Anchor Pradeep : యాంకర్ ప్రదీప్‌ స్థానంలో శ్రీముఖి.. అతడు లేకుంటే జనాలు పట్టించుకుంటారా?

Anchor Pradeep : తెలుగు బుల్లితెర పై సింగింగ్ షోల సందడి సుధీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈటీవీలో పాడుతా తీయగా మొదలుకొని జీ తెలుగులో మరియు మా టీవీ లో ఎన్నో సింగింగ్‌ షో లు వచ్చాయి. కానీ ఎక్కువ షో లు నిరాశపరిచాయి. ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నడిచిన పాడుతా తీయగా మాత్రమే సుదీర్ఘ కాలం కొనసాగింది. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు పాడుతా తీయగ షో ను చేస్తున్నాడు. ఇప్పుడు ఆ షో కు కూడా జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప సింగింగ్ షో కూడా ఒక మోస్తరు గుర్తింపును దక్కించుకుంది. గత సీజన్లలో మంచి రేటింగ్ ని దక్కించుకోలేక పోయినా గౌరవం నిలుపుకునే స్థాయిలో మాత్రం ప్రేక్షకులు నుండి స్పందన దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.ఈ పాటల ప్రోగ్రాం కు ఇప్పుడు కొత్త సీజన్ మొదలు కాబోతుంది.

ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఈనెల 20వ తారీఖున మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. ప్రోమో చూసిన తర్వాత ఈ షో సక్సెస్ అయ్యేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గత సీజన్లో యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించాడు. ప్రదీప్ ఉన్నాడు కనుక గత సీజన్లను జనాలు ఆదరించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి గ్లామర్ తో షో కి ఎంత వరకు ఆ హైలెట్ అవుతుంది అనేది తెలియదు. యాంకర్ గా ప్రదీప్ లేకపోవడం కచ్చితంగా ఒక లోటు అనడంలో సందేహం లేదు. దానికి తోడు జడ్జి లు మారడం మరియు కంటెస్టెంట్ ల ఎంపిక, షో ఫార్మెట్ ను కూడా మార్చడం చేశారు. ఇలా చాలా మార్పులు చేర్పులు చేసి మొదలు పెట్టబోతున్న ఈ సింగిల్ షో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

zee telugu sarigamapa show with sreemukhi and whit out anchor pradeep

యాంకర్ గా ప్రదీప్ లేనప్పుడు ఈ షో ను జనాలు చూస్తారా అనే తలెత్తుతోంది. ఈ మధ్య కాలంలో యాంకర్ ప్రదీప్ తన షోలను చాలా తగ్గించాడు. హీరోగా సినిమాలు చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. బుల్లి తెరపై సందడి తగ్గించడమే కాకుండా వెండి తెరపై కూడా ఈయన కనిపించట్లేదు. దాంతో అభిమానులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ షో ను కూడా వదిలేయడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. ప్రదీప్‌ మళ్లీ బిజీ అవ్వాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ షో కు రేటింగ్‌ రాకుంటే ఆయన మధ్యలో అయినా జాయిన్ అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీముఖి ఏ స్థాయిలో ఈ షో ను రక్తి కట్టిస్తుంది అనేది చూడాలి. పాడుతా తీయగా జనాలను అలరించలేక పోతున్న ఈ సమయంలో సరిగమప షో కాస్త క్రియేటివిటీగా ప్లాన్‌ చేస్తే తప్పకుండా మంచి రేటింగ్ వచ్చేది. కాని ప్రదీప్‌ లేకపోవడంతో మొత్తం తారు మారు అయ్యేలా ఉంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago