలి అంటాడు. చేత్తో బరువులెత్తినా గూడు జారిపోయే ప్రమాదం ఉంది అంటాడు. చేతిని కదపకుండా.. ప్రెజర్ ఇవ్వకుండా అలాగే ఉంచాలి అంటాడు డాక్టర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

5 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

6 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

7 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

8 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

9 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

10 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

11 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

12 hours ago