Home » Andhra Pradesh » Ap Ngo S Dicided To Go With Protest Against Government On Prc Issues
andhra pradesh

Ap NGO : సమ్మెకు సై అంటోన్న ఏపీ ఎన్జీవోలు.. ఫిబ్రవరి 7 తర్వాత ఏ క్షణమైనా..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 20, 2022, 10:15 am
Advertisement

Ap NGO : ఏపీ ఎన్జీవోల సంఘానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది. తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్న జీవోలను రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్న ఎన్జీవోల సంఘం… ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందన్నారు.

Advertisement

ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెపై ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నట్లు సమాచారం. అయితే అప్పటివరకు అనగా వచ్చే నెల 7వ తేదీ వరకు వారు చేయదలచిన ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే రూపొందించారు. గత రాత్రి జరిగిన ఈసీ మీటింగ్‌లో ఏపీఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

Ap NGO s dicided to go with protest against government on PRC issues

Advertisement

ఇక ఇదే విషయమై… ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు తాము కూడా ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్నాయి. తమకు అనుకూలంగా పీఆర్సీపై మరో ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి