Janaki Kalaganaledu 18 Jan Today Episode : బస్సు ప్రమాదంలో జానకి మృతి.. విషయం తెలిసి కుప్పకూలిపోయిన రామా.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

Janaki Kalaganaledu 18 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 217 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని మనం మాట్లాడుకున్నాం కానీ.. వెన్నెల గురించి అత్తయ్య గారికి తెలిస్తే ఎలా ఉంటుందో అని నేను మీకు ఈ విషయం చెప్పలేదు.. నన్ను క్షమించండి రామా గారు అంటూ బస్టాండ్ వద్ద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. మరోవైపు వదిన కన్నబాబును ఎందుకు కొట్టిందో చెబితే నా ప్రేమ విషయం బయట పడుతుంది. అప్పుడు అమ్మ పెంపకాన్ని, నమ్మకాన్ని వమ్ము చేశానని అమ్మ నన్ను చంపినా చంపేస్తుంది. నా గురించి, మన ఇంటి పరువు గురించి ఆలోచించి వదిన ఆ నిజం చెప్పలేదు అన్నయ్య. అమ్మ పరువు పోయేలా నేను ఎప్పుడూ ప్రవర్తించను. కాకపోతే దిలీప్ మంచివాడు. ఈవిషయం అందరికంటే ముందే నీకే చెబుతామనుకున్నా కానీ.. ఇంతలో ఇవన్నీ జరిగిపోయాయి.. అని వెన్నెల రామాతో అంటుంది.

janaki kalaganaledu 18 january 2022 full episode

నా కారణంగా వదిన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నువ్వు బాధపడటానికి కారణం అయ్యాను. నన్ను క్షమించు అన్నయ్య అంటూ వెళ్లి రామా కాళ్లు పట్టుకుంటుంది వెన్నెల. చూడు.. ప్రేమించడం తప్పు కాదు కానీ నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకు నువ్వు ప్రేమించిన రోజే చెప్పకపోవడం తప్పు. ఇలాంటి సమస్యలు వస్తాయనే అమ్మ మనకు ప్రేమ పెళ్లి వద్దు అని చెప్పింది. తన పెంపకం.. తన నమ్మకం మంట కలిసిపోయాయని తెలిసి అమ్మ ఎంత కుమిలిపోతుందో తెలుసా. ఆ దేవుడైనా తప్పు చేస్తాడేమో కానీ.. నా పిల్లలు పొరపాటున కూడా చేయరని అమ్మ భావిస్తుంది. అలా కాకుండా అమ్మ కంట్లో కన్నీళ్లు తెప్పిస్తే మనకు అంత కన్నా అవమానం ఇంకోటి ఉండదు.

ఈ గొడవలు జరగనప్పుడు మీ ప్రేమ విషయంలో అమ్మతో ఎలాగోలా మాట్లాడేవాడిని. కానీ ఇంత జరిగాక అమ్మతో ఈ విషయం మాట్లాడాలంటే చాలా కష్టం. ఇప్పుడు అన్నయ్యను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు. దీంతో నా ప్రేమను నాలోనే సమాధి చేసుకుంటాను కానీ.. నా కారణంగా అన్నయ్య, వదినలు వేరు కావద్దు. ఆ బాధ నన్ను జీవితాంతం వేధిస్తూనే ఉంటుంద.. అంటుంది వెన్నెల.

ఈ విషయం అమ్మకు తెలియకుండా ఏదో విధంగా వదినను ఒప్పించి ఇంటికి తీసుకురా అన్నయ్య.. అంటుంది వెన్నెల. దీంతో నేను వెళ్లి మీ వదినను ఇంటికి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటాడు రామా. జానకి కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు.

మరోవైపు బస్టాండ్ వద్దకు వచ్చి చెక్ చేస్తాడు. అక్కడ కూర్చొని ఉన్న జానకిని చూస్తాడు. తన దగ్గరికి వెళ్తాడు. జానకి.. రామాను చూసి షాక్ అవుతుంది. జానకి చేతులు పట్టుకుంటాడు. నన్ను క్షమించండి జానకి గారు అంటాడు రామా. దీంతో వద్దు అన్నట్టుగా చూస్తుంది జానకి.

కట్ చేస్తే.. మల్లిక వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపిస్తుంది. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు విష్ణు. జానకి వెళ్లిపోయిందని ఏడుస్తున్నాను అని చెబుతుంది మల్లిక. దీంతో విష్ణు షాక్ అవుతాడు.. ఎలా ఉందండి నా పర్ఫార్మెన్స్. నా ఏడుపు చూసి మీ అమ్మ కూడా నమ్మేస్తుంది కదా అంటుంది మల్లిక. దీంతో విష్ణు మరోసారి షాక్ అవుతాడు.

Janaki Kalaganaledu 18 Jan Today Episode : కొన్ని రోజుల పాటు మనం విడిపోయి ఉండక తప్పదు అని రామాకు చెప్పిన జానకి

రామా, జానకి కలిసి ఊరి బయటికి వస్తారు. మంచి స్నేహితులు భార్యాభర్తలు అవుతారో లేదో తెలియదు కానీ.. మంచి భార్యాభర్తలు.. మంచి స్నేహితులు అవుతారు. దానికి మనమే ఉదాహరణ. నా భర్త నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు. ఇంత గొప్ప భర్తకు చెప్పకుండా ఎందుకు దాస్తాను అండి అంటుంది జానకి.

చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు. వెన్నెల పెళ్లి చూపుల రోజు మీకు ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించాను అంటుంది జానకి. ఇక ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదని మీరు అనేసరికి నేను చెప్పలేకపోయాను అంటుంది జానకి.

ఆరోజు మీరు ఒక్క క్షణం నాకు చెప్పే అవకాశం ఇచ్చి ఉంటే ఈరోజు ఇన్ని జరిగి ఉండేవి కావు అంటుంది జానకి. మీరు వదినమ్మ అనే పదానికి సరైన అర్థం చూపించారు అని అంటాడు రామా. అది నా ధర్మం అంటుంది జానకి. మా ఆవిడ బంగారం అండి అంటాడు రామా.

జానకి గారు ఇక ఇంటికి వెళ్దాం పదండి అంటాడు రామా. దీంతో జానకి నేను ఎలా ఇంటికి రాగలను అంటుంది జానకి. ఆ విషయం చెబితేనే నేను ఇంటికి రాగలను. ఆ విషయం చెబితే వెన్నెల ప్రేమ విషయం కూడా బయటపడుతుంది. అదే జరిగితే అత్తయ్య గారు చాలా బాధపడతారు.. అంటుంది జానకి.

అందుకే మనం కొన్నిరోజులు విడిపోక తప్పదు అని చెబుతుంది జానకి. బస్సు రాగానే.. జానకిని బస్సు ఎక్కిస్తాడు రామా. జాగ్రత్త అని చెబుతాడు. ఖర్చులకు కొన్ని డబ్బులు ఇస్తాడు రామా. మీరు లేకుండా నా వల్ల ఎలా అవుతుంది అని అనుకుంటాడు రామా. ఇంతలో బస్సు బయలుదేరుతుంది.

బస్సు వెనకే పరిగెడుతుంటాడు రామా. ఆ తర్వాత బస్సు వెళ్లిపోతుంది. కొంత దూరం వెళ్లాక బస్సు బ్రేకులు పనిచేయవు. దీంతో బస్సు అటూ ఇటూ స్పీడ్ గా వెళ్తుంది. మరోవైపు కన్నబాబు ఫుల్లుగా తాగుతుంటాడు. వద్దురా తాగకురా అంటూ బతిమిలాడుతుంది సునంద.

వద్దు నన్ను ఆపకు.. జానకి ముందు నా పరువు తీశావు. రేపు నేను ఎలా తల ఎత్తుకొని బతకగలను.. అంటూ కన్నబాబు బాధపడిపోతాడు. మరోవైపు బస్సు ప్రమాదంలో జానకితో పాటు మరో పది మంది చనిపోతారు. దీనికి సంబంధించిన వార్తను న్యూస్ లో తెలుసుకొని రామా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

8 minutes ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

1 hour ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

2 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

3 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

4 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

5 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

6 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

7 hours ago