Janaki Kalaganaledu 18 Oct Today Episode : రామాపై ఎదురుతిరిగిన విష్ణు.. జ్ఞానాంబ ముందే జానకిని అవమానించిన మల్లిక.. డబ్బుల విషయంలో రచ్చ

Janaki Kalaganaledu 18 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 412 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం కోసం ఇప్పటి నుంచే కొంత డబ్బు వెనకేయాలి అని చెప్పి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని అనుకుంటారు రామా, జానకి. మరోవైపు జెస్సీ రాగానే తనను తీసుకొని జానకి ఇంటికి వెళ్తుంది. రామా అక్కడి నుంచి కొట్టుకు వెళ్తాడు. మరోవైపు జానకి చదువుకు ఎలాంటి అవాంతరాలు కలిగించకూడదు. తను చేస్తా అని వచ్చినా చేయించొద్దు అని జ్ఞానాంబ.. చికితతో అంటుంది. ఏదైనా జ్యూస్ కలిపి తనకు ఇవ్వు అని చికితతో అంటుంది. దీంతో జానకి అమ్మ గారు ఇంట్లో లేరు అంటుంది. జెస్సీ అమ్మ గారిని తీసుకొని బయటికి వెళ్లారు అంటుంది చికిత. దీంతో టీచరమ్మ వచ్చి పుస్తకాలు కూడా ఇచ్చి వెళ్లింది కదా. ఈ సమయంలో ఎందుకు బయటికి వెళ్లారు అని అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 18 october 2022 full episode

ఇంతలో మల్లిక అందుకొని జానకి బయటికి  చూపించేది ఒకటి.. లోపల చేసేది ఒకటి అని అంటుంది మల్లిక. జానకి మీ మెప్పు కోసం చదువుతున్నట్టు నటిస్తోంది కానీ.. మీరు ఎదురుగా లేకపోతే చదువుతున్న పాపాన పోవడం లేదు అత్తయ్య గారు అంటుంది మల్లిక. ఇంతలో జెస్సీని తీసుకొని ఇంటికి వస్తుంది జానకి. జెస్సీ మనం హాస్పిటల్ కు వెళ్లి వచ్చిన సంగతి అత్తయ్య గారికి చెప్పకు. కంగారు పడతారు అంటుంది జానకి. ఇంతలో వాళ్లను చూస్తుంది జ్ఞానాంబ. ఏంటి జానకి.. చదువుకోకుండా జెస్సీని తీసుకొని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది మల్లిక.

మీ కాలేజీ టీచర్ ఇంటికి వచ్చి పుస్తకాలు ఇచ్చి చదువుకో అని చెప్పినా కూడా నువ్వు తనను తీసుకొని బయటికి ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది జ్ఞానాంబ. అవునా.. మరి నిజంగానే నోట్స్ కోసం వెళ్తే అవి ఏవి మరి అని అడుగుతుంది మల్లిక. దీంతో కొట్టు మూసేసి ఉంది అని అంటుంది జానకి.

ఇంతలో ఊరి పెద్దలు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. జ్ఞానాంబ గారు దసరా మామూళ్లు అంటారు ఊరి పెద్దలు. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి నీ చేతుల మీదుగా ఇవ్వు జానకి అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 18 Oct Today Episode : జానకి డబ్బులు దాస్తుండగా వీడియో తీసిన మల్లిక

దీంతో మల్లికకు కోపం వస్తుంది. సరే అని తన చేతుల మీదుగా జానకి వాళ్లకు డబ్బులు ఇస్తుంది. వాళ్లు వెళ్లిపోయాక.. నీకు ఏదైనా కావాలంటే చికితతోనే, మల్లికతోనే పని చేయించుకో కానీ.. నువ్వు బయటికి వెళ్లకు అంటుంది జ్ఞానాంబ.

దీంతో సరే అంటుంది జానకి. ఆ తర్వాత మల్లికకు చాలా కోపం వస్తుంది. మరోవైపు రాత్రి అవుతుంది రామా కొట్టు మూసేసి ఇంటికి వస్తాడు. ఈనెల షాపునకు వచ్చిన ఆదాయం అని డబ్బు తీసుకొని జ్ఞానాంబకు ఇస్తాడు.

వ్యాపారం ఎలా జరుగుతోంది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో దసరా కదా బాగానే జరుగుతోంది అంటాడు రామా. రామా మూడీగా ఉండటం చూసి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది.

జెస్సీ బిడ్డ కోసం మాత్రమే డబ్బు ఆదా చేయాలంటే అమ్మకు అనుమానం వస్తుందేమో.. అని మనింట్లో ఇద్దరు వారసులు వస్తున్నారు కదా.. వాళ్ల కోసం కొంత డబ్బు బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దామని జానకి సలహా ఇచ్చింది అంటాడు రామా.

దీంతో సరే అని ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తుంది జ్ఞానాంబ. అలాగే.. విష్ణు తెచ్చే డబ్బును కూడా ఇస్తా. ఈ డబ్బు కలిపి ఫిక్స్ డ్ డిపాజిట్ చేయి అని రామాకు డబ్బు ఇస్తుంది. వెంటనే జానకి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెబుతాడు.

ఈ డబ్బులు జాగ్రత్తగా బీరువాలో పెట్టండి అని చెబుతుండగా.. మల్లిక వాళ్ల రూమ్ దగ్గరికి వచ్చి చూస్తుంది. వెంటనే తన ఫోన్ లో రికార్డు చేస్తుంది మల్లిక. జానకి గారు డబ్బులు జాగ్రత్త అంటాడు. పొద్దున బ్యాంక్ కెళ్లి డబ్బులు కట్టేసి వద్దాం అంటాడు రామా.

వీడియోను రికార్డు చేసిన తర్వాత వామ్మో.. అత్తయ్య గారి ముందు వినయంగా నటిస్తూ లోపల ఎంత నాటకం ఆడుతున్నారో.. చెప్తా వాళ్ల సంగతి అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో విష్ణు వచ్చి డబ్బులు లెక్కెట్టి తన అమ్మ దగ్గరికి వెళ్లబోతుండగా పిలుస్తుంది మల్లిక.

నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఈనెల మన షాపుకు వచ్చిన ఇన్ కమ్ ను అమ్మకు ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడు విష్ణు. దీంతో ఏం అవసరం లేదు. ఆ డబ్బును బీరువాలో పెట్టండి అంటుంది మల్లిక.

ఈ ఇంట్లో ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉన్నారు. మీ అన్నయ్య వాళ్లు ఎవరికి తెలియకుండా డబ్బులు బ్యాంకులో దాచుకుంటున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి అని ఆ వీడియోను విష్ణుకు చూపిస్తుంది మల్లిక.

మనం కూడా ఈ ఇంట్లో ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. మనకు పుట్టబోయే బిడ్డ కోసం మన సంపాదన దాచుకుందాం అంటుంది మల్లిక. దీంతో అమ్మ ఏమైనా అంటుందేమో అంటాడు విష్ణు.

దీంతో ఏం కాదు.. మీ అమ్మ అడిగితే మన బిడ్డ కోసం దాచాం అని చెప్పండి అని డబ్బు తీసుకెళ్లి బీరువాలో దాస్తుంది మల్లిక. కట్ చేస్తే ఉదయం అవుతుంది. ఇంతలో వెన్నెల వచ్చి వదిన ఒకసారి దిగి నిలబడు అంటుంది వెన్నెల.

ఏమైంది అంటుంది. దీంతో నిలబడు అని తను నిలబడగానే తనను హత్తుకుంటుంది వెన్నెల. తను జానకి వివరించిన సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వచ్చాయని, అమ్మ కూడా మెచ్చుకుందని చెబుతుంది వెన్నెల.

ఆ తర్వాత ఆ డబ్బు ఇవ్వండి. నేను బ్యాంకుకు వెళ్తాను అంటాడు రామా. దీంతో నేను కూడా వస్తా అంటుంది జానకి. ఇంతలో విష్ణు, మల్లిక ఇద్దరూ ఎక్కడికో వెళ్తుండగా ఒరేయ్ విష్ణు ఇలారా అంటాడు.

నెలనెలా నువ్వు ఇంట్లో ఇచ్చే డబ్బుల గురించి అమ్మ నీతో ఏం చెప్పలేదా అంటాడు రామా. దీంతో చెప్పలేదు అంటాడు విష్ణు. సరే.. అమ్మ పూజ చేస్తుంది కదా.. ఆ డబ్బులు నాకిస్తే అంటాడు రామా.

దీంతో ఆ ఇస్తే అంటూ మల్లిక అడ్డొస్తుంది. మా సంపాదన మాత్రం ఇంట్లో అవసరాలకు వాడి, మీ సంపాదన మాత్రం ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకులో దాచుకుంటున్నారా అంటుంది మల్లిక. దీంతో అదేంటి మల్లిక.. మేము డబ్బులు దాచుకోవడం ఏంటి అంటుంది జానకి.

ఈ మాటలు చేష్టలతోనే అందరినీ మోసం చేస్తున్నారు అంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

56 minutes ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

1 hour ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

2 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

3 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

4 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

5 hours ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

6 hours ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

8 hours ago