Janaki Kalaganaledu 21 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 415 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుడికి వెళ్లేందుకు అందరూ రెడీ అవుతారు. జానకి అన్నీ సర్దుతుంది. కానీ.. మల్లిక సపరేట్ గా గుడిలో అమ్మవారికి ప్రసాదం వండేందుకు సామాగ్రిని తీసుకొస్తుంది. నేను తెస్తున్నాను కదా.. మళ్లీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటుంది జానకి. దీంతో ఎలాగూ రేపు వేరు కాపురం పెట్టాల్సిన వాళ్లమే కదా.. గుడిలో అమ్మవారికి ప్రసాదం వండి పెడితే మంచిది అని అంటుంది మల్లిక. పండుగ రోజున అందరం కలిసే వెళ్తున్నాం కదా అంటుంది జానకి. అయినా మల్లిక వినదు. జ్ఞానాంబ కూడా వద్దని జానకిని వారిస్తుంది.
తర్వాత అందరూ బయటికి వస్తారు. కారులో రాము అంటారు. ఏదైనా ఆటో పట్టుకొని గుడికి వెళ్దాం పదండి అంటుంది మల్లిక. జెస్సీ నువ్వు కారులో రా అంటుంది జానకి. దీంతో సరే అక్క అంటుంది. ఏంటి సరే అంటాడు అఖిల్. రేపటి నుంచి మనం కూడా నడుచుకుంటూనే తిరగాలి. నాకంటూ బైక్ కూడా లేదు. మనం నడుచుకుంటూ వెళ్దాం పదా అంటాడు అఖిల్. మనం సపరేట్ గా ఉండటం, అందరి నుంచి విడిపోయి ఉండటం కరెక్ట్ కాదు అంటుంది. కానీ.. అఖిల్ వినడు. దీంతో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే కూలబడిపోతుంది.
జానకి, రామా వచ్చి నాతో ప్రాధేయపడ్డారు. కానీ.. వీళ్లకు మాత్రం ఎలాంటి బాధ లేదు. ఎప్పుడెప్పుడు విడిపోదామా.. బయటికి వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. నేను ఈ టైమ్ లో గుడికి రాలేను అంటుంది జ్ఞానాంబ.
మరో వైపు మల్లిక గుడిలో నీలావతి కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో మరో మహిళ వచ్చి నీలావతి నన్ను పంపించింది అని మరో మహిళ వస్తుంది. నాకు అన్నీ చెప్పింది. ఏం చేయాలో నాకు తెలుసు. నేను అల్లుకుపోతాను కదా అంటుంది.
నువ్వు నిదానంగా అల్లుకుపోతావా.. నిదానంగా అంటే తెల్లారిపోతుంది. అసలు నువ్వు ఏం చేయాలో వివరంగా చెబుతాను విను అని ఆ మహిళకు ఏదో ప్లాన్ చెబుతుంది మల్లిక. దీంతో సరే అంటుంది ఆ మహిళ.
మరోవైపు గుడిలో పొయ్యి పెట్టి పొంగళి చేస్తుంటుంది మల్లిక. వీళ్లు ఇంకా రావడం లేదేంటని చూస్తుంటుంది. ఇంతలో జ్ఞానాంబ వాళ్లు వస్తుంటారు. వాళ్లు రాగానే ఆ మహిళకు సైగ చేస్తుంది. దీంతో సరే అంటుంది.
ఏంటమ్మా మల్లిక మీది ఉమ్మడి కుటుంబం కదా.. ఏం చేసినా మీ అత్తయ్య గారు జ్ఞానాంబ గారి ఆధ్వర్యంలో కలిసే చేస్తారు కదా అంటుంది ఆ మహిళ. పైగా ఈరోజు విజయ దశమి. మీరందరూ కలిసి రాకుండా నువ్వు ఒక్కదానివే మీ ఆయనతో కలసి వచ్చి పొంగల్ వండుతున్నావు ఏంటి అని అడుగుతుంది.
దీంతో అన్ని రోజులు ఒకేలా ఉండవు పిన్ని గారు అంటుంది మల్లిక. పరిస్థితులు, పద్ధతులు మారుతూ ఉంటాయి పిన్ని అంటుంది మల్లిక. సరదాకు కూడా ఒక హద్దు ఉంటుంది మల్లిక. దాన్ని దాటకు అని అంటుంది జానకి.
మల్లిక ఏదో చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడుతున్నావేంటి అని ఆ మహిళ జానకితో అంటుంది. తనేమో మీకన్నా ముందు వచ్చి ప్రసాదం వండుతోంది. ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో ఏం జరగలేదు అంటుంది మల్లిక.
ఇంతలో అఖిల్, జెస్సీ కూడా వస్తారు. మల్లిక కడుపుతో ఉంది కాబట్టి మల్లికను అత్తయ్య గారే స్వయంగా పొంగలి చేసి పెట్టమన్నారు అంతే. ఎదుటివాళ్లను అవమానించి వాళ్ల విషయాల్లో తలదూర్చడం మానుకుంటే మంచిది అంటుంది జానకి.
ఏదేదో ఊహించుకొని అనవసరంగా మాట్లాడకండి అంటుంది జ్ఞానాంబ. తర్వాత పొంగలి వండి అందరూ అమ్మవారికి సమర్పించడానికి గుడిలోకి వెళ్తారు.
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
This website uses cookies.