janaki kalaganaledu 25 april 2022 full episode
Janaki Kalaganaledu 25 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా.. జానకిని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తీసుకొని వస్తుంటాడు. ఇంతలో రామాకు ఫోన్ వస్తుంది. జానకి గారు ఒక్క నిమిషం అని అంటాడు. ఇంతలో తనకు అక్కడ గాంధీ బొమ్మ కనిపిస్తుంది. దీంతో తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన తండ్రి తనను చదివించిన విషయాలన్నీ గుర్తొస్తాయి. దీంతో జానకికి చాలా సంతోషం వేస్తుంది. అదే గాంధీ బొమ్మ మీద తను చదువుకున్న విషయాలు కూడా తనకు గుర్తొస్తాయి.
janaki kalaganaledu 25 april 2022 full episode
రామా గారు.. జానకి గారు అంటూ ఇద్దరూ ఏదో ఒకరికి మరొకరు చెప్పబోతారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారు కదా చెప్పండి అని అంటాడు రామా. మీరే చెప్పండి అంటుంది జానకి. ఒకసారి నేను ఇదే దారిలో వెళ్తుంటే ఈ వీధి లైట్ కింద ఒక అమ్మాయి చాలా శ్రద్ధగా చదువుకుంటూ కనిపించింది అండి. ఆ అమ్మాయికి చదువుకున్న తీరుకు.. చాలా ముచ్చటేసింది. ఆ క్షణం ఆ అమ్మాయికి స్వీటు బాక్స్ ఇవ్వాలనిపించింది. వెంటనే ఆ స్వీటు బాక్స్ ను ఆ అమ్మాయికి కనిపించకుండా అక్కడ పెట్టి వెళ్లిపోయాను అని చెబుతాడు రామా. దీంతో అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటుంది జానకి.
ఆరోజు ఆ అమ్మాయి స్వీటు బాక్స్ తీసుకుందో లేదో అంటాడు రామా. అంటే మీరు పేరుకే శ్రీరామచంద్రుడు అన్నమాట. మీలోపల శ్రీకృష్ణుడి లీలలు కూడా ఉన్నాయన్నమాట అంటుంది జానకి. అయ్యబాబోయ్ ఏంటండి.. ఒక్కసారి అలా అనేశారు అంటాడు రామా. నిజానికి.. ఆ అమ్మాయి జానకి అని రామాకు తెలియదు.
ఆ అమ్మాయికి స్వీటు బాక్స్ ఇవ్వడం ఏంటి. ఆ స్వీటు బాక్స్ తో స్వీటుగా ఆ అమ్మాయికి లైన్ వేద్దామనా అంటుంది జానకి. ఆ అమ్మాయిని చూస్తే సరస్వతి దేవిగా కనిపించింది. అందుకే.. నా చేతిలో అప్పుడు స్వీటు బాక్స్ ఉండటంతో దాన్నే ఇచ్చేశాను.. అంటాడు రామా.
ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది.. బాగుందా అని అడుగుతుంది. దీంతో నేను అక్కడ స్వీటు బాక్స్ పెట్టడానికే చలిజ్వరం వచ్చినట్టు వణికిపోయాను. ఇంకా ఆ అమ్మాయిని చూసే ధైర్యం కూడా ఉందా అంటాడు. దీంతో ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని చూసేవారా అంటుంది జానకి.
తర్వాత ఎప్పుడైనా ఆ అమ్మాయి కనిపించిందా.. తనతో మాట్లాడారా అని అడుగుతుంది. దీంతో ఆ రోజు తప్ప మళ్లెప్పుడూ చూడలేదండి అంటాడు రామా. దీంతో లేదు.. మీరు ఆ అమ్మాయిని చాలా సార్లు చూశారు.. మాట్లాడారు కూడా అంటుంది జానకి.
దీంతో నేను ఆ అమ్మాయిని మళ్లీ చూడలేదండి అంటాడు. అబద్ధాలు ఆడకండి అంటుంది జానకి. ఆ అమ్మాయిని మీరు ప్రతి రోజు చూస్తున్నారు.. మాట్లాడుతున్నారు కూడా. ఇప్పుడు కూడా చూస్తున్నారు.. మాట్లాడుతున్నారు అంటుంది జానకి.
దీంతో అప్పుడు రామాకు లైట్ వెలుగుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. జానకేనని. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వస్తారు రామా, జానకి.
ఇంటి దగ్గర ఎవరిదో పర్సు పడిపోతుంది. ఎవరిది అని చూస్తారు. అందులో డాలర్స్ ఉంటాయి. ఎవరిదో అనుకుంటారు. ఇంతలో అందులో పాస్ పోర్ట్ ఉంటుంది. లూసీ అనే యూఎస్ అమ్మాయిది ఆ పాస్ పోర్ట్. ఆ పర్సులో ఏవైనా వివరాలు ఉంటాయేమోనని చూస్తుంది జానకి.
అందులో విజిటింగ్ కార్డు ఉంటుంది. దీంతో అందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తుంది జానకి. కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయరు. మళ్లీ చేస్తుంది జానకి. కానీ.. లిఫ్ట్ చేయరు. రేపు ఫోన్ చేసి అప్పగించేద్దాం అంటాడు రామా. పదండి.. ఇంట్లోకి వెళ్లిపోదాం అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.