janaki kalaganaledu 21 june 2022 full episode
Janaki Kalaganaledu 21 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 327 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా భర్త చదువుకోలేదు.. అతడిని మోసం చేయొచ్చని అనుకుంటున్నావేమో.. ఆయన వెనుక నేనున్నాను. మీకు ఎదురు లేదనే పొగరు ఉండొచ్చు కానీ.. మా ఆయన జోలికి వస్తే వాటిని తొక్కిపడేయడానికి ఈ జానకి ఉందని గుర్తు పెట్టుకోండి. మీరు ఇలాగే మోసాలు చేస్తూ ఉండండి.. తిప్పి కొడతాను. చివరగా రామచంద్రాతో ఎందుకు పెట్టుకున్నాం అని అనుకునేలా చేస్తా. మాఆయనకు ఏదైనా చేయాలని చూస్తే కాళికా దేవిలా చీల్చి చెండాడటం కూడా తెలుసు. మా ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు ఆయన నీడను కూడా తాకలేరు. ఇంకోసారి ఆయన జోలికి వస్తే.. మీ రాజకీయ భవిష్యత్తును సమాధిని చేసేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రామాను తీసుకెళ్తుంది జానకి.
janaki kalaganaledu 21 june 2022 full episode
తను చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే రామా చాలా సంతోషిస్తాడు. తననే చూస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చాక కూడా తననే చూస్తూ కూర్చొంటాడు రామా. నైట్ తను రూమ్ లో బెడ్ సర్దుతుండగా కూడా తననే చూస్తుంటాడు రామా. మీకు నేను థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటాడు రామా. దీంతో మీ ప్రతిభే మిమ్మల్ని గెలిపించింది అంటుంది జానకి. మీరే భుజం తట్టి నన్ను లేపారు అంటాడు రామా. ఇంత చిన్న విషయానికే మీరు ఇంతలా థాంక్స్ చెబుతుంటే నాకోసం మీరు చేస్తున్న దానికి నేను ఎన్ని థాంక్స్ చెప్పాలి అంటుంది జానకి. నా కోసం మీరు ఎంత పెద్ద సాహసం చేస్తున్నారు. నేను ఎన్ని జన్మలు ఎత్తి మీకు భార్యను అయినా ఇంత గొప్ప భర్త రుణాన్ని నేను తీర్చుకోలేను అంటుంది జానకి.
తర్వాత తన నుదుటి మీద ముద్దు పెడుతుంది జానకి. రామా గారు.. గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీ కదా అంటుంది జానకి. దీంతో రామా సరే అని తనకు నుదుటి మీద ముద్దు ఇస్తాడు. కాసేపు ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. కట్ చేస్తే నీలావతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది.
ఇంతలో ఒక కారు ఆగి.. తనను రామచంద్ర గారి ఇల్లు గురించి వాకబు చేస్తుంది. చెప్పాలా వద్దా.. చెప్తే నాకేంటి అని అనుకుంటుంది. చెప్పడం కాదు.. తీసుకెళ్లి చూపిస్తాను.. కానీ నన్ను కూడా టీవీలో కాస్త కనిపించేలా చేయండి అంటుంది. తిన్నగా వాళ్ల ఇంటికి తీసుకెళ్తుంది నీలావతి.
ముందు ఇంటర్వ్యూకు జ్ఞానాంబ ఒప్పుకోదు కానీ.. తర్వాత జానకి, అందరూ బతిమిలాడటంతో జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ముందు స్వీట్లు తయారు చేస్తుంటే మేము షూట్ చేస్తాం అని చెబుతారు ఇంటర్వ్యూ వాళ్లు. దీంతో రామా.. వాళ్ల కోసం ఒక స్వీటు తయారు చేస్తాడు.
తయారు చేశాక వాళ్లను రుచి చూడమంటాడు. అందరూ తిని సూపర్ రామచంద్ర గారు అదిరిపోయిందండి అంటారు. ఆ తర్వాత రామాను ఇంటర్వ్యూ కోసం రెడీ చేస్తుంది జానకి. మీరు కూడా తయారవ్వండి అంటాడు రామా. దీంతో ఈ జానకి పక్కన రాముడు ఉంటే చాలు. నేను ప్రత్యేకంగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ దీనంగా కూర్చొని ఉంటుంది. దీంతో తన దగ్గరికి వెళ్లి ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతుంది జానకి. ఓ పది నిమిషాల్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా వచ్చేయండి అంటుంది జానకి. దీంతో నేనెందుకు అంటుంది జ్ఞానాంబ.
వాళ్లు ఒకవేళ ప్రశ్నలు అడిగితే మైకుల ముందు నాకు కూడా కంగారు ఉంటుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో భలేవారే.. మీకెందుకు కంగారు.. మీరు అలాగే హుందాగా ఉండండి. మిమ్మల్ని చూసి ప్రశ్నలు అడగడానికి వాళ్లే భయపడతారు అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.