
Janaki Kalaganaledu 18 may 2022 full episode
Janaki Kalaganaledu 18 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మే 2022, బుధవారం ఎపిసోడ్ 303 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ కాంపిటిషన్ కు ఎలాగైనా రామాను పంపించాలని అనుకుంటుంది జానకి. అదే విషయాన్ని ఎలాగైనా జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. అదే విషయాన్ని మాస్టర్ చెఫ్ పోటీల గురించి రామాకు చెబుతుంది. ఆ రోజు ఫారెన్ అమ్మాయి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తుంది. రెండు మూడు రోజుల్లో పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ పోటీల్లో మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది అని చెబుతుంది జానకి. దీంతో ఈ సమయంలో మనం పోటీల్లో ఎలా పాల్గొంటాం. కన్నబాబుకు లక్ష రూపాయలు కట్టి ఎలాగోలా.. ఈ కష్టం నుంచి గట్టెక్కాలి అంటాడు రామా.
Janaki Kalaganaledu 18 may 2022 full episode
కానీ.. జానకి మాత్రం డబ్బులు ఎలాగోలా సర్దుదాం కానీ.. మీరు ఈ కాంపిటిషన్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. మా అన్నయ్యతో పాటు చాలామంది మీ వృత్తి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ల నోరు మూయించాలంటే ఎలాగైనా మీరు ఈ పోటీల్లో పాల్గొనాలి అంటుంది జానకి. మీరు ఈ పోటీల్లో గెలిస్తే.. అత్తయ్య గారు చాలా సంతోషిస్తారు. ఇటు మా బాధను.. మీ అమ్మ గారి బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది జానకి. మీ బాధ నాకు అర్థం అయింది కానీ.. అది చదువుకున్న వాళ్లు వచ్చేది. నేను వాళ్లలో ఎలా గెలుస్తాను. ఏదో జిలేబీలు చేసుకొని బతికేవాడిని అంటాడు. మీరేం ఆలోచించకండి.. మీరు పోటీల్లో పాల్గొంటున్నారు.. అంతే సరేనా అంటుంది జానకి.
సరే జానకి గారు అంటాడు రామా. దీంతో మా ఆయన బంగారం అంటూ అతడికి ముద్దు ఇస్తుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. రేపు లూసీకి ఫోన్ చేసి.. పోటీల్లో మీ పేరు ఇవ్వమని చెబుతాను ఓకేనా అంటుంది జానకి. దీంతో అంతకంటే ముందు అమ్మకు చెప్పాలి కదా అంటాడు రామా.
దీంతో సరే అంటుంది జానకి. కట్ చేస్తే ఉదయం అవుతుంది. చికిత టీ పట్టుకురా అని జ్ఞానాంబ అనేలోపే.. జానకి తీసుకొస్తుంది. జ్ఞానం చూశావా.. నువ్వు టీ తాగాలని ఇలా అనుకున్నావో లేదో.. మీ కోడలు ఇలా తీసుకొచ్చేసింది అంటాడు గోవిందరాజు.
చివరకు జ్ఞానాంబ.. జానకి ఇచ్చిన టీని తీసుకుంటుంది. తనకు ఎలా ఈ విషయం చెప్పాలా అని ఇద్దరు గుసగుసలు పెట్టుకుంటూ ఉంటారు. ఏంట్రా రాముడు.. ఏదో విషయం చెప్పడానికి మీరిద్దరూ కంగారు పడుతున్నట్టున్నారు అంటాడు గోవిందరాజు.
మీ అమ్మకు చెప్పడానికి కంగారు ఎందుకురా.. మీ అమ్మ చూడటానికి పెద్ద పులిలా ఉంటుంది కానీ.. మీ అమ్మ మనసు వెన్నపూస అంటాడు గోవిందరాజు. దీంతో ఏమైందిరా అని అడుగుతుంది జ్ఞానాంబ. జానకి గారు మీతో మాట్లాడుతారట అంటాడు రామా.
జాతీయ స్థాయిలో బెస్ట్ చెఫ్ పోటీలు జరగబోతున్నాయి అని చెబుతుంది. అంటే అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో వంటల పోటీలు అంటాడు అఖిల్. అందులో గెలిచిన వారికి అవార్డు ఇస్తారు. అవి చాలా పేరున్న పోటీలు అని చెబుతాడు అఖిల్.
బాగా చదువుకున్న వాళ్లు.. ప్రత్యేకంగా హోటల్ మేనేజ్ మెంట్ చదువుకున్నవాళ్లు.. ఈ పోటీల్లో పాల్గొంటారు అని చెబుతాడు అఖిల్. అవును అత్తయ్య గారు అని చెబుతుంది జానకి. రామా గారు ఆ పోటీల్లో పాల్గొంటే బాగుంటుంది అనిపించింది అంటుంది జానకి.
ఆయన ఖచ్చితంగా పోటీలలో గెలుస్తారు అని చెబుతుంది జానకి. మీరు అనుమతిస్తే రామా గారికి ఆ పోటీలకు పంపిద్దాం అంటుంది జానకి. దీంతో వద్దు అంటుంది జ్ఞానాంబ. అదేంటమ్మా.. అలా అన్నావు అంటాడు రామా. దీంతో మన ఊరు కాదు.. మన ప్రాంతం కాదు.. అయినా ఇలాంటి పోటీలకు నువ్వు ఏనాడూ వెళ్లింది కూడా లేదు అంటుంది జ్ఞానాంబ.
అటువంటి పోటీలకు బాగా చదువుకున్న వాళ్లు వస్తారట. అవి చాలా పెద్ద పోటీలు అని చెబుతున్నారు. ఇంగ్లీష్, హిందీ మాట్లాడుకునేవాళ్లు ఉంటారు. అటువంటి చోటకు వెళ్లి నువ్వు ఇబ్బంది పడతావు.. వెళ్లొద్దు అంటుంది జ్ఞానాంబ. దీంతో ఆయనకు అటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను.. అంటుంది జానకి.
మీరు నేర్పించిన మన ప్రాంతీయ వంటకాలు.. పూతరేకులు మీరు రామా గారికి చాలా బాగా నేర్పించారు. ఈ పోటీలలో రామా గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అంటుంది జానకి. ఈయన గురించి జాతీయ స్థాయిలో గొప్ప గౌరవం వస్తుంది. అందరూ చాలా గర్వంగా చూస్తారు అంటుంది జానకి.
అత్తయ్య గారు.. మీ మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా.. రామా గారిని ఆశీర్వదించి పంపించండి అంటుంది జ్ఞానాంబ. దీంతో అవును అమ్మ.. అన్నయ్య ఖచ్చితంగా గెలుస్తాడు అంటాడు విష్ణు. ఒకవేళ చదువుకున్న వాళ్లతో పోటీ పడి రామా గెలవలేకపోతే వాడి మనసు కష్టపెట్టుకుంటాడు.
తెలియని విషయాల్లో తలదూర్చుకోవద్దు. తెలిసి తెలిసి ఇబ్బందులను కొని తెచ్చుకోకూడదు.. అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జానకి దగ్గరికి వచ్చిన జ్ఞానాంబ.. తనను తదేకంగా చూస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని అడుగుతుంది.
దీంతో నా కొడుకును ఏం చేద్దామనుకుంటున్నావు. ఆ పోటీలకు తీసుకెళ్లి నా కొడుకును ఏం చేస్తావు. నీ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. నా కొడుకు ఏం చదువుకున్నాడో నీకు తెలుసు కదా. వాడు వట్టి అమాయకుడని కూడా నీకు తెలుసు.
చదువుకున్న వాళ్లు అక్కడికి వస్తారు. వాళ్లు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతారు. వాళ్లందరి ముందు నా కొడుకును అవమానించాలనే కదా నీ ఉద్దేశం అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు అంటుంది జానకి.
ముమ్మాటికీ నీ ఆలోచన అదే అంటుంది జ్ఞానాంబ. కానీ.. జానకి మాత్రం కాదు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.