Janaki Kalaganaledu 17 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 239 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్నెల ప్రేమ విషయాన్ని సుబ్బరాజు వాళ్లు ఎక్కడ జ్ఞానాంబకు చెబుతారో అని రామా, జానకి టెన్షన్ పడతారు. ఎలాగైనా వాళ్లను మన ఇంటికి వెళ్లకుండా ఆపాలని అనుకుంటారు. దీంతో రామా అతడికి ఫోన్ చేస్తాడు కానీ.. సుబ్బరాజు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏం చేద్దాం అని ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. ఇంతలో సుబ్బరాజు వాళ్లు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వీళ్లను చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ. కూర్చోవడానికి రాలేదండి. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాం అంటాడు సుబ్బరాజు.
రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు వచ్చారేంటి అని అనుకుంటున్నారా. ఇలా రావాల్సి వస్తుందని మేము కూడా అనుకోలేదు. ఇలాంటి సమయంలో వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి అంటాడు సుబ్బరాజు. ఏమైందండి.. ఏ విషయం గురించి మీరు మాట్లాడేది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో సుబ్బరాజు అన్ని విషయాలు చెబుతాడు. ఇంతలో జ్ఞానాంబ.. రామాకు ఫోన్ చేస్తుంది. దీంతో అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు రామా. వెంటనే లిఫ్ట్ చేస్తాడు. రామా.. ఉన్నపళంగా ఇక్కడికి రండి. వెంటనే ఇంటికి వచ్చేయండి అంటుంది జ్ఞానాంబ. ఏమైంది అమ్మ అంటే.. రామచంద్రాపురం నుంచి పెళ్లివాళ్లు వచ్చారు. క్షణాల్లో మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది జ్ఞానాంబ.
దీంతో రామా, జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ముందైతే ఇంటికి వెళ్దాం పదండి అంటాడు రామా. దీంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. ఇంటి వాళ్లు అందరూ వస్తారు. అందరూ రామా, జానకి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రామా, జానకి వస్తారు.
రామా.. వీళ్లెందుకు వచ్చారో తెలుసా అని అడుగుతుంది జ్ఞానాంబ. వచ్చి ఏం చెప్పారో తెలుసా అని అడుగుతుంది. ఊహించలేదు. రేపు పొద్దున నిశ్చితార్థం పెట్టుకొని ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు అంటుంది జ్ఞానాంబ.
రేపు జరగాల్సిన వెన్నెల నిశ్చితార్థం జరగదు అంటుంది జ్ఞానాంబ. సారీ సార్.. మీ చెల్లెలును నేను పెళ్లి చేసుకోలేను అంటాడు పెళ్లి కొడుకు. మా నానమ్మ వేరే వాళ్లకు మాటిచ్చింది.. నా పెళ్లిని వాళ్ల అమ్మాయితో జరిపిస్తానని. ఈ విషయం ఈరోజే చెప్పింది.. అంటాడు పెళ్లి కొడుకు.
అందుకే.. మీ చెల్లెలును నేను పెళ్లి చేసుకోవడం కుదరదు సార్.. దయచేసి అర్థం చేసుకోండి అంటాడు పెళ్లి కొడుకు. బుద్ధుందా మీకు.. ఇంకోసారి ఆ మాట అన్నారంటే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నారు. ఒక ఆడపిల్ల పెళ్లంటే ఏమనుకుంటున్నారు అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ.
ఎందుకు నిశ్చితార్థం ఆగిపోయింది అని అందరూ అనుకుంటే మేం ఏం చేయాలి.. శుభమా అంటూ పెళ్లి కుదిరి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతే ఆ ఆడపిల్లను దురదృష్టవంతురాలు అంటారు. నిశ్చితార్థం ఆగిపోయిన అమ్మాయికి మరో సంబంధం రావాలంటే చాలా కష్టం. మీరు చేసిన తప్పుకు, నా కూతురు బాధపడాలా.. దాని భవిష్యత్తు నాశనం కావాలా అంటుంద జ్ఞానాంబ.
మా అమ్మ అలా బెదిరించడంతో తప్పయినా ఈ పని చేయాల్సి వచ్చింది. లేదంటే మా అమ్మ ప్రాణాలతో ఉండదు అంటాడు సుబ్బరాజు. ఇలా చేయడం తప్పే అండి అంటుంది. విష్ణు కోపంతో పెళ్లి కొడుకు గల్ల పట్టుకొని కొట్టబోతాడు. ఇవన్నీ ముందు తెలుసుకోవాలని తెలియదా అంటాడు విష్ణు.
అమ్మ.. భయపెట్టి ఈ పెళ్లి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చేయలేం కదా అంటాడు విష్ణు. నిశ్చితార్థం ఆగిపోతే అది ఆడపిల్లకు నష్టం అంటుంది. దీంతో వెన్నెల నా చెల్లెలు. తన భవిష్యత్తు కోసం నేను ఆలోచించకుండా ఉంటానా.. అంటాడు రామా.
ఇవాళ నిశ్చితార్థం ఆగిపోయినందుకు మనం బాధపడుతున్నాం కానీ.. రేపు పెళ్లి అయ్యాక విడిపోవాల్సి వస్తే.. అప్పుడు తట్టుకోగలమా.. అని జ్ఞానాంబతో చెబుతుంది జానకి. మన వెన్నెలకు ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది. వాళ్లు వద్దు అంటున్నప్పుడు బతిమిలాడటం.. బెదిరించడం ఎందుకు వదిలేద్దాం అత్తయ్య గారు అంటుంది జానకి.
మీరు చేసిన మోసానికి.. మీ అంతు చూడకుండా వదిలిపెట్టేదాన్ని కాదు. కానీ.. నా కొడుకు కోడలు చెప్పారని మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈ జన్మలో మీ మొహం నాకు చూపించకండి. వెళ్లండి అని చెప్పి జ్ఞానాంబ కోపంతో ఇంట్లోకి వెళ్లిపోతుంది.
మరోవైపు వెన్నెలకు ఎందుకు ఇలా జరుగుతోంది అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది జ్ఞానాంబ. ఇంతలో రామా, జానకి ఇద్దరూ తన దగ్గరికి వస్తారు. అమ్మా.. నువ్వు ఏ విషయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో మేము అర్థం చేసుకోగలం అంటాడు రామా.
వెన్నెలకు ఒక మంచి సంబంధం చూసి త్వరగా పెళ్లి జరిపిద్దాం అంటాడు రామా. అప్పుడే ఈ బాధ, ఏదైనా ఆశుభం వెంటాడుతుందనే భయం రెండూ ఉండవు. ఏమంటావు అమ్మ అంటుంది జ్ఞానాంబ. నువ్వు చెప్పింది నిజమే రామా. మీ నాన్న.. మీ నానమ్మ దగ్గరికి వెళ్లారు కదా. రాగానే తెలిసిన వాళ్లతో మంచి సంబంధం చూడమని చెబుతాను అంటుంది జ్ఞానాంబ.
అమ్మ.. జానకి గారు ఇంతకుముందు ఒక విషయం చెప్పారు అంటాడు రామా. అత్తయ్య గారు మాకు తెలిసిన దూరపు బంధువుల అబ్బాయి ఒకరు ఉన్నాడు. ఆ అబ్బాయి ఈడు జోడు కూడా మన వెన్నెలకు చక్కగా సరిపోతుంది. వాళ్లు తెలిసిన వాళ్లు కాబట్టి.. వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెబుతుంది జానకి.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన వెన్నెల సంతోషంగా ఉంటుంది అని చెబుతుంది జానకి. ముందు మీరు, మామయ్య గారు వెళ్లి చూసి రండి.. అన్నీ మాట్లాడుకొని రావచ్చు అంటుంది జానకి. దీంతో మీ నాన్న ఊరికి వెళ్లి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ముందు మీరిద్దరు వెళ్లి చూసి రండి అని చెబుతుంది జ్ఞానాంబ.
దీంతో రామా, జానకి ఇద్దరూ సంతోషం వ్యక్తం చేస్తారు. మనం వెళ్లి ఎంత బతిమిలాడినా ఒప్పుకోని వాళ్లు మన ఇంటికి వచ్చి వాళ్ల మీద నింద వేసుకొని అన్ని అవమానాలను ఎలా భరించారు అని జానకితో అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.