Janaki Kalaganaledu 21 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జులై 2022, గురువారం ఎపిసోడ్ 349 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరదాగా బయటికి వెళ్తామంటే కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని మల్లికతో అంటాడు గోవిందరాజు. నేను జానకి కాళ్ల గురించి ఆలోచించి అలా చెప్పా అంటుంది మల్లిక. దీంతో తోటి కోడలు గురించి నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసులే అంటాడు మల్లిక. జ్ఞానం.. దెబ్బ తగిలినప్పుడు అలా సరదాగా వెళ్లనివ్వు అంటాడు గోవిందరాజు. దీంతో జానకి.. నీకు దెబ్బ తగిలినప్పుడు నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒకవేళ నొప్పి ఎక్కువై నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను. జాగ్రత్తగా వెళ్లి రండి.. సరేనా అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అని చెప్పి జానకి, రామా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
జానకి బ్యాగ్ లో పుస్తకాలు పెట్టుకొని వెళ్తోందని చెబుదామంటే పోలేరమ్మ పూనకాలు తెచ్చుకుంటుంది. చెప్తే ఏమౌతుందో.. చెప్పకపోతే ఏమౌతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు అకాడెమీలో అందరికీ క్లాస్ తీసుకుంటారు ట్రైనర్స్. మీరు శ్రద్ధ పెట్టి ఈ కోర్సును పూర్తి చేయాలి అంటారు. ఇంతలో ఒక సర్క్యులర్ వస్తుంది. ఇది మీ అందరికీ చాలా సంతోషం కలిగించే విషయం అంటాడు ట్రైనర్. ఇప్పటి వరకు మన అకాడెమీలో కండక్ట్ చేసిన అన్ని పరీక్షల్లో టాప్ లో వచ్చిన ముగ్గురికి షీల్డ్ ప్రదానం చేస్తాం అంటారు.
మరోవైపు ఇంతలో అకాడెమీకి పోలీసులు వస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ చెక్ చేయడానికి వచ్చాం అంటారు. అందరివీ చెక్ చేస్తారు కానీ.. జానకి మాత్రం తన సర్టిఫికెట్స్ తీసుకురాదు. అయితే.. తీవ్రవాది సంస్థకు చెందిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడ చేరినట్టు ఇన్ఫర్మేషన్ ఉందని పోలీసులు ట్రైనర్ కు చెబుతారు.
దీంతో ఇవాళ తీసుకురాని వాళ్లంతా రేపు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెబుతాడు ట్రైనర్. దీంతో సరే అంటుంది జానకి. ఇంటికి వచ్చాక అసలు విషయం రామాకు చెబుతుంది జానకి. ఏం చేయాలో రామాకు కూడా అర్థం కాదు. మొదటి సారి మీ మీద నాకు చాలా కోపంగా ఉంది అంటాడు.
ఎందుకు అంటే.. మీ చదువు కాగితాలతో మీకు అవసరం ఉంటుందని తెలుసు కదా. మరి తెలిసి కూడా ఆ రోజు కాగితాలను అమ్మకు ఎందుకు ఇచ్చారు అంటాడు రామా. మీరు చేసిన పిచ్చి వల్ల చూడండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంటాడు రామా.
కట్ చేస్తే.. ఓ మహిళ జ్ఞానాంబ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. దీంతో జ్ఞానాంబ డోర్ తీస్తుంది. ఎవరమ్మా నువ్వు అంటుంది. దీంతో నా పేరు గీత. సావిత్రమ్మ గారి అమ్మాయిని అంటుంది. ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ.
నాకు అత్తవారింటికి వెళ్లడం ఇష్టం లేదండి. ఎంత చెప్పినా మా వాళ్లు అర్థం చేసుకోవడం లేదు. నాకు ఇష్టం లేని కాపురానికి పంపించడానికి మావాళ్లు ఫోర్స్ చేస్తున్నారు. మీరైనా మా వాళ్లకు చెప్పండి. లేదంటే నాకు చావే గతి అంటుంది గీత. నువ్వేం కంగారు పడకు. నేను ఫోన్ చేసి నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పి రేపు మీ అమ్మ వాళ్లను రమ్మని చెబుతాను. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండు అంటుంది జ్ఞానాంబ.
నా చదువు గురించి అత్తయ్య గారికి చెప్పేసి సర్టిఫికెట్స్ అడిగేస్తాను అని తెల్లారాక రామాతో అంటుంది జానకి. దీంతో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా అంటాడు రామా. మీరు చదివింది 5 వ తరగతి కాదు అని తెలిసినప్పుడే అమ్మ ఎంతో భయపడింది.
ఇప్పుడు అమ్మకు తెలియకుండా మిమ్మల్ని నేను చదివిస్తున్నాను అనే విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదెంత ప్రమాదమో.. పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయో తెలుసా? అంటాడు. దీంతో సర్టిఫికెట్స్ కోసం కాకపోయినా నేను సివిల్స్ కోచింగ్ కు వెళ్తున్న విషయం అత్తయ్య గారికి చెప్పాల్సిందే రామా గారు అంటుంది జానకి.
కట్ చేస్తే.. గీత తల్లిదండ్రులను పిలిచి మాట్లాడుతుంది జ్ఞానాంబ. ఉదయం 10 గంటల వరకు నిద్రపోతుంది నా బిడ్డ. ఆ టైమ్ వరకు నిద్రపోతే ఇంటికి దరిద్రం అనుకుంటారు కదా అంటాడు గీత తండ్రి. అది కాదమ్మా.. కోడలు అంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులు చక్కదిద్దాలి అంటుంది జ్ఞానాంబ.
దీంతో నాకు మా ఇంట్లో 10 గంటల వరకు పడుకునే అలవాటు ఉంది. అక్కడికి వెళ్లాక నా అలవాటు మార్చుకోవాలంటే ఎలా అంటుంది గీత. ఇంతలో అక్కడికి జానకి వస్తుంది. నా కోడలు జానకిని చూసి నువ్వు నీ అలవాట్లు మార్చుకో. నా కోడలు డిగ్రీ చదివింది. బాగా పై చదువులు చదవాలని తన కల.
కానీ.. నా జీవితంలో నా కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన వల్ల నా కోడలును చదువుకోవడానికి వీలు లేదు అని చెప్పాను. తను నా భయాన్ని అర్థం చేసుకుంది. ఆ సమయం నుంచి తన మనసులో నుంచి చదువునే తీసేసింది. తనలో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా?
తను చదువుకున్న కాగితాలను నాకు ఇవ్వమనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేసింది. ఇప్పటి వరకు వాటి ప్రస్తావనే నా దగ్గర తీసుకురాలేదు. ఎందుకంటే భవిష్యత్తులో చదువుకోను అని నాకు ఇచ్చిన మాకు కట్టుబడి అంటుంది జ్ఞానాంబ.
ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నా కోడలు తనకిష్టమైన చదువునే త్యాగం చేసింది. మరి నీ నిద్ర టైమింగ్స్ ను నువ్వు మార్చుకోలేవా చెప్పు అంటుంది జ్ఞానాంబ. నా కోడలు మాట ఇవ్వమనగానే ఇచ్చేసింది. జానకి ఆ అమ్మాయికి నువ్వైనా చెప్పు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.