Janaki Kalaganaledu 20 Oct Today Episode : జ్ఞానాంబను బతిమిలాడిన రామా, జానకి.. కానీ వాళ్ల మాట వినని జ్ఞానాంబ.. ఇంతలో జానకికి మల్లిక షాక్
Janaki Kalaganaledu 20 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 414 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ దశమి తర్వాత ఇక ఎవరి బతుకులు వారివి.. అని జ్ఞానాంబ చెప్పడంతో జానకి, రామా బాధపడతారు. మల్లిక మాత్రం సంతోషిస్తుంది. ఆ తర్వాత ఎందుకో అఖిల్ తొందరపడి మాట్లాడానేమో అని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక.. అఖిల్ ఏంటి మళ్లీ మనసు మార్చుకుంటాడా అనుకొని వెళ్లి అఖిల్ తో మాట్లాడుతుంది మల్లిక. మెల్లగా అఖిల్ మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు వేరు కాపురం పెట్టడమే కరెక్ట్ అంటుంది. దీంతో కానీ ఎలా వదిన.. ఇన్నాళ్లు అందరితో కలిసి ఉండి ఇప్పుడు బయటికి వెళ్లి బతకడం అంటే కష్టం అంటాడు. దీంతో నువ్వేం టెన్షన్ పడకు. నీ కాళ్ల మీద నిలబడి నువ్వు ఏదైనా సాధిస్తే తప్ప అత్తయ్య గారే నిన్ను అర్థం చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే.. జెస్సీ మీ మామయ్య వాళ్లకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి వాళ్ల సపోర్ట్ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది.. అని అంటుంది.
వేరు పడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అర్థం చేసుకో అంటుంది మల్లిక. ఇవన్నీ వింటుంది జానకి. విని షాక్ అవుతుంది. అసలేంటి మల్లిక నీ ప్రాబ్లమ్ అంటుంది. ఎందుకు అభంశుభం తెలియని అఖిల్ మనసును మార్చాలని చూస్తున్నావు అంటుంది జానకి. అఖిల్.. మల్లిక మాటలు విని వేరు పడాలని ఆలోచించకు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం వేరు పడటంలో ఉండదు అంటుంది. కష్టం వస్తే చెప్పుకోవడానికి సమస్య వస్తే పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు.. అంటుంది జానకి. దీంతో చిన్న వదిన చెప్పినట్టు నేను కూడా వేరుగా ఉంటేనే ఎదగగలను అనిపిస్తోంది వదిన అంటాడు అఖిల్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్. అమ్మా జానకి ఇకపైన నీ ఆటలు సాగవు. అన్నిట్లోనూ గెలుపు నాదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక.
జరుగుతున్న వాటిలో విష్ణు, అఖిల్ తప్పులేదని.. మల్లిక మాట విని వాళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారని జానకికి అర్థం అవుతుంది. మరోవైపు ఏం చేయాలో విష్ణుకు అర్థం కాదు. అవును.. మేము కూడా బయటికి వెళ్తాం అని విష్ణు.. జ్ఞానాంబకు చెప్పడంతో బాధపడతాడు విష్ణు.
Janaki Kalaganaledu 20 Oct Today Episode : విష్ణుతో మాట్లాడిన రామా
అనవసరంగా మల్లిక మాటలు విని విడిపోతా అని అన్నాను అని బాధపడుతూ ఉండగా అక్కడికి రామా వస్తాడు. కానీ.. రామాతో ఏం మాట్లాడడు విష్ణు. ఏరా.. బాధపడుతున్నావా అంటాడు రామా. మన మనసు మంచిదైనా ఒక్కోసారి మాట బాధపడేలా చేస్తుంది అంటాడు.
అయిందేదో అయిపోయింది. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడొద్దు అంటాడు రామా. నువ్వు కావాలని అలా మాట్లాడలేదని నాకు అర్థం అయింది. జరిగిందేదీ మనసులో పెట్టుకోలేదు. నువ్వు కూడా మరిచిపో అంటాడు రామా.
అన్నదమ్ముల అనుబంధం అంటే మాట అనుకొని విడిపోయేది కాదు.. ఏం జరిగినా కలిసిపోయేది. దాని గురించి వదిలేయ్ విష్ణు. ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉందాం అంటాడు. ఇవన్నీ విన్న మల్లిక అక్కడికి వస్తుంది. నువ్వు ఇంట్లో ప్రతి నెల డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు రామా.
దీంతో వద్దులేండి బావ గారు అంటుంది మల్లిక. మాకు ఇలాంటి మాటలు అన్నీ చెప్పి మా నోర్లు మూయించి రేపు అత్తయ్య గారి ముందు కలిసి ఉండేందుకు ఒప్పించామని గొప్పలకు పోతారు అంటుంది మల్లిక. మీకు ఉన్న తెలివితేటలు మా భర్తకు లేవు కాబట్టే పెద్దవాళ్ల ముందు మీ మాట చెల్లుబాటు అవుతోంది అంటుంది మల్లిక.
నీకు ఎందుకో నా మీద, జానకి గారి మీద తెలియని కోపం ఏర్పడింది. నిన్ను మేము ఏనాడైనా ఇబ్బంది పెట్టామా అంటాడు రామా. విడిపోవాలన్న ఆలోచన మానుకో అంటాడు. కలిసి ఉంటేనే మనం అందరం బాగుంటాం అంటాడు రామా. కలిసి ఉన్నా కానీ.. మల్లిక ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది.
వేరుగా ఉంటేనే అన్నయ్య వాళ్లు అయినా కనీసం సంతోషంగా ఉంటారు అని అనుకుంటాడు విష్ణు. అన్నయ్య మల్లిక చెప్పినట్టు మేము వేరుగా వెళ్లిపోవడమే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విష్ణు. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు.
రాత్రి అయ్యాక.. జ్ఞానాంబ దగ్గరికి వచ్చిన రామా, జానకి తనతో మాట్లాడుతారు. జ్ఞానాంబకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇటు మల్లిక, అటు జెస్సీ ఇద్దరూ కడుపుతో ఉన్నారు. మన మధ్య బతికిన వారు.. బయటి ప్రపంచంలో బతికితే బాగుంటుంది అని అనుకుంటున్నారు.
అది భ్రమ అని అర్థం అయ్యాక చాలా ఇబ్బంది పడతారు. నెలలు నిండుతున్న కొద్దీ వాళ్ల పనులు చేసుకోలేక, చేసేవాళ్లు లేక చాలా కష్టపడతారు. ఇలాంటి సమయంలో వాళ్లకు పెద్ద వారి తోడు అవసరం అత్తయ్య గారు అంటుంది జానకి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ తోడు చాలా అవసరం అంటుంది జానకి.
దయచేసి కలిసే ఉందాం అంటుంది జానకి. కలిసి ఉంటే కష్టం వస్తే ఆదుకోవడానికి నాలుగు చేతులు ఉంటాయి. విడిగా ఉంటే ఏ చేయీ ఉండదు కదా అమ్మ. నీ నిర్ణయం మార్చుకో అమ్మ అంటాడు రామా. దీంతో వేరు కాపురం పెట్టాల్సిందే అందరూ అంటుంది జ్ఞానాంబ.
వాళ్లేదీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. మన మాట వినే ఆలోచన లేనప్పుడు మనం ప్రాధేయపడటం అనవసరం. మీరు కానీ.. నేను కానీ వాళ్ల గురించి ఆలోచించడమే అనవసరం అంటుంది జ్ఞానాంబ. ఇప్పటి దాకా వాళ్ల కోసం శ్రమ పడింది చాలు అంటుంది జ్ఞానాంబ.
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక దీని గురించి మీరెవరూ మాట్లాడకండి అంటుంది జ్ఞానాంబ. మరోవైపు బయట కాపురం పెడుతున్నామని మల్లిక సంతోషిస్తుంది. జెస్సీకి మాత్రం ఇష్టం ఉండదు. ఓ గొప్ప ఫ్యామిలీలోకి, మంచి మనసు ఉన్న మనుషుల మధ్య కోడలుగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.
కానీ. ఇప్పుడు ఇలా జరిగిందేంటి అని అనుకుంటుంది జెస్సీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.