
Janaki Kalaganaledu 18 August 2022 Full Episode
Janaki Kalaganaledu 18 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 369 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జ్ఞానాంబ జానకి వాళ్ళ అన్నయ్యని పిలిపించి జానకి తో తనకి రాకిని కట్టిస్తుంది. అప్పుడు జానకి ఎంతో సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. అప్పుడు జానకి వాళ్ళ అన్నయ్య నన్ను క్షమించు అని జ్ఞానాంబిని, రామని అడుగుతాడు. అని అక్కడినుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞానాంబ ఈ శ్రావణమాసంలో అమ్మవారికి ఆవుపాలతో ఎంతో నిష్టగా పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఆ ఏర్పాట్లు నువ్వు చూసుకో అని జానకికి చెప్తుంది. అప్పుడు మల్లిక నేనున్నాను కదా ఏదో ఒక మంట పెట్టడానికి అని జానకి నిష్టను చెడగొట్టాలని రెడీగా ఉంటుంది. గుళ్లో అమ్మవారి పూజ కోసం అందరూ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. జానకి పొంగలి తయారు చేస్తూ ఉంటుంది.
అఖిల్ ఏమో జెస్సీ దగ్గరికి వెళ్ళాలి అని ఎలా వెళ్లాలి అని కంగారుపడుతూ ఉంటాడు. అప్పుడు రామ, గోవిందరాజు నువ్వు ఎందుకు కంగారుపడుతున్నావ్ పూజ అయిపోయిన తర్వాత వెళ్లులే అని అఖిల్ కి చెప్తారు. ఇక్కడ మల్లికా, జానకి నిష్ట ని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. మల్లిక జానకి దగ్గరికి వచ్చే క్రమంలో ఒక చిన్న పాప పాల బాటిల్ కిందపడేలా మల్లికా తనకి తగులుతుంది. అప్పుడు ఆవిడ పాల పొంగళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ పాప పాలు కింద పడిపోయాయి. ఎవరైనా కొంచెం పాలు పోయండి అని అడుగుతుంది. అప్పుడు అందరూ నైవేద్యం పాలు పోయకూడదమ్మ ఎంగిలి చేసినట్లు అవుతుంది అని అక్కడ వాళ్ళు అంటారు. కానీ జానకి ఆవిడని పిలిచి జానకి అదే పాలను పోస్తుంది. అప్పుడు పక్కన ఉన్నవాళ్లు అలా పోయకూడదమ్మ అని చెప్తారు. కానీ చిన్నపిల్ల చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అని పోసి పంపిస్తుంది జానకి. దాంతో మల్లికకు ఒక ఛాన్స్ దొరికింది. అదంతా చూసి వచ్చి జ్ఞానాంబకి చెప్పాలి అని అనుకుంటుంది.
Janaki Kalaganaledu 18 August 2022 Full Episode
జానకి అంతలో నైవేద్యం తీసుకొని వచ్చి అక్కడ పెట్టబోతుంది. అప్పుడు జానకి ఎంగిలి పాలతో నైవేద్యం చేసింది అని జ్ఞానాంబకి చెప్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ నువ్వు ఇక్కడ కూడా తోటి కోడలు మీద చాడీలు చెప్పడం మానవ అని తిడుతుంది. అప్పుడు మల్లిక నేను చెప్పేది నిజమా అబద్దమా అని జానకిని అడగండి అని అంటుంది. అప్పుడు జానకి చెప్తుంది. అవునుఅత్తయ్య గారు ఒక చిన్న పిల్లాడికి పాలు పోసాను అని అంటుంది. అప్పుడు జ్ఞానంబ జానకిని తిడుతుంది నేను చెప్పాను కదా అలా చేయొద్దు అని అంటుంది. మల్లిక అత్తయ్య గారు మీరు పెట్టిన ఐదు షరతులలో ఒక తప్పు చేసేసింది జానకి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక తప్పును కొట్టేయాలి అని అంటుంది.
అప్పుడు ఆ చిన్న బాబు తల్లి అక్కడికి వచ్చి మల్లికను చూపిస్తూ ఈవిడ నా బిడ్డ పాలు పడిపోయేలా చేసింది. ఆవిడ మా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఆ పాలు నా బిడ్డకు పోయకపోతే నా బిడ్డ చనిపోయేది అమ్మ అని చెప్తుంది. ఆవిడని ఏమనకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో అయ్యగారు కూడా చిన్నపిల్లలకి పాలు పోయడంలో ఎటువంటి తప్పు ఉండదు సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి పాలుపోసినట్లే ఏం పరవాలేదు అమ్మ నైవేద్యం ఇక్కడ పెట్టండి అని చెబుతాడు. అప్పుడు జానకి నైవేద్యం అక్కడ పెడుతుంది. ఇక పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజ ముగిస్తుంది. తర్వాత జానకి ముడుపు కట్టాలని ముడుపు తీసుకొని వస్తూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.