Janaki Kalaganaledu 23 August 2022 Episode : ముత్తైదువులు అన్నమాటలకి బాధపడిపోతున్న జానకి, రామ.. వాళ్లని ఓదారుస్తున్న జ్ఞానాంబ…

 Authored By prabhas | The Telugu News | Updated on :23 August 2022,11:00 am

Janaki Kalaganaledu 23 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 372 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ, గోవిందరాజు మల్లికకు శ్రీమంతం జరిపించాలని మాట్లాడుకుంటూ ఉండగా… జానకి అంతా విని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మల్లిక లీలావతి కి పట్టుచీర తీసుకొచ్చి ఇచ్చి నాకు హెల్ప్ చేసినందుకు థాంక్స్ పెద్దమ్మ అని చెప్తుంది. అప్పుడు లీలావతి నువ్వు కడుపు వచ్చిందని డ్రామా ఆడుతున్నావని మీ అత్తయ్య గారికి తెలిసిందో ఇక మామూలుగా ఉండదు అని అంటుంది. రేపు మాపో మీ అత్తయ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేపిస్తుంది అప్పుడు ఏం చేస్తావ్ అని అంటుంది. అప్పుడు మల్లికా ఆ డాక్టర్ను కూడా మేనేజ్ చేద్దాం అని అంటుంది. అప్పుడు డాక్టర్ ని మేనేజ్ చేయగలరని కడుపుని ఎలా దాచిపెడతావ్ నెల నెల కడుపు పెరగడం లేదు ఏంటి అని మీ అత్తయ్య అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తావ్ అని అంటుంది. అప్పుడు మల్లికా జానకి తన కడుపు పండలేదని ఏదో కుట్ర చేసి నా కడుపు పోయేలా చేసిందని చెప్తాను.

అని అంటుంది. కట్ చేస్తే రామ మల్లికకు పండ్లు, స్వీట్స్ అన్ని తీసుకొచ్చి జానకికి ఇచ్చి మల్లికకి టైం ప్రకారం గా ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు జానకి రామ గారు నామీద కోపంగా లేదా ..నేను మీకు బిడ్డనివ్వలేకపోతున్నందుకు మీరు బాధపడడం లేదా. మీరు నన్ను ఆ మాట అడుగుతారేమోనని ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు రామ మీ చదువుకి ఆటంకం కలగకూడదనే కదా మనం దూరంగా ఉండేది నేను మళ్ళీ ఎందుకు అడుగుతాను మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను అని అంటాడు. చూడండి జానకి గారు మీరు త్వరలో ఐపీఎస్ అవుతారు. తర్వాత తల్లి అవుతారు. ఈ ఇంట్లో సంతోషాలు మళ్లీ మొదలవుతాయి మీరు ఇవన్నీ ఆలోచించకండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అని అంటాడు. కట్ చేస్తే మల్లికా శ్రీమంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెద్దవాళ్లు కూడా అందరూ వస్తారు. అప్పుడు జ్ఞానాంబ జానకిని పిలిచి మల్లికను తీసుకురండి అని చెప్తారు. అప్పుడు మల్లికను తీసుకొని వచ్చి అక్కడ కూర్చో పెడతారు. మల్లికా మాత్రం డ్రామాలాడుతూ ఇలా సేవలు చేయించుకుంటున్నందుకు సంతోష్ పడిపోతూ ఉంటుంది.

Janaki Kalaganaledu 23 August 2022 Full Episode

Janaki Kalaganaledu 23 August 2022 Full Episode

అప్పుడు జ్ఞానాంబ పెద్దవాళ్ళని వచ్చి దీవించమని అడుగుతుంది. అప్పుడు మల్లికా మీరు ఆగండి పిన్ని ఫస్ట్ మా అత్తయ్య గారు వచ్చి దీవించిన తర్వాతనే మీరు దీవించండి అని చెప్తుంది. అప్పుడు జ్ఞానాంబ వచ్చి దీవిస్తుంది. తర్వాత అందరూ దీవిస్తారు. అందులో లీలావతి దీవిస్తూ ఉండగా మల్లిక తనకి జానకిని ఇన్సల్ట్ చేయమని చెప్తుంది. అప్పుడు లీలావతి చిన్న కోడలు అత్త మాట నిలబెట్టుకుంది. పెద్ద కోడలు కూడా అత్త మాట నిలబెట్టుకుంటే బావుండు అని సూటు పోటి మాటలు జానకిని అంటుంది. అప్పుడు లీలావతి తో పాటు అందరూ అలాగే జానకిని బాధ పెడతారు. అప్పుడు జానకి, రామ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఒక ఆవిడ ఇవాళ రేపు ఆడవాళ్లలోనే కాదు మగవాళ్ళల్లో కూడా పిల్లలు పుట్టే యోగం లేకుండా పోతుంది. కాబట్టి ఇద్దరినీ ఒకసారి డాక్టర్కు చూపించు అని జ్ఞానాంబకి చెబుతారు. వాళ్లతో పాటు లీలావతి కూడా వాళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ సఖ్యత లేనట్లుంది. అని అంటుండగా.. గోవిందరాజు లీలావతిని గట్టిగా కోప్పడతాడు. భోజనాలు చేసి వెళ్లిపోండి ఇక చాలు మీ మాటలు అని అంటాడు గోవిందరాజు. అప్పుడు జ్ఞానంబ, జానకి, రామ బాధపడుతూ ఉంటారు.

కట్ చేస్తే కార్యక్రమం అయిపోయిన తర్వాత జ్ఞానాంబ అందరిని పిలిచి జ్ఞానాంబ మౌనంగా నిలబడిపోతుంది. అప్పుడు గోవిందరాజు నీకు నేను చెప్పాను అందుకే ఈ కార్యక్రమాలు వద్దు ఇలానే సూటిపోట్లు అంటూ బాధ పెడుతూ ఉంటారు అని చెప్పాను. మన ఇంటి పరిస్థితి మనకి తెలుసు కదా వేరే వాళ్ళ అన్న మాటలు ఎందుకు మనం మనసులో పెట్టుకోవాలి. జానకి కూడా తొందర్లోనే మనకి బిడ్డని అందిస్తుంది అని అంటాడు. అప్పుడు మల్లికా సంతోష పడిపోతూ బీభత్సం మొదలవుతుంది అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకి నీ అమ్మ జానకి నువ్వు బయట వాళ్లన్న మాటలు కి ఎంత బాధ పడుతున్నావు.. నాకు అర్థం అవుతుంది. వాళ్లు మాట్లాడిన మాటలకి నీ చదువుకి ఆటంకం కలిగిస్తానేమో అని నువ్వు అనుకోవచ్చు కానీ వాళ్ళకి నాకు తేడా ఉండాలి కదా.. నేను అలా ఏమి చెయ్యను రేపు నీ చదువు నువ్వు సాధించాలనుకున్నది సాధించడంతో కొత్త ఉత్సాహం మొదలవ్వాలి అని అంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి