Janaki Kalaganaledu 19 Oct Today Episode : జ్ఞానాంబ ఫ్యామిలీ ముక్కలు.. వేరు పడిన ముగ్గురు అన్నదమ్ములు.. జానకి ఐపీఎస్ కల నెరవేరుతుందా?

Janaki Kalaganaledu 19 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 413 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు మీరు చూసుకున్నాక, మీ సంపాదన మీరు దాచుకున్నాక మేమెందుకు ఇవ్వాలి అంటూ అందరి ముందే అరుస్తుంది మల్లిక. దీంతో చిన్నన్నయ్య నువ్వు అయినా చెప్పవా అంటే.. ఇంకెలా చెబుతారు.. రాత్రి వీడియో చూశాక ఇంకేం మాట్లాడుతారు అంటుంది మల్లిక. మాకు మాత్రమే కాదు.. వీళ్ల బాగోతం అందరికీ తెలియాలి.. చూడండి అని తన ఫోన్ లో ఉన్న వీడియోను అందరికీ చూపిస్తుంది మల్లిక. జానకి చెప్పబోతుండగా అఖిల్ కల్పించుకొని కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారా వదిన అంటాడు అఖిల్. ఏరా అఖిల్.. నిజం ఏంటో తెలుసుకోకుండా నువ్వు కూడా మమ్మల్ని తప్పు పడుతున్నావా అంటాడు రామా. దీంతో వాడి మీద అరుస్తున్నావు ఏంటి అన్నయ్య అంటాడు విష్ణు. అమ్మానాన్న తర్వాత మీరిద్దరే మాకు అన్నీ అనుకున్నాం. వదిన చెప్పడం వల్ల నీలోనే ఏదో తేడా వచ్చిందేమో కానీ.. నువ్వు చాలా మారిపోయావు అన్నయ్య అంటాడు విష్ణు.

janaki kalaganaledu 19 october 2022 full episode

ఎవరిని పల్లెత్తు మాట అనని నువ్వు వదిన మాటలు విని మల్లికను తిట్టావంటే నేను కూడా నమ్మలేదు. కానీ.. ఈ వీడియో చూశాక పూర్తిగా నీ స్వార్థం అర్థం అయింది అన్నయ్య అంటాడు విష్ణు. మరోవైపు జ్ఞానాంబ పూజ చేస్తూ వీళ్ల మాటలు వింటూ ఉంటుంది. ఒరేయ్ విష్ణు తెలిసీ తెలియకుండా మాట్లాడుకురా అంటాడు రామా. మేము మాత్రమే అబద్ధమా అంటాడు అఖిల్. ఇంతలో పూజ పూర్తి చేసుకొని జ్ఞానాంబ  అక్కడికి వస్తుంది. తెలిసీ తెలియక మేమేదో చిన్న తప్పు చేసినా మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దోషిగా చూస్తారు మీరు. మాకు ఇన్ని నీతులు చెప్పే మీరు మాకు తెలియకుండా డబ్బులు దాచుకుంటే ఏమంటారు అంటాడు అఖిల్.

ఇంతలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ.. ఇక ఆపండి అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో గోవిందరాజు కూడా అక్కడికి వస్తాడు. ఒకరిని మాట అనే ముందు, ఎదుటి వాళ్ల ముందు నోరు జారే ముందు మన అర్హత ఏంటో తెలుసుకోవాలి అంటుంది జ్ఞానాంబ.

మన కుటుంబాన్ని ప్రేమించడం తప్ప మరో ధ్యాస లేని వారిని తప్పు పట్టే స్థాయికి మీరు ఎదిగారన్నమాట. బడికి వెళ్లాల్సిన వయసులో తండ్రి కోసం తన చదువును త్యాగం చేశాడు రామా.

అప్పటి నుంచి ఇప్పటి దాకా వాడి సంతోషం చూసుకోకుండా మనం బాగుండాలని ప్రతిక్షణం కష్టపడుతూనే ఉన్నాడు. ఏమన్నావు విష్ణు. వీళ్లది స్వార్థమా. నిజంగా రామాకు స్వార్థమే ఉంటే.. నీ బట్టలకొట్టు అభివృద్ధి కోసం వాడు కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి తీసి పక్కన పెట్టడు. అందుకు జానకి అండగా ఉండదు అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 19 Oct Today Episode : జానకి, రామాను వెనకేసుకొచ్చిన జ్ఞానాంబ

వాళ్లు వాళ్ల మంచి కోసమే మాత్రమే ఆలోచిస్తే.. ప్రతి నెల వాళ్ల సంపాదననే ఖర్చు పెట్టి.. మీ సంపాదన ముట్టుకోవద్దని చెప్పడు. నువ్వేమన్నావురా.. నీకు నీతులు చెప్పి వాళ్లు పాటించరా. అవునురా నిజమే.. నువ్వు బాగా చదువుకొని జీవితంలో ఎదగాలని నీకోసం రాత్రింబవళ్లు కొట్టులో కష్టపడ్డాడు.. అంటుంది జ్ఞానాంబ.

కోడలుగా తన బాధ్యత కోసం తపన పడుతుంది. ఇంటి పరువు కాపాడాలని ఆరాటపడుతుంది. తను బాధపడినా సరే.. మనమందరం సంతోషంగా ఉండాలని తాపత్రయ పడుతుంది తప్పితే తన కోసం, తన స్వార్థం కోసం ఆలోచించడం నేనెప్పుడూ చూడలేదు.

అసలు నిజంగా జానకికి స్వార్థమే ఉంటే.. రామా ప్రతి నెల సంపాదన తెచ్చి నా చేతుల్లో పెట్టలేడు అంటుంది జ్ఞానాంబ. ఒరేయ్.. నువ్వు చేసిన తప్పుకు వాడు నీకు శిక్ష పడకూడదని నరకం అనుభవించి నింద మోసింది జానకి.

అఖిల్ తాగి వస్తే తప్పు చేశాడని ఈసారి క్షమించమని నన్ను వేడుకున్నారు. నువ్వు గర్భవతి వని నువ్వెంత సంతోషించావో నాకు తెలియదు కానీ.. వాళ్లిద్దరు మాత్రం మల్లిక ద్వారా వారసుడు వస్తున్నాడని తెగ మురిసిపోతున్నారు.

నాకన్నే ఎక్కువగా నీ జాగ్రత్తలు జానకే చూసుకుంది. మనమంతా ఇంకా సంతోషంగా ఉన్నాం.. అనేది మరిచిపోకండి అని అంటాడు గోవిందరాజు. దీంతో వాళ్లు మిమ్మల్ని అలాంటి భ్రమలో ఉంచారు అంటుంది మల్లిక.

ఇదిగో ఈ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది అంటుంది మల్లిక. ఇద్దరికీ చూపిస్తుంది. ఇది చూసి వాళ్లను తప్పి పట్టి నిలదీస్తున్నారా? అసలు ఆ డబ్బులు అని చెప్పగానే వద్దమ్మ అంటాడు రామా.

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్. దయచేసి గొడవలు వద్దు అంటాడు రామా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాళ్లు ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్లకు అర్థం కాదు అంటాడు రామా.

దీంతో అబ్బబ్బబ్బ.. మీ విషయం బయట పడేసరికి వదిలేయమంటున్నారా? ఏం కవర్ చేసుకుంటున్నారు బావ గారు అంటుంది మల్లిక. దీంతో మల్లిక అంటూ గట్టిగా అరుస్తుంది జ్ఞానాంబ.

నేను మల్లికనే మాట్లాడుతున్నాను. మీరు, మామయ్య గారు వాళ్లిద్దరి మీద ఈగను కూడా వాలనీయరు అంటుంది మల్లిక. అభినందించడానికి, గొప్పలు చెప్పడానికి వాళ్లు, మాటలు పడటానికి మేము అయిపోయింది మా పరిస్థితి.

ఈ ఇంట్లో మాకంటూ ఒక విలువ, స్వేచ్ఛ లేకుండా పోయింది అంటుంది మల్లిక. దీంతో నీ విలువకు ఏమైంది మల్లిక అంటాడు గోవిందరాజు. దీంతో దసరా మామూళ్లు మాతో ఇప్పించవచ్చు కదా అంటుంది మల్లిక.

ఇలాంటి విలువ లేని ఇంట్లో మేము ఉండలేము. మేము వేరేగా వెళ్లిపోతాం అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ, జానకి షాక్ అవుతారు. విష్ణు, అఖిల్ కూడా మేము వెళ్లిపోతాం అంటారు. దీంతో మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియదు అంటుంది జానకి.

దయచేసి వెళ్లిపోతాం అనే మాట ఇంకెప్పుడూ అనొద్దు అంటుంది జానకి. వాళ్ల మాటకు బాధపడ్డ జ్ఞానాంబ విజయదశమి తర్వాత ఎవరి వాటా వారిది, ఎవరి బతుకు వారిది అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago