Janaki Kalaganaledu 19 April Today Episode : మరోసారి జ్ఞానాంబకు షాకిచ్చిన యోగి.. గుడిలో అందరి ముందు పరువు తీయడంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం
Janaki Kalaganaledu 19 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 282 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఇద్దరూ సీతారాముల కళ్యాణం కోసం పెళ్లి పీటల మీద కూర్చుంటారు. తర్వాత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ.. జ్ఞానాంబ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. స్వామీ అమ్మతో మాట్లాడుకుండా అమ్మకు దూరంగా ఉండటం అంటే.. అది నాకు నరకంతో సమానం. ఈ శ్రీరామనవమికి మేమిద్దరం కలిసిపోయేలా ఆశీర్వదించు తండ్రి అని రామా మనసులో కోరుకుంటాడు.
తల్లికొడుకులు విడిపోవడానికి ఒకరకంగా కారణం నేనే. ఏదైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి కానీ.. తల్లీకొడుకులను మాత్రం కలపండి స్వామీ అని కోరుకుంటుంది జానకి. పూజ అయిపోయాక.. రామా, జానకి.. జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడ అందరూ ఉండటంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. తన ఆశీర్వాదం తీసుకోవడంతో రామా చాలా సంతోషిస్తాడు. పూజ అయిపోయాక అందరూ బయటికి వస్తారు. మరోవైపు నాటకం వేస్తున్నారు వెళ్లి చూద్దాం పదా అంటాడు గోవిందరాజు. దీంతో వద్దు అంటుంది జ్ఞానాంబ. అందరూ బతిమిలాడటంతో వెళ్దాం అంటుంది జ్ఞానాంబ.
మీ పెద్ద కోడలు ఇప్పటి వరకు బయట పర్ ఫార్మ్ చేసింది. ఇప్పుడు నాటకాల్లో ఆడుతోంది. పదండి చూద్దాం అంటుంది. ఈ ఒక్కసారికి వెళ్దాం అని అందరూ బతిమిలాడటంతో జ్ఞానాంబతో పాటు అందరూ నాటకం చూడటానికి వెళ్తారు. అందరూ ముందుకెళ్లి కూర్చుంటారు.
ఇంతలో నాటకం ప్రారంభం అవుతుంది. నా మనసులో అంత గొప్ప తల్లి ప్రేమే ఉంటే.. మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అడవుల పాలు చేస్తానా నాన్న అంటంది నాటకంలో రామా తల్లి. నా మొహం చూసుటకు కూడా అసహ్యించుకుంటారు అనుకున్నాను.. కానీ నీది ఎంత గొప్ప మనసు నాన్న అంటుంది.
దీంతో తల్లి నీ చేతితో గోరుముద్దలు తినిపిస్తివి. నీ గుండెల మీద ఆడిస్తివి. నా చేయి పట్టి నడిపిస్తివి. రామా రామా అంటూ ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడితివి. నాకు కాస్తంత దెబ్బ తగిలినా నీ ప్రాణం పోయినంతగా విలవిలలాడితివి. నా రామయ్య లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను అని చెబితివి అంటాడు రామా.
Janaki Kalaganaledu 19 April Today Episode : రామా నాటకంలో భావోద్వేగానికి గురయిన జ్ఞానాంబ
ఆ మాటను ప్రతిక్షణం నిజం చేస్తివి. నీ తల్లి ప్రేమను అనుక్షణం కళ్లారా చూసిన వాడిని. మరి నీకోపాన్ని నేను అర్థం చేసుకోలేనా తల్లి అంటాడు రామా. నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసినంత మాత్రాన.. ఈ అమ్మ మీద నాకు ఉన్న ప్రేమ.. ద్వేషంగా ఎలా మారుతుంది తల్లి అని అంటాడు రామా.
అమ్మ.. నీవు నన్ను ఇంటి నుంచి పంపించేశావు అనే బాధ కంటే మా అమ్మ నుంచి దూరంగా వచ్చేశాను అనే బాధే నన్ను మిక్కిలిగా బాధించినది తల్లి. ఆ బాధను నేను భరించడం బహు కష్టం అయినది అంటాడు. ఈ వనవాస కాలం అందు మీ కుమారుడు.. మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదు అంటుంది జానకి.
వనవాస నరకం కంటే.. తల్లికి దూరంగా ఉన్న నరకంతోనే ఆయన కుమిలిపోయారు అంటుంది జానకి. పంచభూతాల సాక్షిగా నేను చెబుతున్నాను అత్తయ్య గారు.. మిమ్మల్ని చూడకుండా.. మీతో మాట్లాడుకుండా మీ అబ్బాయి గారు జీవించడం అసాధ్యం అంటుంది జానకి.
మీకు దూరంగా ఇంకొన్ని దినములు ఆయన ఇటులనే ఉండినచో మీ కుమారుడు ప్రాణాలతో ఉండేవాడు కాదు అత్తయ్య గారు అంటుంది జానకి. ఇంతలో సుకన్య, కన్నబాబు గుడికి వస్తారు. జ్ఞానాంబ పరువును ఈ గుడిలోనే అందరి ముందు తీయాలి అని అంటుంది.
పెద్ద కొడుకు, పెద్ద కోడలును ఇంట్లో నుంచి తరిమేసింది అని కన్నబాబుకు చెబుతుంది సుకన్య. ఆ నిజాన్ని మనం బయటపెడదాం అంటుంది. కుటుంబం పరువును బజారుకీడ్చుదాం అంటుంది. మరోవైపు నీతో మాట్లాడుకుంటే ఈ ప్రాణం ఉండదమ్మా అంటాడు రామా.
ఇంతలో జ్ఞానాంబ లేసి నిలబడుతుంది. దీంతో అందరూ నిలబడి చప్పట్లు కొడతారు. రామా వైపు వెళ్లబోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సుకన్య.. అబ్బబ్బ.. ఏం నటిస్తున్నారు జ్ఞానాంబ అంటుంది. ఇంతలో యోగి కూడా వస్తాడు. యోగి కూడా కన్నబాబు, సుకన్యకే సపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.