Janaki Kalaganaledu 18 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 18 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకితో కలిసి వంటింట్లో టీ చేస్తుంటాడు రామా. మధ్యలో తనతో రొమాన్స్ కూడా చేస్తుంటాడు. మొత్తం మీద ఇద్దరూ చాయ్ చేస్తూ రొమాన్స్ చేసుకుంటారు. అలాగే.. రామా ఒడిలో సేదతీరుతుంది జానకి. వాళ్లను అలా చూసి షాక్ అవుతుంది మల్లిక. అసలు.. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది.. అని చాలా టెన్షన్ పడుతుంది. ఆ పోలేరమ్మ.. ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుంది.. అంటూ తెగ చిరాకు పడుతుంది మల్లిక.
జ్ఞానాంబ మాత్రం ఎవ్వరితో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. దీంతో అటూ ఇటూ ఊపిరి ఆడని మనిషిలా తిరుగుతూ ఉంటుంది మల్లిక. ఇంతలో విష్ణు ఎక్కడికో వెళ్తుంటే.. పిలిచి మీ వదిన టీ పెడుతోంది. తాగి వెళ్దువు కానీ కూర్చో అంటాడు గోవింద రాజు. దీంతో విష్ణు వైపు సీరియస్ గా చూస్తుంది మల్లిక. వెళ్లిపో అన్నట్టుగా చూస్తుంది. దీంతో అక్కడి నుంచి భయపడి వెళ్లిపోతాడు విష్ణు. ఇంతలో రామా వస్తాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావురా అంటాడు గోవిందరాజు. హా.. వంటింట్లోకి వెళ్లి ఉంటాడు అని అంటుంది మల్లిక. ఇంతలో జానకి కూడా చాయ్ తీసుకొని వస్తుంది. దీంతో అందరూ కలిసి చాయ్ తాగుతారు.
ఇంతలో అఖిల్ కాలేజీకి వెళ్తున్నా అని జానకికి చెబుతాడు. దీంతో.. అఖిల్ నువ్వు బాగా చదివి ఈ ఇంటికి మంచి పేరు తీసుకొస్తావని అందరూ అనుకుంటున్నారు. జ్ఞానాంబ ఇంటికి ఎప్పుడూ చెడ్డ పేరు తీసుకురావద్దు అని అంటుంది జానకి. అవును వదిన. నేను బాగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తాను అమ్మ పేరు నిలబెడతాను అంటాడు అఖిల్. ఇంతలో గోవిందరాజు మరోసారి జానకిని పొగుడుతాడు. అమ్మా జానకి నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు అమ్మా. ప్రతిక్షణం నువ్వు ఈ ఇంటి గురించే ఆలోచిస్తున్నావు. ఇంత చిన్న వయసులో ఇన్ని గొప్ప లక్షణాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అమ్మా అని గోవిందరాజు అడిగే సరికి.. అత్తయ్య గారిని చూసి నేర్చుకున్నాను మామయ్య అని అంటుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జానకి అక్కడికి వచ్చి అత్తయ్య గారు టీ తీసుకోండి అంటుంది. దీంతో ఏం మాట్లాడదు జ్ఞానాంబ. మల్లిక కూడా చూస్తుంటుంది. టీ తీసుకోండి అనగానే వద్దు అని చేయితో చెప్పి వెళ్లిపోమంటుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. ఏమైంది అత్తయ్య గారు మీరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది జానకి. మీ మనసు ప్రశాంతంగా లేదు. దేని గురించి మీరు ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది జానకి.
అయినా కూడా ఏం మాట్లాడదు జ్ఞానాంబ. తర్వాత జ్ఞానాంబ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. జానకికి అబద్ధం చెప్పా అన్న పశ్చాతాపం కొంచెం కూడా కనిపించడం లేదు.. అని జ్ఞానాంబ అనుకుంటుంది. ఇంతలో తన అంతరాత్మ వస్తుంది. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అంటుంది. ఎందుకు ఆలోచించకూడదు. పెద్దకొడుకు అంటే పంచ ప్రాణాలు కదా అనగానే భయపడటంలో అర్థమే లేదు అంటుంది అంతరాత్మ. ఒకసారి తమ్ముడి విషయంలో అలా జరిగింది కదా.. మరి.. కొడుకు విషయంలో అలా జరగదు అనే నమ్మకం ఏంటి? అని అంటుంది. జరగదు.. జరగదు అంటే జరగదు.. అని చెబుతుంది అంతరాత్మ. జానకి అలాంటిది కాదు. తమ్ముడి భార్యలా జానకికి అంత పొగరు లేదు. నా తమ్ముడికి అలా జరిగిందని.. నేను జానకి, రామాను విడదీయాలని అనుకుంటున్నానా? అంటూ తనలో తానే అనుకుంటుంది జ్ఞానాంబ.
తర్వాత జానకి చదువు విషయం జ్ఞానాంబ గోవింద రాజుకు చెబుతుంది. దీంతో గోవింద రాజు షాక్ అవుతాడు. జానకి చదువుకుంది 5వ తరగతి కాదు డిగ్రీ. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా అంటుంది జ్ఞానాంబ. ఏంటది అని అడుగుతాడు గోవిందరాజు. జానకి అన్నయ్యను ఉన్నపళంగా రమ్మని చెబుదాం.. అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.