Janaki Kalaganaledu 17 March Today Episode : వెన్నెల నిశ్చితార్థం జరగకుండా ఆపేసిన మల్లిక.. జానకి అసలు రూపం మైరావతికి చెప్పిన మల్లిక. దీంతో జ్ఞానాంబ షాక్

Janaki Kalaganaledu 17 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 259 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి అందరూ కాసేపు సరదాగా గడిపి ఆరుబయటే నిద్రపోతారు. రామాకు ఇంతలో మెళకువ వస్తుంది. మెల్లగా డోర్ తీసి ఇంట్లోకి వెళ్తాడు. డోర్ వేస్తాడు. అప్పుడే లేచిన మల్లిక.. రామా ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తుంది. ఈ టైమ్ లో రామా ఎక్కడికి వెళ్లాడు అనుకుంటుంది. ఇంతలో రామా లోపలికి వెళ్లి గొరింటాకు తీసుకొచ్చి పడుకున్న జానకి దగ్గరికి వచ్చి తన చేయిని తీసుకుంటాడు. తన చేయిని తీసుకొని గోరింటాకు పెడుతుంటాడు. అప్పుడే తనకు మెళకువ వస్తుంది. తనకు గోరింటాకు పెట్టడం చూసి సంతోషం వ్యక్తం చేస్తుంది. అప్పుడే లేచిన మల్లిక.. వామ్మో నీ పెళ్లం అంటే ఎంత ప్రేమ అని అనుకుంటుంది మల్లిక.

janaki kalaganaledu 17 march 2022 full episode

నా మొగుడు ఉన్నాడు.. నిద్రపోవడం తప్ప ఏం చేయడు.. అని అనుకుంటుంది. తట్టుకోలేకపోతున్నాను. ఈ రొమాంటిక్ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను అని అనుకొని వెంటనే తుమ్మినట్టు యాక్షన్ చేస్తుంది. దీంతో భయపడి వెళ్లి పడుకుంటాడు. ఇంతలో గుర్తొచ్చింది అంటూ ఓబులేష్ లేస్తాడు. ఆ తర్వాత మరిచిపోయా అని పడుకుంటాడు. మళ్లీ వెళ్లి గోరింటాకు పెడుతుంటాడు. ఏమండోయ్ వెళ్లి పడుకోండి. ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది జానకి. దీంతో మీరు పడుకోలేదా అంటాడు రామా. పడుకోలేదు.. మీ ప్రేమనంతా చూస్తున్నాను అంటుంది జానకి. వెళ్లండి.. అంటుంది. కానీ.. నేను వెళ్లను అంటాడు రామా. దీంతో అత్తయ్య గారు అంటూ పిలుస్తుంది. దీంతో వెంటనే వెళ్లి పడుకుంటాడు రామా. ఈ సరసాలు ఏంటయ్య స్వామి అని అనుకుంటుంది మల్లిక.

కట్ చేస్తే తెల్లారుతుంది. అందరూ రెడీ అవుతారు. అందరూ హడావుడిగా పని చేస్తుంటారు. వీళ్ల హడావుడి ఏంటి.. జరగని నిశ్చితార్థానికి వీళ్లు వీళ్ల హడావుడి మామూలుగా లేదు కదా అని అనుకుంటుంది మల్లిక. సంతోషంలో డ్యాన్స్ వేస్తూ ఉండగా.. మైరావతి తనను చూస్తుంది.

అమ్మమ్మ గారు అంటుంది. కొంపదీసి వినేసిందా ఏంటి అని అనుకుంటుంది మల్లిక. కానీ.. మల్లిక వైపు మైరావతి అలాగే చూస్తుంటుంది. ఇలారా అంటుంది. ఏంటే తైతక్కలాడుతున్నావు అంటుంది మైరావతి. హమ్మయ్య.. చూడలేదన్నమాట అనుకుంటుంది.

చెప్పండి అమ్మమ్మ గారు అంటుంది మల్లిక. ఏంటే నీలో నువ్వే అలా బాధపడుతున్నావు అంటుంది మైరావతి. ఎందుకంటే ఏం చెప్పను అమ్మమ్మ గారు. ఇంట్లో అందరూ తలో పని చేస్తున్నారు. కానీ.. నాకే ఏ పనీ చెప్పడం లేదు.. అందుకే బాధనిపిస్తోంది అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 17 March Today Episode : ఘనంగా జరుగుతున్న నిశ్చితార్థంలో అవాంతరం

నేనున్నాను కదా. నీ సంగతి నేను చూస్తాను కదా అంటుంది. పని వాళ్లను పిలిచి.. వాళ్లు చేసే పనులన్నీ మల్లికను చేయమంటుంది. కట్ చేస్తే మగ పెళ్లి వాళ్లు వస్తారు. పెళ్లికొడుకు దిలీప్ ను చూసి.. ఎక్కడో చూశాను.. ఎక్కడ చూశాను అని అనుకుంటాడు ఓబులేష్. కానీ.. తనకు అస్సలు గుర్తు రాడు.

మరోవైపు నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. వెన్నెల సంతోషంగా ఉంటుంది. జానకి గారు వీళ్లకు పెళ్లి చేయాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు నాలో నేనే ఎంతో కంగారు పడ్డాను. ప్రస్తుతానికి అంతా సెట్ అయినప్పటికీ.. ఎక్కడి నుంచి ఏం ముంచుకొస్తుందో అని నాకు తెగ భయమేస్తోంది అని జానకితో అంటాడు రామా.

నిశ్చితార్థం జరుగుతుండగా ఒక్కసారి పైకి లేచి పెద్దమ్మ గారు అంటాడు ఓబులేష్. ఏంట్రా అంటుంది. మీకో విషయం చెప్పాలి అంటాడు ఓబులేష్. ఇప్పుడే చెప్పాలి మీకు. ఇప్పుడే చెప్పేస్తాను అంటాడు. దీంతో ఈ అమ్మాయి.. ఈ అబ్బాయి అంటూ ఏదో చెప్పబోతాడు ఓబులేష్.

ఈ అమ్మాయి.. ఆ అబ్బాయిని అంటూ మాట తడబడతాడు. ఇంతలో మాట మార్చేందుకు.. జానకి పాట పాడుతుంది. దీంతో ఓబులేష్ అసలు విషయం మరిచిపోతాడు. ఇంతలో నిశ్చితార్థం అయిపోవడానికి వస్తుంది. దీంతో ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటుంది మల్లిక.

జానకిని పిలిచి అర్జెంట్ గా మాట్లాడాలి పక్కకిరా అంటుంది. ఆ తర్వాత నీ కోడలును జానకి వెన్నుపోటు పొడించింది అని మైరావతికి చెబుతుంది. ఒక్క జానకి మాత్రమే కాదు.. రామా, వెన్నెల అందరూ కలిసి మోసం చేశారని చెబుతుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

44 minutes ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

4 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

6 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

18 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

21 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago