janaki kalaganaledu 19 may 2022 full episode
Janaki Kalaganaledu 19 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 మే 2022, గురువారం ఎపిసోడ్ 304 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా భర్తను గౌరవంగా చూసుకుంటాను కానీ.. నా ప్రాణం పోయినా ఇలాంటి ఆలోచనలు చేయను అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో లేదు.. నీ ఆలోచనే అది.. ముమ్మాటికీ నీ ఆలోచన అదే అని జ్ఞానాంబ అంటుంది. నీ ఇష్ట ప్రకారం వాడిని పిచ్చోడుని చేసి ఆడుకోవచ్చు. ఇది నీ మనసులో ఉన్న ఆంతర్యం అంటుంది జ్ఞానాంబ. కానీ.. జానకి మాత్రం ఒప్పుకోదు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు.. ఒప్పుకుంటారు.. అంటుంది జానకి. నీ చదువుకున్న తెలివితేటలను నేను కళ్లారా చూశాక కూడా తెలుసుకోకపోతే అంతకన్నా వైరాగ్యం ఇంకోటి ఉండదు అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 19 may 2022 full episode
మీ అన్నయ్య చేత నా కొడుకును వంట వాడని అవమానించింది చాలు.. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లి నా కొడుకును అవమానించాల్సిన అవసరం లేదు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. కట్ చేస్తే రామా కళ్లు మూసి మరి రామాను తీసుకెళ్తుంది జానకి. సర్ ప్రైజ్ అంటుంది. ఇప్పుడు మెల్లగా కళ్లు తెరవండి అంటుంది జానకి. చూస్తే ఇళ్లంతా డెకరేట్ చేసి ఉంటుంది. అసలు సందర్భం ఏంటండి అంటాడు రామా. దీంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు రామా గారు అంటుంది జానకి. దీంతో రామా చాలా సంతోషిస్తాడు.
మరోవైపు రామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి తనకు బట్టలు ఇవ్వాలని అనుకుంటుంది జ్ఞానాంబ. ప్రతి సంవత్సరం ఈ సమయం కల్లా రామా తన దగ్గరికి వచ్చి తన ఆశీస్సులు తీసుకుంటాడని అనుకుంటుంది జ్ఞానాంబ. ఇంత సమయం అయినా రామా ఇంకా రాకపోవడం ఏంటి అని అనుకుంటుంది జ్ఞానాంబ.
రామా.. ఇంకా అవమానపు తాలుకు బాధలోనే ఉన్నాడా అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత తన రూమ్ కు వెళ్లి రామా కోసం చూస్తుంది. కానీ.. రామా రూమ్ లో ఉండడు. జానకి కూడా లేదు. అంటే.. ఎప్పటి లాగే ఈరోజు కూడా జానకి రామాను షికారుకు తీసుకెళ్లిందా అని అనుకుంటుంది.
ఇంతలో జ్ఞానాంబ ఇంటి బయటికి వచ్చి షాక్ అవుతుంది. నా బిడ్డకు అలాంటి పరిస్థితి రావడం నువ్వే జానకి అని అనుకుంటుంది జ్ఞానాంబ. అదిగో అమ్మ వచ్చింది అని అనుకుంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది జ్ఞానాంబ.
ఈ ఏర్పాట్లు అన్నీ జానకి చేసిందని.. తను ఈ ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని రామా.. జ్ఞానాంబతో అంటుంది. దీంతో జ్ఞానాంబకు కోపం వస్తుంది. నా కొడుకును నువ్వు పూర్తిగా వేరు చేసి నీ గుప్పిట్లో పెట్టుకున్నావని అర్థం అవుతోంది అని అనుకుంటుంది.
తర్వాత రామా బర్త్ డే వేడుకులను ఘనంగా జరుపుకుంటారు. జ్ఞానాంబ కూడా ఉంటుంది. ఆ తర్వాత రామా, జానకి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. స్నానం చేశాక.. రామాకు పొగ వేసే సమయంలో ఇద్దరి మధ్య కాసేపు రొమాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
This website uses cookies.