Home » Entertainment » Janaki Kalaganaledu 17 Jan 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 17 Jan Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జానకి.. రామాకు అసలు విషయం చెప్పిన వెన్నెల.. దీంతో రామా షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: January 17, 2022, 11:20 am
Advertisement

Janaki Kalaganaledu 17 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్నెల సంబంధం క్యాన్సిల్ అయిందని ఫోన్ చేసి వాళ్లు గోవిందరాజుకు చెబుతారు. దీంతో ఆ విషయాన్ని గోవిందరాజు ఇంట్లో వాళ్లకు చెబుతాడు. జ్ఞానాంబ చూశావు కదా.. ఈవిడ గారి నిర్వాకం. శుభమా అంటూ వచ్చిన మొదటి సంబంధమే ఈమె కారణంగా చెడిపోయింది. రేపటి రోజున దీనికి ఏ లెక్కన సంబంధాలు వస్తాయి. నేను చెప్పిన రోజే ఈవిడ గారిని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఉంటే ఇవాళ మన ఇంటి పరువు రోడ్డున పడి ఉండేదా. నా మనవరాలికి ఇలాంటి పెళ్లి సంబంధం తప్పిపోయి ఉండేదా.. చెప్పు జ్ఞానాంబ. ఈవిడ గారిని ఇంకా ఇంట్లోనే పెట్టుకొని ఇంటి మర్యాదను ఇంకా బయట పడేస్తావా? లేక ఇంటి నుంచి బయటికి పంపించేసి ఇక జాగ్రత్త పడతావా.. నీకు కోడలు ముఖ్యమా.. ఈ ఇంటి పరువు ముఖ్యమా.. నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటూ జ్ఞానాంబను మైరావతి అడుగుతుంది.

Advertisement

janaki kalaganaledu 17 jan 2022 full episode

దీంతో.. అత్తయ్య గారు ఆరోజు మీ మాటను కాదని తప్పు చేశాను. ఈరోజు ఆ తప్పును సరిదిద్దుకుంటాను.. అంటుంది జ్ఞానాంబ. జానకి.. ఈ క్షణం నుంచి నీకు ఈ ఇంటితో సంబంధం.. రామాతో ఉన్న భార్య అనే అనుబంధం తెగిపోయాయి. ఈ ఇంట్లో నుంచి రామా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపో జానకి అని జ్ఞానాంబ అందరి ముందు చెప్పేస్తుంది. దీంతో మైరావతి చాలా సంతోషిస్తుంది. మల్లిక కూడా ఖుషీ అవుతుంది. వెన్నెల షాక్ అవుతుంది. రామాకు ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ.. ఏంటమ్మా ఇది.. చిన్న విషయానికే జానకి గారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోమని చెప్పడం ఏంటి అంటే.. ఇది చిన్న విషయం కాదు.. అత్తయ్య గారి ముందు నా పరువుకు సంబంధించిన విషయం. నీ కోడలు మంచిది అన్నావు కదా.. అంటూ నన్ను ప్రశ్నిస్తుంటే నేను ఏం సమాధానం చెప్పాలి అంటుంది జ్ఞానాంబ.

Advertisement

ఇంతలో వెన్నెల వెళ్లి అది కాదు అమ్మా.. అసలు ఏం జరిగింది అని చెప్పబోతుంటే.. జానకి ఆపుతుంది. వెన్నెల వద్దు.. ఈ ఇంటి పరువు పోవడానికి నేనే కారణం. కాబట్టి నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెబుతుంది జానకి. అత్తయ్య గారు మీకు బాధ కలిగించినందుకు.. మీ అత్తయ్య గారి ముందు మీరు తల దించుకునే పరిస్థితి వచ్చినందుకు నన్ను క్షమించండి అంటుంది జానకి.

మీ మాటను, మీ నిర్ణయాన్ని గౌరవించి నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని చెబుతుంది జానకి. దీంతో రామా బైక్ వేసుకొని ఎక్కడికో వెళ్తాడు. మరోవైపు వెన్నెల ఎలాగైనా ఈ విషయం కనీసం అన్నయ్యకైనా చెప్పాలి అనుకుంటుంది వెన్నెల.

Advertisement

Janaki Kalaganaledu 17 Jan Today Episode : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జానకి

జానకి నడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. రామా.. జానకి కోసం వెతుకుతుంటాడు. కానీ.. జానకి ఎక్కడా కనిపించదు. దీంతో రామాకు పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. తన పాత రోజులను గుర్తకు తెచ్చుకుంటాడు రామా.

నేను మిమ్మల్ని ఎప్పుడూ దూరం చేసుకోలేను. ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని వదలను.. అని రామా జానకితో అప్పట్లో అన్న విషయాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. మీరు గుమ్మం దాటి వెళ్తుంటే నేను ఏం చేయలేకపోయాను అనుకుంటాడు.

ఇంతలో వెన్నెల పరిగెత్తుకుంటూ వస్తుంది. అన్నయ్య అంటూ వస్తుంది. మీ వదిన కోసం వెతకడానికి వచ్చావా.. నేను చూస్తానులే.. నువ్వు వెళ్లు అంటాడు రామా. కన్నబాబుతో ఎందుకు గొడవ జరిగిందో మీ అమ్మ నాకు చెబితేనే కదా.. నేను అమ్మతో చెప్పడానికి.. అని వెన్నెలతో అంటాడు రామా.

వదిన ఇంట్లో నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావడానికి కారణం నేనే అంటుంది వెన్నెల. దీంతో రామా షాక్ అవుతాడు. నావల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు అన్నయ్య అంటుంది వెన్నెల. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది.. అంటాడు రామా. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు.

Advertisement

ఏంటమ్మా.. ఏడిస్తే ఎలా ఏమైందో చెప్పు అంటాడు రామా. దీంతో అన్నయ్య.. నన్ను క్షమించు అంటాడు. అన్నయ్య.. ఈ విషయం నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. అలాగే నా కారణంగా వదిన శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు అంటుంది.

ఆ కన్నబాబు నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. కన్నబాబు.. మల్లిక వదిన చేయి విరవబోతుంటే జానకి వదిన వచ్చి కన్నబాబును కొట్టింది. అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం నేనే. నేను ఒకతడిని ప్రేమించాను.. అంటూ అసలు విషయం చెబుతుంది వెన్నెల.

మరోవైపు జానకి వెళ్లి ఆత్రేయపురం బస్ స్టాండ్ లో కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్లాలో తనకు అర్థం కాదు. నాగురించి తలుచుకొని రామా గారు చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన బాధను తట్టుకోలేరు. అంత తేలికగా ఆ బాధ నుంచి బయటికి రాలేరు. రామా గారు.. నేను ఇంటి నుంచి బయటికి రావాల్సిన బాధ కంటే మీ గురించి నాకు బాధ అని అనుకుంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి