Janaki Kalaganaledu 18 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఫిబ్రవరి 2022 శుక్రవారం ఎపిసోడ్ 240 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సుబ్బరాజు వాళ్లు అత్తయ్య గారికి మన గురించి ఎక్కడ చెబుతారో అని నాకు చాలా భయం వేసింది అని అంటుంది జానకి. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు. మనం వెళ్లి ఎంత బతిమిలాడినా వినని వాళ్లు.. మన ఇంటికి వచ్చి నింద వాళ్ల మీద వేసుకొని ఎలా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారా అని అనిపిస్తోంది అని అంటాడు రామా. ఒక ఆడపిల్ల బాధ వాళ్లకు కనిపించింది అందుకే వాళ్లు అలా చేసి ఉంటారు అంటుంది జానకి. వాళ్లు చేసిన సాయాన్ని అస్సలు మరిచిపోకూడదు. మరోసారి వెళ్లి మనం వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు రామా.
దీంతో అవును.. ఒకసారి వాళ్లింటికి వెళ్దాం అంటాడు రామా. ఇక.. దిలీప్, వెన్నెల పెళ్లిని పెద్దలు కుదుర్చిన పెళ్లిగా మార్చి వాళ్ల పెళ్లి చేస్తే ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది జానకి. కానీ.. నేను కాదు అంటాడు రామా. రామా మళ్లీ బుంగమూతి పెడతాడు. దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు. ఇదుగోండి శ్రీవారు.. రేపు ప్రేమికుల రోజు. రేపు మనకు స్పెషల్ డే. మీరు లా బుంగమూతి పెడితే ఎలా అంటుంది. మనదేమీ ప్రేమ పెళ్లి కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటాడు రామా. ఇదుగోండి శ్రీవారు.. ప్రేమికులు మంచి భార్యాభర్తలు అవుతారో లేదో తెలియదు కానీ.. భార్యాభర్తలు మాత్రం మంచి ప్రేమికులు అవుతారు అంటుంది జానకి.
మరోవైపు మల్లిక గురక పెడుతూ నిద్రపోతూ ఉంటుంది. దీంతో విష్ణుకు చాలా చిరాకు వస్తుంది. ఇంతలో తలుపులమ్మ వస్తుంది. తను గురక పెట్టడం చూసి తొడపాశం పెడుతుంది. టైమ్ 9 కూడా కాలేదు. అప్పుడే నిద్రపోతావా అంటూ తలుపులమ్మ.. మల్లిక పై సీరియస్ అవుతుంది.
మల్లికను తీసుకొని జ్ఞానాంబ దగ్గరికి వెళ్తుంది. కోడలు అన్నాక పడుకునే ముందు అత్త గారికి కాళ్లు పట్టాలి అంటాడు. పిన్ని గారు నాకు కోడళ్లతో కాళ్లు పట్టించుకోవడం ఇష్టం ఉండదు. నా పెద్ద కొడుకు రామచంద్ర నాకు కాళ్లు పడతాడు అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో చికిత వచ్చి పెద్దమ్మ గారికి మల్లికంబ గారు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వదు అని చెబుతుంది. దీంతో దీన్ని ఇలాగే వదిలేస్తే కష్టం అని అనుకొని.. పదా నువ్వు నీ మొగుడి కాళ్లు పట్టు అంటుంది తలుపులమ్మ. ఏంటి.. నేను ఈయన కాళ్లు పట్టమంటావా అంటుంది.
మొగుడి కాళ్లు పట్టు అని బెదిరిస్తుంది. దీంతో సరే అని పడుతుంది మల్లిక. మరోవైపు ప్రేమికుల దినోత్సవం రోజున రామా జానకికి సర్ ప్రైజ్ ఇస్తాడు. పంచె కట్టుకొని వైట్ డ్రైస్ వేసుకొని వస్తాడు. ఏంటి శ్రీవారు విషయం అంటాడు. దీంతో ముందు ఈ చీర కట్టుకోండి అని చెబుతాడు రామా.
తను చీర కట్టుకున్నాక.. తనను ఒక ప్లేస్ కు తీసుకెళ్తాడు. లైట్స్ వేయగానే తను చూసి ఆశ్చర్యపోతుంది. లవ్ సింబల్స్ తో డెకరేట్ చేసి ఉండటంతో తను చూసి షాక్ అవుతుంది. ఇద్దరి ఫోటోలు కూడా అక్కడ ఉంటాయి. ఇదంతా చూసి తబ్బిఉబ్బిబ్బైపోతుంది జానకి.
ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పడ్డారా లేదా అంటాడు రామా. మామూలుగా కాదు రామా గారు. ఇది సర్ ప్రైజ్ కాదు రామా గారు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. నాకు ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్యూ రామా గారు అంటుంది జానకి.
వాలెంటైన్స్ డే రోజు నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి అని అడుగుతాడు రామా. ఐపీఎస్ అవ్వాలనేది మీ కల. ఆ కలను నిలుపుకోకుండానే బలవంతంగా పెళ్లి చేస్తున్నారనేది బాధ. మీరు పెళ్లి చేసుకోకపోయి ఉంటే.. మీకు ఇష్టమైన ఐపీఎస్ వైపు అడుగులు వేస్తూ ఉండేవారు జానకి గారు.
నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా మీకు ఇంత బాధ అంటాడు రామా. అయ్యో.. అదేం లేదు రామా గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు నేను అణువంత కూడా బాధపడేలేదు. నేను బాధపడటానికి కారణం మీరు కాదు అంటుంది. మరేంటి కారణం అని అడుగుతాడు రామా.
మీ బాధకు కారణం పెళ్లి కాదంటున్నారు. మరేంటి అని అడుగుతాడు రామా. కానీ.. జానకి చెప్పదు. మీ ప్రాణానికి ప్రాణమైన ఐపీఎస్ కల.. మీ కళ్ల ముందు ఉన్న అగ్నిహోత్రంలో కాలి బూడిద అవుతుందనా. ప్రతి రోజు మీరు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. అదే బాధ మీ మనసులో మోస్తున్నారు జానకి గారు అంటాడు రామా.
ఆరోజు మీ బాధకు కారణం నాకు తెలియదు. ఈరోజు తెలిశాక కూడా నేను ఏమీ అనకుండా ఉండటం కరెక్ట్ కాదు. ఈ ప్రేమికుల రోజు నేను మిమ్మల్ని ఒక బహుమతి అడుగుతున్నాను. మీ చదువును కొనసాగిస్తానని మీరు నాకు మాటివ్వండి. మీ భర్తగా నన్ను గెలిపించండి.
చెప్పండి జానకి గారు.. మీరు చదువును ఉన్నపళంగా వదిలేస్తున్నానని ఎందుకు అన్నారో చెప్పండి.. అలాగే ఇంకెప్పుడు అలా అననని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఐపీఎస్ అవుతానని నాకు మాటివ్వండి అంటాడు రామా. మీ మాటతో ఈ ప్రేమికుల రోజు నాకు కూడా ఒక అందమైన జ్ఞాపకంగా మిగల్చండి అని అడుగుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.