Janaki Kalaganaledu 15 March Today Episode : మైరావతి ఇంటికి వచ్చిన ఓబులేష్.. దిలీప్, వెన్నెల ముందే ప్రేమించుకున్నారని మైరావతికి చెబుతాడా? ఈ పెళ్లి ఆగిపోతుందా?

Janaki Kalaganaledu 15 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 257 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం మైరావతి ఇంటికి వెళ్తారు. దీంతో మైరావతి అందరినీ ఆహ్వానిస్తుంది. రండి.. అని అంటుంది. ఏం పిల్లలు అందరూ బాగున్నారా అని అడుగుతుంది. మీరెలా ఉన్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో బాగున్నాను. కొంతమంది రాకుండా ఉంటే ఇంకా బాగుండేదాన్ని అని అంటుంది మైరావతి. అబ్బ.. ఇక్కడ అడుగుపెట్టగానే జానకితో మైరావతి ఆడుకోవడం మొదలుపెట్టింది అని అనుకుంటుంది.

janaki kalaganaledu 15 march 2022 full episode

అమ్మా ఆశీర్వదించు అమ్మా అని గోవిందరాజు, జ్ఞానాంబ తన కాళ్ల మీద పడతారు. ఆ తర్వాత రామా, జానకి తన కాళ్ల మీద పడతారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు రామయ్య అంటుంది కానీ.. జానకిని పట్టించుకోదు. అవును.. ఏంటి ఇలా చిక్కి పోయావు అని రామాను అడుగుతుంది. సరిగ్గా తిండి పెట్టట్లేదా ఏంటి.. చెప్పు తోలు తీస్తా ఒక్కొక్కరిని అంటుంది. ఏంటి అని జానకి వైపు చూస్తూ ఉంటుంది. ఒకరిని ఆశీర్వదించి.. ఇంకొకరిని ఆశీర్వదించలేదేంటా అని. ఒకరు నచ్చకపోతే వాళ్లను జన్మలో కూడా చూడను. మూడు సార్లు నిన్ను ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పా. కానీ.. జ్ఞానాంబకు మాయ మాటలు చెప్పి ఇంట్లోనే ఉంటున్నావు అంటుంది.

అత్తయ్య గారు.. జానకి మంచితనం వల్లనే తను ఇంకా మన ఇంట్లో ఉంటుంది.. అంటుంది జ్ఞానాంబ. తను ఏం చేసినా మన ఫ్యామిలీ మంచి గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని అంటాడు గోవిందరాజు. నా మనవరాలికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అని వెన్నెలను చూసి అంటుంది మైరావతి.

నీ నిశ్చితార్థమే కాదు.. నీ పెళ్లి కూడా ఇక్కడే ఈ నానమ్మ చేతుల మీదనే జరుగుతుంది అంటుంది మైరావతి. దీంతో వెన్నెలకు కంగారు మొదలవుతుంది. పెళ్లంటే కంగారు ఉంటదిలే ఆడపిల్లకు. సరే.. సరే.. అందరూ లోపలికి వెళ్లండి అంటుంది మైరావతి.

అందరూ వెళ్తుండగా జానకిని మాత్రం ఆపుతుంది. నువ్వు ఆగు అంటుంది మైరావతి. దీంతో అందరూ షాక్ అవుతారు. మీరు వెళ్లండి అంటుంది మైరావతి. నువ్వు నాతో రా అని మైరావతి.. జానకిని ఎక్కడికో తీసుకెళ్తుంది. అమ్మమ్మ గారు నన్ను ఆగమన్నారు ఎందుకు అంటుంది.

Janaki Kalaganaledu 15 March Today Episode : నా కోడలును గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నావా అని జానకిని ప్రశ్నించిన మైరావతి

పట్టుమని 22 ఏళ్లు కూడా లేవు. ఎంత తెలివైన దానివే నువ్వు. నా అంచనాలను అందనంత తెలివైన దానివని నేను ఊహించలేదు అంటుంది. నా కోడలుకు నేను ఎంత చెప్తే అంత అనేలా ఉండేది. కానీ.. నీ విషయంలో ఒకటి రెండు సార్లు నేను చెప్పిన విషయాన్ని గోదాట్లో కలిపేసింది అంటుంది మైరావతి.

నా కోడలును నువ్వు గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నావని అర్థం అవుతోంది. నువ్వే నా మనవరాలికి పెళ్లి సంబంధం చూస్తావా అంటుంది. దీంతో వెన్నెల నాకు ఆడపడుచు అంటుంది జానకి. మాటలు బాగా నేర్చావుగా. నా మనవరాలు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆలోచించి ఈ సంబంధం చూశావా అంటుంది మైరావతి.

ఈ సంబంధం చూడటం వెనుక నీ చావు తెలివి తేటలేవో తెలుసా? అబ్బాయి వాళ్లు నీ తరుపు వాళ్లు కాబట్టి.. జ్ఞానాంబను ఈ విషయంలో ఎప్పటికీ నోరెత్తకుండా చేయడం కోసం అంటుంది మైరావతి. అమ్మమ్మ గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు అంటుంది జానకి.

ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబం. నేను చెప్పానని కాదు.. అన్ని చూసుకొని చూసే అత్తయ్య గారు ఈ సంబంధం ఖాయం చేసుకున్నారు అంటుంది జానకి. అవునా.. ఆ ఊళ్లో నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు. వాళ్లు కూడా వస్తున్నారు.. వాళ్లు వచ్చి.. నువ్వు చూసిన సంబంధం గురించి చెబుతారు.. అంటుంది మైరావతి.

మైరావతి వెళ్లిపోగానే రామా అక్కడికి వస్తాడు. నేను అన్నీ విన్న అంటాడు. ఈ విషయంలో ఆ దేవుడే మనకు సాయంగా ఉంటాడు అంటాడు రామా. ఇంతలో దిలీప్ వాళ్ల ఊరు నుంచి ఓబులేషు వస్తాడు. నవభారత్ నగర్ లోనే ఉంటాను నేను అంటాడు ఓబులేషు.

అమ్మ వారి గుడి ఉంది కదండి.. ఆడి నుంచి మూడో వీధి అండి అంటాడు ఓబులేషు. దీంతో అది దిలీప్ ఇల్లు ఉండే వీధిలోనే ఉంటాడు.. అని వెన్నెల.. జానకితో చెబుతుంది. మరోవైపు వెన్నెలను చూసిన ఓబులేష్.. మా వీధి చివర ఉండే పద్మావది గారి అబ్బాయి.. మీరు ప్రేమించుకున్నారు కదండి అని అడుగుతాడు ఓబులేష్.

దీంతో వెన్నెల షాక్ అవుతుంది. మిమ్మల్ని నేను రెండుమూడు సార్లు బండి మీద చూశానండి అంటాడు ఓబులేష్. గుడిలో కూడా చూశాను అండి. అంటే మీది ప్రేమ పెళ్లి అన్నమాట అంటాడు ఓబులేష్. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

8 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

8 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

10 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

11 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

12 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

13 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

14 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

15 hours ago