Janaki Kalaganaledu 20 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు జనవరి 20, 2022, గురువారం 219 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పసలపూడికి వెళ్లే బస్సు ప్రమాదానికి గురైందని.. ఆత్రేయపురం శివారులో యాక్సిడెంట్ అయిందని ఈ ఘటనలో 10 మంది చనిపోయారని.. చనిపోయిన వారి పేర్లు న్యూస్ లో చెబుతారు. దీంతో అందరూ వచ్చి న్యూస్ చూస్తుంటారు. జ్ఞానాంబ కూడా వచ్చి న్యూస్ చూస్తుంటుంది. ఇంతలో చనిపోయిన వాళ్ల పేర్లలో రుద్రకంట జానకి అని చదువుతారు. దీంతో రామా షాక్ అవుతాడు. తనకు ఏం చేయాలో అర్థం కాదు. కుప్పకూలిపోతాడు. జానకి చనిపోయింది అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. జానకి పేరును న్యూస్ లో చదవడంతో జ్ఞానాంబ కూడా షాక్ అవుతుంది. మన జానకేనా అని అనుకుంటుంది.
మిగితా కుటుంబ సభ్యులు కూడా అందరూ షాక్ అవుతారు. ఎవరా అమ్మాయి అంటుంది జ్ఞానాంబ. జానకి ఏంటి.. ఆ అమ్మాయి ఇంటి పేరు.. మన ఇంటి పేరు ఒకటా అని అంటుంది జ్ఞానాంబ. రామా.. నాకు తెలిసి మన ఊళ్లో మన ఇంటి పేరుతో మన జానకి తప్ప మరో అమ్మాయి లేదు. కానీ.. ఈ జానకి ఎవరో అర్థం కావడం లేదే అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా కుప్పకూలిపోతాడు. మన జానకి గారేనమ్మా అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. అందరూ ఏడుస్తారు. ఏంట్రా నువ్వు చెప్పేది అంటాడు గోవింద రాజు. జ్ఞానాంబ కూడా అదే అంటుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చనిపోయింది జానకే అని తెలుసుకొని అందరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. పసలపూడి వెళ్లే బస్సు మన జానకి ఎందుకు ఎక్కుతుంది అని అంటాడు గోవింద రాజు. కానీ.. లేదు నాన్నా నేను జానకి గారిని బస్సు ఎక్కించాను నాన్నా.. అదే పసర్లపూడి బస్సు ఎక్కించాను అని చెబుతాడు రామా.
జానకి చనిపోయిందన్న విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతారు. రామా ఏం చెబుతున్నావురా నువ్వు.. జానకిని పసర్లపూడి బస్సు ఎందుకు ఎక్కించావు అని జ్ఞానాంబ అడుగుతుంది. దీంతో తన ఇంట్లో ఇక్కడ ఎవరూ లేరు కదా.. దీంతో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాలని నేను తనను పసర్లపూడి బస్సు ఎక్కించా.. అంటాడు రామా.
దూరంగా ఉంటే బాధలు మరిచిపోయి కాస్త ప్రశాంతంగా ఉంటారనుకున్నా కానీ.. ఇలా శాశ్వతంగా దూరం అయిపోతారని అనుకోలేదు అమ్మ అంటాడు రామా. అనవసరంగా నేను బస్సు ఎక్కించాను అమ్మా. నేనే జానకి గారిని బస్సు ఎక్కించాను అమ్మా. నేను జానకి గారిని దూరం చేసుకున్నాను అమ్మా అంటాడు రామా.
నా చేతులారా.. జానకి గారిని చంపేసుకున్నా అంటాడు రామా. అందరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. క్షతగ్రాతులను ఆత్రేయపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని.. మృతదేహాలను ఆత్రేయపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని.. వాటిని గుర్తుపట్టేందుకు ఆసుపత్రికి రావాలని పోలీసులు సూచించారని న్యూస్ లో చెప్పడంతో వెంటనే అందరూ ఆసుపత్రికి బయలుదేరుతారు.
వెన్నెల కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నువ్వు నా వల్లే చనిపోయావు. నా కారణంగానే ఇదంతా జరిగింది అని బాధపడుతుంది వెన్నెల. మల్లిక కూడా కాస్త బాధపడ్డట్టుగా కనిపిస్తుంది. కారులో గోవిందరాజు, జ్ఞానాంబ, రామా, వెన్నెల ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరుతారు.
ఇంతలో రామా.. జానకి ఫోన్ కు ట్రై చేస్తుంటాడు కానీ.. ఫోన్ కలవదు. ఫోన్లన్నీ పోలీసుల దగ్గర ఉంటాయి. ఫోన్ ను ఎవరూ లిఫ్ట్ చేయరు. జానకి ఫోన్ కూడా పోలీసుల దగ్గరే ఉంటుంది. జానకి నీ మీద నాకు తోడికోడలువు అన్న అక్కసు తప్ప ఎలాంటి కోపం లేదు.. అని ఏడుస్తూ కూర్చుంటుంది మల్లిక.
విష్ణు కూడా ఏడుస్తూ ఉంటాడు. మనందరినీ అన్యాయం చేసి వెళ్లిపోయిందండి అంటుంది. జానకి చాలామంచిది అండి అంటుంది మల్లిక. అంత మంచి మనసు ఉన్న తనను తీసుకెళ్లిపోవడానికి ఆ దేవుడికి మనసు ఎలా వచ్చిందో ఏంటో అంటుంది మల్లిక.
నువ్వు ఒక మనిషివేనా.. నువ్వు దొంగ ఏడుపు ఏడుస్తున్నావా.. నీకు అసలు మనసు ఉందా అంటూ కొట్టబోతాడు విష్ణు. కానీ.. తనది దొంగ ఏడుపు కాదు.. నిజమైన ఏడుపే. నేను నిజంగానే ఏడుస్తున్నాను అంటుంది మల్లిక. జానకి మీద నాకు ఉన్నది కుళ్లే తప్ప కుట్ర కాదు. నాకంటే పెద్దకోడలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. జానకి మీద అసూయ పెంచుకున్నాను అంటుంది మల్లిక.
అంతే తప్ప తను చనిపోవాలని కోరుకునేంత రాక్షసిని కాదండి అంటుంది మల్లిక. తను ఏడుస్తుంటే విష్ణు ఓదార్చుతాడు. ఈ ఇంట్లో జానకి కంటే నాదే పైచేయి ఉండాలంటే తను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నాను కానీ.. జానకి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలనుకునేంత రాక్షసిని కాదండి అంటుంది మల్లిక.
తను నన్ను సొంత చెల్లిలా చూసుకుంది. నాకు తోడపుట్టిన అక్క దూరం అయితే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు నా మనసులో కూడా అంతే బాధగా ఉంది అంటుంది మల్లిక. వదిన కళ్లెదురుగా ఉన్నప్పుడు తన ప్రేమను మంచితనాన్ని గుర్తించలేకపోయావు. ఇప్పుడు దూరం అయ్యాక ఎంత ఏడిస్తే తను తిరిగి వస్తుందా చెప్పు అని అంటాడు విష్ణు.
మరోవైపు జ్ఞానాంబ, రామా ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు చూసి రామా భయపడతాడు. మార్చురీకి వెళ్లబోతారు. డాక్టర్ మా కోడలు జానకి అని అడుగుతారు. మీ కుటుంబ సభ్యులను గుర్తుపడితే ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని అప్పగిస్తాం అంటారు. అలాగే.. అక్కడ ఉన్న జానకి ఫోన్ ను గుర్తు పడతాడు రామా. తన ఫోన్ ను చూసి షాక్ అవుతాడు రామా.
రామాకు అందరూ ధైర్యం చెబుతారు. వెళ్లి బాడీని చూసి గుర్తుపట్టండి అంటారు పోలీసులు. దీంతో మార్చురీ వైపు వెళ్తారు. మార్చురీలో వరుసగా మృతదేహాలు ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన వాళ్లు ఎవరో చూసుకోండి అని నర్సు చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అక్కడ జానకి మృతదేహాన్ని రామా గుర్తుపడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.