janaki kalaganaledu 22 september 2022 full episode
Janaki Kalaganaledu 22 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 394 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరి నిమిషంలో నువ్వు మాట మార్చి నన్ను మోసం చేశావు. నువ్వు బాగుండాలని నీకోసం ఆలోచించి ఈ వదినను మోసం చేశావు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అఖిల్ అంటుంది జానకి. దీంతో తప్పలేదు వదిన. ఒట్టేయమని చెప్పేసరికి.. నా గుండె ఆగినంత పని అయింది. అప్పటి నుంచి అమ్మ దగ్గర తప్పు కాకూడదని అలా చేస్తున్నా. నిన్ను, అన్నయ్యను కూడా బ్లేమ్ చేయాల్సి వచ్చింది అంటాడు అఖిల్. దీంతో మా పరిస్థితి వదిలేయ్.. జెస్సీ పరిస్థితి ఏంటి. తను నిన్నే నమ్ముకుంది అంటుంది జానకి. దీంతో నేను ఎంత చెప్పినా వినడం లేదు వదినా. అబార్షన్ చేసుకో అని ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు అఖిల్. ఇంతలో వీళ్ల మాటలను రామా విని అక్కడికి కోపంతో వస్తాడు.
janaki kalaganaledu 22 september 2022 full episode
అఖిల్ పై చేయి చేసుకుంటాడు. అఖిల్ ను కొడతాడు. నేను పెట్టుకున్న నమ్మకానికి నువ్వు చేసేది ఇదా అని అఖిల్ ను కొడతాడు రామా. సిగ్గు లేదురా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిందే కాక.. అమ్మ మీద ఒట్టేస్తావా? వెదవ పని చేసిందే కాక నీ మాటలతో ఏమార్చేలా చేస్తావా అని రామా.. అఖిల్ పై చేయి చేసుకుంటాడు. జానకి ఎంత చెప్పినా కూడా వినడు రామా. నువ్వు బాగా చదవాలని… ఆ చదువులో నీకు ఏ ఇబ్బంది రాకూడదని అడుగడుగునా అన్నీ సమకూర్చాను కదరా. నువ్వు చిన్న చిన్న తప్పులు చేసినా అవి నీ మీద పడకూడదని.. అవి నా మీద వేసుకున్నానురా అంటాడు రామా. నా నమ్మకాన్నే మోసం చేస్తావురా అంటూ అఖిల్ ను కొడుతూనే ఉంటాడు రామా.
ఒక అమ్మాయిని మోసం చేయాలనే ఆలోచన నీకు ఎలా పుట్టిందిరా. అవతల వాళ్లు ఎంత బాధపడతారో.. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో అని ఒక్కసారైనా ఆలోచించలేదా అని అడుగుతాడు రామా. నీమాటలతో కన్నవాళ్లను మోసం చేశావు. తల్లిలా చూసుకునే మీ వదిన నమ్మకాన్ని వొమ్ము చేశావు కదరా అంటాడు రామా.
చెప్పరా.. అమ్మ ముందు నిజం ఒప్పుకుంటావా లేదా అని నిలదీస్తాడు రామా. నువ్వు ఎంత కొట్టినా నేను అమ్మ ముందు నిజం ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్. ఆ తర్వాత రామా, జానకి ఇంట్లోకి వస్తారు. జ్ఞానాంబ ఇదంతా చూసి అక్కడే కుప్పకూలిపోతుంది.
దీంతో రామా, జానకి వెళ్లి ఏమైంది అని అడుగుతారు. దీంతో నేను మొత్తం విన్నా అని చెబుతుంది జ్ఞానాంబ. వాడు అసలు నా కొడుకే కాదు అంటుంది జ్ఞానాంబ. దీంతో అలా అనకండి.. రేపటి లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అంటుంది జానకి. దీంత నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో అంటుంది జ్ఞానాంబ.
దీంతో రామా, జానకి కలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేసి తీసుకొస్తారు. ఆ తర్వాత నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు కదరా అని అతడి చెంపలు వాయిస్తుంది జ్ఞానాంబ. చివరికి అవమాన భారాన్ని భరించలేక చివరకు చావడానికి కూడా సిద్ధం అయ్యావని నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి భరోసా ఇచ్చావు కదరా అంటుంది జ్ఞానాంబ.
దీంతో తన కాళ్లు పట్టుకొని నన్ను క్షమించు అమ్మ అంటాడు అఖిల్. దీంతో నువ్వు చేసిన పనికి క్షమాపణే లేదు అంటుంది జ్ఞానాంబ. ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడను. నీకే కాదు.. నీ భార్యకు కూడా ఇది వర్తిస్తుంది. నీ పెళ్లాన్ని ఎలా పోషించుకుంటావో పోషించుకో.
జీవితంలో పైకి ఎదుగుతావని ఆశపడితే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇక నీ జీవితం గురించి నేను ఏం పట్టించుకోను అంటుంది జ్ఞానాంబ. దీంతో కన్నబిడ్డలతో ఆ తల్లి మాట్లాడకపోతే ఏమౌతుందో నీకు, నాకు తెలుసు కదా అమ్మ. మళ్లీ నువ్వు ఆ బాధ పడొద్దు. ఆ వేదన మన అఖిల్ కు కూడా మిగల్చొద్దు. దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో అంటాడు రామా.
చిన్న మనసులు.. ఇంకా కుంగిపోతాయి అంటాడు రామా. వాడి తరుపున నేను క్షమాపణ చెబుతున్నా అంటాడు రామా. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. మీరు కాస్త ఓపికగా ఉండండి. ఆ తర్వాత నేనే అమ్మకు నచ్చజెప్పుతాను అంటాడు రామా.
తన రూమ్ కు వెళ్లి కోపంతో దిండును చింపేస్తుంది మల్లిక. ఇంతలో తన మొగుడు వస్తాడు. ఏమైంది అంటాడు. నీ ప్లాన్ ఫెయిల్ అయిందా అంటాడు. దీంతో నువ్వు అలా చేస్తే నేను ఊరుకోను అంటుంది మల్లిక. కట్ చేస్తే తమ రూమ్ లోకి వెళ్తారు అఖిల్, జెస్సీ.
నాతో మాట్లాడవా అని అడుగుతాడు. దీంతో ఏం మాట్లాడాలి. నువ్వే నా లైఫ్ అనుకున్నా. కానీ.. అబార్షన్ చేయించుకో అని అన్నప్పుడు నా ప్రాణం పోయింది అంటుంది జెస్సీ. నా పేరెంట్స్ నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా? నువ్వు నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాక చాలా బాధపడ్డాను.
నా కడుపులో బిడ్డ అనాథ కాకూడదని.. నా వల్ల నా పేరెంట్స్ తల దించుకోకూడదనే కారణంతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. బయట సమాజానికే మనం భార్యాభర్తలం. ఈ నాలుగు గోడల మధ్య నీకు, నాకు ఏ సంబంధం లేదు అని చెబుతుంది జెస్సీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.