Home » Entertainment » Janaki Kalaganaledu 24 January 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 24 Jan Today Episode : జ్ఞానాంబకు అసలు నిజం చెప్పిన కన్నబాబు.. రామాను చంపించేందుకు సునంద ప్లాన్.. ఈ విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: January 24, 2022, 10:36 am
Advertisement

Janaki Kalaganaledu 24 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 221 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కోడలు నిన్ను ఎందుకు కొట్టింది అని కన్నబాబును ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. నువ్వు ఎంత వెదవవో నాకు తెలుసు. కారణం లేకుండా నా కోడలు ఏ పని చేయదు. నువ్వేదో వెదవ పని చేసి ఉంటావు. చెప్పు.. ఏం చేశావు నువ్వు. ఎందుకు కొట్టింది నా కోడలు నిన్ను. మాట్లాడు అని అంటుంది జ్ఞానాంబ. దీంతో కన్నబాబు ఏం మాట్లాడడు. ఏయ్.. నేను ఎంత మంచిదాన్నో.. అంత చెడ్డదాన్ని. చెప్పరా అని బెదిరిస్తుంది జ్ఞానాంబ. దీంతో అసలు విషయం మొత్తం చెప్పేస్తాడు కన్నబాబు. దీంతో జ్ఞానాంబ, జానకి షాక్ అవుతారు.

Advertisement

janaki kalaganaledu 24 january 2022 full episode

నేను మీ చిన్న కోడలు మల్లిక చేయి పట్టుకున్నాను అందుకే జానకి నన్ను కొట్టింది అని చెబుతాడు కన్నబాబు. తను కాబట్టి కొట్టింది. నేనైతే చంపి ఉండేదాన్ని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్లంతా జ్ఞానాంబ కోసం ఎదురుచూస్తుంటారు. రామా కూడా టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో జానకిని తీసుకొని జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. మల్లిక వెంటనే జానకికి కౌగిలించుకొని జానకి బాగున్నావా.. నీకేం కాలేదు కదా అని అడుగుతుంది మల్లిక. నాకు ఏం కాలేదు. నేను బాగానే ఉన్నాను అంటుంది జానకి. జ్ఞానాంబ ఏమైంది.. ఇంత ఆలస్యం.. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు గోవిందరాజు. ఆ నిజం ఏంటో నేను స్వయంగా తెలుసుకుందామని జానకిని తీసుకొని వెళ్లాను అంటుంది జ్ఞానాంబ.

Advertisement

అవునా.. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు గోవిందరాజు. కన్నబాబు దగ్గరికి అంటుంది. జానకి ఎందుకు ఆ నిజం చెప్పలేదో.. ఎందుకు ఆ నిజం దాచాల్సి వచ్చిందో నేను తెలుసుకున్నాను అంటుంది. అంటే వెన్నెల ప్రేమ విషయం బయటపడిపోయిందన్నమాట.. అని అనుకుంటుంది మల్లిక.

ఏం జరిగిందంట జ్ఞానం.. అని అడుగుతుంది మల్లిక. అసలు జానకి ఏం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉందట అని మల్లిక అడగడంతో నీ గురించి ఆలోచించి అంటుంది జ్ఞానాంబ. నా గురించి ఏంటి అత్తయ్య గారు.. అంటుంది. దీంతో వాడు నీ చెయ్యి పట్టుకున్నాడంట కదా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో వోయమ్మో.. ఏందబ్బా ఇది కత్తి చివరికి నావైపు తిరిగింది ఏంటి అని అనుకుంటుంది మల్లిక.

Advertisement

దీంతో మల్లిక అవమానపడకూడదని జానకి నోరు విప్పలేదని జ్ఞానాంబ అందరికీ చెబుతుంది. పోలీసుల ముందు అంటే చెప్పడానికి భయపడిపోయావు. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇక.. జరిగిందేదో జరిగిపోయింది. ఇక వదిలేసేయ్ అమ్మ అంటాడు రామా.

Janaki Kalaganaledu 24 Jan Today Episode : మల్లికకు క్లాస్ పీకిన జ్ఞానాంబ

అసలు వాడితో నువ్వెందుకు గొడవ పడ్డావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఒక కట్టుకథను అల్లుతుంది మల్లిక. చాలులే ఆపు.. అని మల్లికపై సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. జానకిని మరోసారి మెచ్చుకుంటుంది జ్ఞానాంబ. రేపు మనందరం గుడికి వెళ్లాలి. వెళ్లి పడుకోండి.. అని చెబుతుంది జ్ఞానాంబ.

మరోవైపు జానకి తన రూమ్ కు వెళ్తుంది. జానకి గారు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు రామా. ఆ కన్నబాబుకు మన కుటుంబం మీద చాలా పగ ఉంది. మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు.. వెన్నెల ప్రేమ విషయం అత్తయ్యకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది జానకి.

ఇంతలో రామాకు కన్నబాబు ఫోన్ చేస్తాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు అమ్మకు ఎందుకు అలా చెప్పాడో ఇప్పుడు మీకే అర్థం అవుతుంది అంటాడు రామా. నువ్వు చెప్పినట్టే.. అక్షరం పొల్లు పోకుండా మీ అమ్మగారికి చెప్పాను అంటాడు కన్నబాబు. కావాలంటే ఒకసారి మీ అమ్మగారిని అడుగు అంటాడు కన్నబాబు.

Advertisement

అవసరం లేదు.. అంటాడు రామా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా చెల్లెలు గురించి ఎక్కడా నువ్వు వాగకూడదు. ఆ విషయం నీలోనే సమాధి అయిపోవాలి. అలా కాకుండా నీ నోటి నుంచి మాట బయటికి వచ్చిందో అదే నీకు చివరి మాట అవుతుంది గుర్తుపెట్టుకో అని బెదిరిస్తాడు రామా.

ఆ విషయాన్ని నేను ఎప్పుడో మరిచిపోయాను అని అంటాడు కన్నబాబు. దీంతో జానకి కుదుటపడుతుంది. కాసేపు రామా ఒడిలో పడుకుంటుంది. రామా గారు ఆడపిల్లకు అన్నయ్య అంటే కొండంత బలం. భార్యకు భర్తంటే వెయ్యి ఏనుగుల బలం. మీలాంటి అన్నయ్య, భర్త ఉంటే ఎవ్వరికీ భయం ఉండదు అంటుంది జానకి.

మరోవైపు సునంద.. జ్ఞానాంబ కుటుంబాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది. రామచంద్రను చంపించడం కోసం కిరాయి గుండాను మాట్లాడుతుంది. రేపు గుడికి జ్ఞానాంబ కుటుంబం వెళ్తోంది. రేపు దైవదర్శనం పూర్తవగానే.. రామచంద్ర డైరెక్ట్ గా పైకి వెళ్లిపోవాలి. చేయించింది నేను అని ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి రావద్దు అని చెబుతుంది.

కట్ చేస్తే ఉదయమే సంక్రాంతి సంబురాలు ప్రారంభం అవుతాయి. జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబురాల్లో పాల్గొంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి