Home » Entertainment » Janaki Kalaganaledu 17 September 2021 Friday Episode 130 Highlights
Entertainment

Janaki Kalaganaledu 17 Sep Today Episode : జానకికి వార్నింగ్ ఇచ్చిన వైజయంతి.. మరోవైపు చిక్కుల్లో వైజయంతి కూతురు.. జ్ఞానాంబను ఇంటికి పిలిచి జానకి చదువు విషయం చెప్పిన వైజయంతి?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 17, 2021, 5:57 pm
Advertisement

Janaki Kalaganaledu 17 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్… 17 సెప్టెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 130 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం మా ఇంటికిరా.. అని వైజయంతి చెప్పడంతో.. ఆమె ఏం అడుగుతుందోనని టెన్షన్ పడుతూ.. తన ఇంటికి బయలుదేరుతుంది. వైజయంతి అర్థం చేసుకుంటుందో.. చేసుకోదో అని తెగ టెన్షన్ పడుతుంది. ఏదైతే అది అయింది అని జానకి.. వైజయంతి ఇంటికి వెళ్తుంది.

Advertisement

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

ఇంట్లోకి వెళ్లి చూస్తే వైజయంతి కనిపించదు. తన కోసం అక్కడా ఇక్కడా వెతుకుతుంది. వైజయంతి గారు.. అని పిలుస్తుంది. దీంతో వచ్చావా జానకి.. అని అంటుంది వైజయంతి. తన దగ్గరికి వచ్చి.. ఆ ఫోటోలను చూపిస్తుంది. ఏంటి ఈ ఫోటోలు.. ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా.. అని నిలదీస్తుంది.

Advertisement

చెప్పు.. ఇందులో డిగ్రీ పట్టా తీసుకుంటుంది నువ్వేనా.. అని అడుగుతుంది. దీంతో జానకికి ఏం చెప్పాలో అర్థం కాదు. నేనే అని అంటుంది. అంటే జానకి చదివింది ఐదో తరగతి కాదు.. డిగ్రీ అన్నమాట. నా స్నేహితురాలు జ్ఞానాంబను జానకి మోసిం చేసిందా.. అని తనలో తాను అనుకుంటుంది వైజయంతి. తన కొడుకు కంటే తక్కువ చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని… నువ్వు ఐదో తరగతి వరకే చదువుకున్నావని.. చెప్పి నీతో రామచంద్రకు పెళ్లి చేసింది. కానీ.. నువ్వు నీ చదువును దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావన్నమాట అని అంటుంది వైజయంతి.

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

Advertisement

దీంతో.. పెళ్లికి ముందు నాకు ఈ విషయం తెలియదు. మా అన్నయ్య.. నా చదువు విషయాన్ని దాచి పెట్టి.. ఈ పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది.. అని వైజయంతికి జానకి చెబుతుంది. దీంతో.. పెళ్లి తర్వాత ఎందుకు నీ చదువు విషయం చెప్పలేవు అని అడుగుతుంది. కాపురం నిలబెట్టుకోవడానికే నేను మా అత్తయ్యకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. మా అత్తయ్యకు చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నించాను కానీ.. అస్సలు నావల్ల కావడం లేదు. జరిగిన విషయాన్ని చెప్పి నా కాపురాన్ని నాశనం చేసుకోవడం కంటే.. నిజాన్న సమాధి చేసి నా కాపురాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నా.. అని చెబుతుంది జానకి.

Janaki Kalaganaledu 17 Sep Today Episode : నువ్వు ఎంత గింజుకున్నా.. ఈ విషయం జ్ఞానాంబకు చెప్పి తీరుతా అని చెప్పిన వైజయంతి

చూడు.. నిన్ను ఇక్కడికి పిలిచింది.. నీ సంజాయిషీ వినడానికి కాదు.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా కాదా.. అని తెలుసుకోవడం కోసం రమ్మన్నాను. ఇక వెళ్లు నువ్వు. నీ చదువు విషయం నీ అత్తయ్యతో చెబుతాను.. అని జానకిని బెదిరిస్తుంది వైజయంతి. ఇది అనుకోకుండా జరిగింది కానీ.. కావాలని చేసింది కాదు.. అని వైజయంతికి రిక్వెస్ట్ చేస్తుంది జానకి. నువ్వు ఎంత బతిమిలాడినా సరే.. ఏం చేసినా సరే.. నేను మాత్రం మీ అత్తయ్యకు చెప్పకుండా ఉండను.. అంటుంది వైజయంతి.

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

నీ చదువును దాచి పెట్టి నువ్వు చేసిన మోసం గురించి మీ అత్తయ్యకు చెప్పి తీరుతాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.. ఇక బయలుదేరు.. అంటుంది. జానకి ఎంత బతిమిలాడినా అస్సలు వినదు వైజయంతి. దీంతో జానకి వెనుదిరుగుతుంది.

Advertisement

నన్ను ఎలాంటి స్థితిలోకి నెట్టేశావు అన్నయ్య.. అమ్మలా ప్రేమను పంచిన అత్తయ్య గారి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. బయటి వాళ్ల ముందు కాళ్లు పట్టుకునే దుస్థితిలో పడేశావు.. అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వైజయంతి.

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

వెంటనే జ్ఞానాంబకు కాల్ చేస్తుంది వైజయంతి. హలో అని ఫోన్ తీయగానే.. జ్ఞానాంబ నేను వైజయంతిని అంటుంది. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి.. ఒకసారి ఇంటికి వస్తావా.. జ్ఞానాంబ అంటుంది. ఏమైంది.. ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడే రమ్మంటున్నావు ఎందుకు అని అడుగుతుంది. ఆలస్యం చేయకుండా తొందరగా రా.. వచ్చాక చెప్తా అంటుంది. దీంతో సరే.. వస్తున్నా అని చెబుతుంది జ్ఞానాంబ. ఎందుకు ఉన్నపళంగా రమ్మంటోంది అని అనుకుంటుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే రామా స్వీట్ షాపు దగ్గర ఉంటాడు. జానకి కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ.. జానకి ఇంకా రాదు. జానకి గారు వెళ్లి చాలా సేపు అయింది. ఇంకా రావట్లేదు ఏంటి.. అని అనుకుంటాడు రామా. జానకి గారు బతిమిలాడినా వైజయంతి గారు అర్థం చేసుకున్నారో లేదో అని అనుకొని వెంటనే ఫోన్ చేస్తాడు రామా. జానకి గారు.. మీ కోసం కంగారుగా ఎదురు చూస్తున్నాను.. ఏమైంది చెప్పండి.. అని అడుగుతాడు. దీంతో లేదండి.. ఎంత చెప్పినా.. ఎంత బతిమిలాడినా ఆమె వినిపించుకోలేదు.. అని చెబుతుంది. తను అర్థం చేసుకోలేదు అని చెబుతుంది. ఖచ్చితంగా నా చదువు గురించి అత్తయ్య గారికి చెబుతాను అని చెప్పారు. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అత్తయ్య గారి కోపాన్ని కూడా ఎదుర్కోవాలి.. అని అర్థం అయింది అని చెబుతుంది జానకి. భయంతో అడుగు కూడా ముందుకు పడటం లేదు అంటుంది జానకి. మీరేం కంగారు పడకండి.. మనం ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కొందాం.. మీరు కొట్టు దగ్గరికి వచ్చేయండి.. ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటాడు రామా.

Advertisement

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

కట్ చేస్తే.. వైజయంతి కూతురును ఒక వ్యక్తి బెదిరిస్తుంటాడు. తన ఫోటోలు ఇంటర్నెట్ లో పెడుతానని బెదిరిస్తాడు. దీంతో వద్దు అలా చేయకండి.. అని ఫోన్ చేసి వేడుకుంటుంది. నాకు పాపలతో పాపం చేయడం తప్ప నాకు ఇంకేం తెలియదు.. అంటాడు ఆ వ్యక్తి. నాకు ధర్మాల గురించి తెలియదు పాపా. అందుకే సైలెంట్ గా నా రూమ్ కు వచ్చి నాతో గడిపి పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్లు అని చెబుతాడు. ఇంతలో అటువైపు వెళ్తున్న జానకి.. వైజయంతి కూతురును చూస్తుంది.

Janaki Kalaganaledu 17 september 2021 friday episode 130 highlights

కట్ చేస్తే.. వైజయంతి ఇంటికి జ్ఞానాంబ వస్తుంది. ఈ విషయం ఇప్పుడే నీకు చెప్పాలి.. అని చెప్పి.. ఓ ఫోటోను చూపించబోతుంది వైజయంతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి