Janaki Kalaganaledu 21 Nov Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘జానకి కలగనలేదు’. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. రోజురోజుకూ సీరియల్ కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఎపిసోడ్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎప్పుడూ తన మాట వినే జ్ఞానాంబ తన మాట వినకుండా పూజ జరిపించడంతో మైరావతి ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూజ జరుగుతున్న టైంలోనే పూజ వద్దు ఆపేస్తున్నానని చెప్పి మధ్యలోనే మైరావతి వెళ్లిపోయింది.దాంతో జ్ఞానాంబ వెళ్లి పూజకు రావాలని కోరుతుంది. అయితే, తాను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అని, మళ్లీ మార్చుకోనని అంటుంది మైరావతి. అయితే, మైరవావతి రాకపోయినప్పటికీ పూజ జరుగుతుందని జ్ఞానాంబ అంటుంది. దాంతో మైరావతి షాక్ అవుతుంది. తనను ఎదిరించి మరి పూజ జరిపిస్తుందా అని అనుకుంటుంది.
ఈ విషయమై మైరావతి జ్ఞానాంబపై ఫైర్ అవుతుంది. అయితే, తాను ఇంటికోడలిగా బాధ్యతగా పూజ జరిపిస్తున్నానని, అది ఎదిరించి చేసినట్లు కాదని, మామయ్య ఆత్మ శాంతి కోసమే జరిపిస్తున్నటు వంటి పూజని జ్ఞానాంబ అంటుంది. అమ్మ మాటకు గౌరవం ఇవ్వాలని గోవిందరాజు అంటాడు. కానీ, ఇంటి క్షేమం కోసం తప్పదు కదా అని అంటుంది జ్ఞానాంబ. అలా పూజ మొదలవుతుంది. పూజ పూర్తి కావస్తుంది కూడా.
ఇక పూజ అయిన తర్వాత మైరావతి ఆశీర్వాదం తీసుకునేందుకుగాను ఆమె వద్దకు వెళ్లాలని జానకి, రామాను వెళ్లాలని జ్ఞానాంబ చెప్తుంది. అయితే, తన వద్దకు ఎవరూ రావొద్దని, తన కోడలు తన మాట వినడం లేదని మైరావతి బాధపడిపోతుంది. తన డెసిషన్‌ను తన కోడలే అవమానించిందని అవమాన భారంతో మైరావతి నలిగిపోతుంది. ఇంతలోనే సీన్ కట్ అయి నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది.
మైరావతి మామిడికాయ పచ్చడి తయారు చేసేందుకుగాను మామిడికాయలు కోస్తుంటుంది. అంతలోనే అక్కడకు వచ్చి జ్ఞానాంబను చూసి గోదారిని తిడుతుంది మైరావతి. జ్ఞానాంబ మైరావతితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆసక్తికర ఘటన జరగబోతుందనే సంకేతాలు వస్తుండగానే ఎపిసోడ్ ముగిస్తుంది. అసలేం జరిగింది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగి చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.