Janaki Kalaganaledu 23 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 395 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మీద నాకు నమ్మకం పోయింది అఖిల్. ఆడపిల్ల మనసులో నమ్మకం పోయాక.. తిరిగి ఆ నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం అంటుంది జెస్సీ. దీంతో నువ్వంటే నాకు ప్రాణం జెస్సీ. ఇంకెప్పుడూ అలా చేయను. నన్ను క్షమించు జెస్సీ. ఇంకా నామీద నమ్మకం లేదా జెస్సీ. కావాలంటే నీ కాళ్లు పట్టుకొని చెప్పనా అని అంటాడు అఖిల్. సారీ జెస్సీ అని తనను గట్టిగా హత్తుకుంటాడు. చాలా పెద్ద తప్పు చేశాను. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఐయామ్ సారీ జెస్సీ అంటాడు అఖిల్. దీంతో తను కూడా అతడిని హత్తుకుంటుంది. దీంతో హమ్మయ్య ఈ పూటకు ఎలాగోలా మేనేజ్ చేశాను అని అనుకుంటాడు అఖిల్.
మరోవైపు జ్ఞానాంబ.. జానకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నా కోడలును అనుమానించాను అని అనుకుంటుంది. కొట్టేసిన ఆ ఒక్క తప్పును వెళ్లి చెడిపేసేందుకు ప్రయత్నిస్తుంది జ్ఞానాంబ. దీంతో చెరిగిపోదు జ్ఞానాంబ. పొరపాట్లు అయితే సమసిపోతాయి కానీ.. తప్పులు చెరిగిపోవు అంటాడు గోవిందరాజు. జానకి విషయంలో నువ్వు చేసింది అదే. జానకి ఎన్నోసార్లు మన కుటుంబాన్ని కాపాడింది. అయినా నువ్వు నీ కోడలు మీద కోపం తెచ్చుకున్నావు. మన కుటుంబ పరువు కాపాడటానికి జానకి ఎన్ని నిందలు అయినా మోస్తుంది. తను కోడలుగా మన ఇంటికి రావడం దేవుడు మనకు ఇచ్చిన వరం అంటాడు జ్ఞానాంబ.
నేను అన్న మాటలను జానకి తన కడుపులో దాచుకుంది తప్ప చిన్నపాటి కోపం కూడా నా మీద చూపించలేదు. తన వల్లే ఈరోజు మన పరువు గుమ్మం దాటకుండా ఆగిపోయింది అని చెబుతుంది జ్ఞానాంబ. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు జానకి వైపు నుంచి కూడా ఆలోచించు అంటాడు గోవిందరాజు.
తన బాధ్యత నాకు సంతృప్తిని ఇవ్వలేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో బాధ్యతలంటే ఒకటి పట్టించుకొని రెండోది వదిలేయడం కాదు. ఇటు ఇంటి సమస్యలను అటు తన ఆశయాలను సమానంగా తను నష్టపోకుండా ఎవ్వరికీ నష్టం కలగకుండా నెరవేర్చేది.
ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడింది కానీ.. తన ఆశయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పరీక్షను రాయకుండా వదిలేసింది అంటుంది జ్ఞానాంబ. జీవితం అన్నాక కుటుంబ బాధ్యతలు తీసుకున్నాక.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి.
దీనికోసమే జానకి ఇన్ని సమస్యలు పడిందంటే.. పోలీస్ ఆఫీసర్ గా జానకి ఎలా తన ఉద్యోగాన్ని నిర్వర్తించగలదు. ఇదేనండి నా బాధంతా అని చెప్పి అక్కడి నంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో ఇవన్నీ పక్క నుంచి వింటాడు రామా.
జానకి గురించే ఆలోచిస్తూ ఉండగా అక్కడికి జానకి వస్తుంది. నేను కూడా అత్తయ్య గారు మామయ్య గారెతో మాట్లాడటం విన్నా అంటుంది జానకి. నేను ఇక నుంచి నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తాను అంటుంది జానకి.
కట్ చేస్తే తెల్లవారుతుంది. జెస్సీ టీషర్ట్, ప్యాంట్ వేసుకొని హాల్ లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. తనను చూసి మల్లిక షాక్ అవుతుంది. వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతుంది మల్లిక.
దీంతో ఇంట్లోకి వచ్చి జానకిని పిలిచి.. అత్తారింట్లో ఉన్నప్పుడు అన్ని పద్ధతులు పాటించాలి అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే.. నేను చెబుతాను అత్తయ్య గారు అని చెప్పి జెస్సీని లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతుంది జానకి.
దీంతో కట్టుబట్టలతో రావడం వల్ల ఇంట్లో డ్రెస్సులు లేవని.. అందుకే అఖిల్ బట్టలు వేసుకున్నా అని చెబుతుంది. కట్ చేస్తే అందరూ టిఫిన్ తినడానికి వస్తారు. అఖిల్, జెస్సీలను చూసి నేను తర్వాత తింటా అంటుంది.
ఇంతలో జెస్సీ తల్లిదండ్రులు వస్తారు. మిమ్మల్ని క్షమించండి అని జ్ఞానాంబను వేడుకుంటారు. ఒక్కగానొక్క కూతురు జీవితం ఏమౌతుందో అని భయంతో ఏ తల్లిదండ్రులు అయినా ఇలాగే మాట్లాడుతారు. జరిగింది ఏదో జరిగిపోయింది అంటాడు గోవిందరాజు.
రండి కూర్చొండి అని అంటుంది జానకి. పర్లేదండి. పెళ్లి మా ఇంట్లో జరిగితే నాన్ వెజ్ తో విందు భోజనం పెడదామని అనుకున్నాం అంటాడు పీటర్. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.