Janaki Kalaganaledu 16 August 2022 Episode : మల్లికకు మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానంభ.. రాఖి కట్టలేకపోయినందుకు బాధపడుతున్న జానకి..

 Authored By prabhas | The Telugu News | Updated on :16 August 2022,11:20 am

Janaki Kalaganaledu 16 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 367 ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు మనం చూద్దాం.. జానకి, రామ జ్ఞానాంబ గురించి మాట్లాడుతుండగా జ్ఞానం అక్కడనుండి చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మల్లికా ఆకలితో మండిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో రూమ్లో కరెంట్ పోతుంది. దాంతో మల్లిక బయటకు వస్తుంది. అక్కడ జానకి హెడ్ లైట్ పెట్టుకుని చదువుకుంటూ ఉంటుంది. దానిని చూసి మల్లికా భయపడి పోయి దెయ్యం దెయ్యం అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అందరూ అక్కడికి వస్తారు. ఏంటి నీ గోల దయ్యం దెయ్యం ఎక్కడుంది. దెయ్యమని జ్ఞానంబ అంటుంది. అప్పుడు గోవిందరాజు నిన్ను చూసి నువ్వే దెయ్యం అనుకొని ఉంటావని సెటైర్ వేస్తాడు. కానీ మల్లికా జానకి మీ రూమ్ లోనే దెయ్యం ఉంది అని చెప్తుంది. అది దెయ్యం కాదు..

అది చదువుకునే లైట్ అని రామ తనకి చూపిస్తాడు. అప్పుడు మల్లికా నేను దెయ్యం అనుకొని అడలి సచ్చాను. అని అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అప్పుడు జ్ఞానాంబ జానకికి తొందర్లో పరీక్షలు ఉన్నాయి అంట. ఆ పరీక్షలు అయిపోయే వరకు ఇంటి పనులన్నీ నువ్వే చూసుకో మల్లికా అని మల్లికకు చెప్తుంది. అప్పుడు మల్లికా మండిపోతు తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మల్లిక ఇంట్లో పనులు చేస్తూ…జ్ఞానాంబని తిడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు తన పని ఎలాగైనా చెప్పాలి అని ఇల్లు తుడుస్తుంటే అక్కడక్కడే ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తుంది మల్లిక. అప్పుడు గోవిందరాజు పిలు నువ్వు ఇందాకల చికిత తో అన్న మాటలన్నీ నేను వీడియో తీశాను అవి చెప్తాను. అని అంటాడు. గోవిందరాజు తనతో కొద్దిసేపు ఆడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అఖిల్ జెస్సి సరదాగా బైక్ మీద వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే జానకి పూజ ముగించి అందర్నీ పిలుస్తుంది. అప్పుడు అందరూ అక్కడికి వస్తారు.

Janaki Kalaganaledu 16 August 2022 Full Episode

Janaki Kalaganaledu 16 August 2022 Full Episode

అప్పుడు గోవిందరాజు, జానకి తన గొప్పతనం గురించి చెప్తాడు. వెన్నెల రామకి రాఖీ కట్టి తనని ఎంతో గొప్పగా పొగుడుతుంది. రామ అప్పుడు వెన్నెలకి గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత విష్ణు కి, అఖిల్ కి కూడా కడుతుంది. తర్వాత చక్రీకి, చికిత కడుతుంది. అక్కడికి అంతలో మల్లికా వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. అప్పుడు మల్లిక నేను చెప్పకుండానే ఎలా వచ్చావురా అని అడుగుతుంది. అప్పుడు అతను అత్తయ్య రాత్రి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది అని అంటాడు. అప్పుడు మల్లికా జ్ఞానాంబని మీరు నా దేవత అత్తయ్య అని పొగుడుతూ ఉంటుంది. చాలే ఆపు అని మీ తమ్ముడికి రాఖీ కట్టు అని చెప్తుంది. అప్పుడు మల్లికా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టుకుంటూ సంతోష పడిపోతూ.. ఒకపక్క జానకి నన్ను చూసి బాధపడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తూ జానకి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి