Janaki Kalaganaledu 25 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 25 ఆగస్టు 2021, 113 ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బుధవారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేకులు నేర్చుకోవడానికని చెప్పి.. కోచింగ్ కోసం జానకి వెళ్లాలని.. దాని కోసం ఎలా ప్లాన్ చేయాలో అర్థం కాక.. రామా, జానకి ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. ఒకవేళ కేక్ షాప్ కు అత్తయ్య ఫోన్ చేస్తే ఎలా? అని టెన్షన్ పడతారు ఇద్దరూ.
వీళ్లిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారో అని మల్లిక తెగ టెన్షన్ పడుతుంది. వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని.. వాళ్లను ఫాలో అవుతుంది మల్లిక. ఆటోలో కూర్చొని వెళ్తుంది. బండి మీద రామా, జానకి.. ఇద్దరూ ముందు వెళ్తుంటారు. ఎందుకమ్మా.. వాళ్లను ఫాలో చేస్తున్నావు.. అంటాడు ఆటో డ్రైవర్.
మొత్తానికి తన బైక్ ను ఫాలో చేస్తూ వెళ్తుంటుంది మల్లిక. అయితే.. మధ్యలో ఆటో ఆగుతుంది. ఏమైంది.. అంటే ఆగిపోయింది అని చెబుతాడు. పెట్రోల్ అయిపోయింది అని చెబుతాడు. దీంతో ఆటో డ్రైవర్ పై చిరాకు పడుతుంది మల్లిక. వెంటనే తన మొగుడికి ఫోన్ చేస్తుంది.
నేను రాజమండ్రి వెళ్లే రూట్ లో ఉన్నాను. వెంటనే రండి.. అని చెబుతుంది. దీంతో.. తన భర్త బైక్ వేసుకొని వస్తాడు. వాళ్లు ఏదో పెద్ద ప్లాన్ మీద వెళ్లారు. మనం వాళ్ల ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. త్వరగా వెళ్లండి.. అని చెబుతుంది మల్లిక. అయితే.. కొంచెం దూరం వెళ్లగానే వాళ్లు కనిపించరు. ఎక్కడ వెతికినా కనిపించరు.
కట్ చేస్తే.. జానకి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం ఇన్ స్టిట్యూట్ కు వెళ్తుంది. అక్కడ తన డిగ్రీ క్లాస్ మెట్ కలుస్తాడు. అతడు కూడా అక్కడే సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంటాడు. తన భర్తకు పరిచయం చేస్తుంది అతడిని. కాలేజీలో జాను.. పులిలా ఉండేదంటూ అతడు చెబుతాడు.
జానకిగారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా.. అడిగితే ఏం అనుకోవద్దు.. అని అంటాడు. అతడు ఇందాకా.. మనల్ని మ్యాడ్.. ఫర్ ఈచ్ అదర్… అంటూ ఏదేదో అన్నాడు కదా. అంటే ఏంటండి.. అని అడగడంతో.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. అంటే ఒకరి కోసం ఇంకొకరు.. చక్కగా.. చూడముచ్చటగా ఒకరి కోసం ఇంకొకరు.. అన్నట్టుగా ఉన్నారు.. అని అన్నాడు అని జానకి చెప్తుంది.
గంట నుంచి అటూ ఇటూ బండి మీద తన భర్తను తిప్పుతుంది మల్లిక. గంట నుంచి నన్ను అటూ ఇటూ తిప్పుతున్నావు. ఇక నావల్ల కాదు.. అని అంటాడు విష్ణు. వాళ్లు దొరికేదాకా మనం వెతకాలి. కేకు నేర్చుకోవాలని వెళ్లి.. ఎక్కడికి వెళ్లింది.. అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
జానకి, రామా.. ఇద్దరూ కోచింగ్ సెంటర్ నుంచి బయలు దేరే సమయానికే.. అక్కడికి మల్లిక, తన భర్త చేరుకుంటారు. ఇంతలోనే తనకు జ్ఞానాంబ ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు.. అని అడుగుతుంది. బయట ఉన్నాను.. అత్తయ్య గారు. కూరగాయల కోసం వచ్చాను. మీకు జామకాయలు అంటే ఇష్టం కదా.
అందుకే.. వాటి కోసం వెతుకుతున్నా.. అని అంటుంది. మీ ఆయన కొట్లో లేడు. నువ్వు ఇంట్లో లేవు. ఇద్దరు కలిసి ఎక్కడ తిరుగుతున్నారు. 5 నిమిషాల్లో మీరు ఇంట్లో లేకపోతే.. ఏం జరుగుతుందో తెలుసు కదా.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది జ్ఞానాంబ.
కట్ చేస్తే.. జ్ఞానాంబ ఇంటికి కారులో కొందరు వస్తారు. జానకి టీ తీసుకురా అని అడుగుతుంది. అసలు ఎవరు వీళ్లు అని విచిత్రంగా చూస్తుంది మల్లిక. ఇప్పుడు ఎన్నికల్లో కూడా లేరు. ఇలా వచ్చారు ఏంటి.. అని ఆ వ్యక్తిని అడుగుతారు. మీరే నాకు సహాయం చేయాలి. ఒక సమస్య వచ్చిపడింది. హైకమాండ్ తో పాటు.. చుట్టుపక్కల అందరూ పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. 1000 మందికి మీరు స్వీట్లు, హాట్స్ తయారు చేసి ఇవ్వాలి.. అని అడుగుతాడు ఆ రాజకీయ నాయకుడు.
కష్టం బాబ్జీ గారు. 1000 మందికి స్వీట్లు అంటే కనీసం 4 నుంచి 5 రోజులు పడుతుంది. మీరేమో.. రేపే కావాలంటున్నారు.. అందించడం కష్టం అండి.. అని చెబుతుంది. జ్ఞానాంబ గారు మీరు దయచేసి ఆ మాట అనకండి. మీమీద నమ్మకం పెట్టుకొని వచ్చాను. మీరు కాదంటే నా పరువు పోతుందండి.. అంటాడు. నిజమేనండి. కానీ.. ఒప్పుకున్నాక అందించకపోతే మా నమ్మకం కూడా పోతుంది కదా.. అని అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి కలగజేసుకొని బాబ్జి గారు ఒక్క నిమిషం.. మీ ఫోన్ నెంబర్ మామయ్య గారికి ఇచ్చి వెళ్లండి. మీ ఆర్డర్ ను ఓకే చేస్తున్నాం. అని చెబుతుంది జానకి. ఏం చేస్తున్నావు జానకి.. అని అడుగుతుంది జ్ఞానాంబ. చెప్తుంటే అర్థం కాదా నీకు. నాలుగు ఐదు రోజులు పనిచేసినా.. ఆర్డర్ అందించడం చాలా కష్టం. అలాంటిది.. ఒక్క రోజులో ఎలా అందిస్తాం.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
ఈ స్వీట్ల తయారీ గురించి నీకేం తెలుసు. నువ్వు ఎలా చేసి ఇస్తావు.. అని అడుగుతుంది. ఈ స్వీట్లు తయారు చేసే అనుభవం నాకు లేదు. కానీ.. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఉదాహరణకు.. ఒక మనిషి.. ఒక రోజు 500 లడ్డులు చేయగలడు అనుకుందాం. అదే ఇద్దరు అయితే వెయ్యి లడ్డులు తయారు చేస్తారు. మన దగ్గర ఉన్న వర్కర్స్ తో పాటు.. మరో 10 మంది వర్కర్స్ ను తీసుకుంటే.. ఈ ఆర్డర్ ను అనుకున్న సమయానికి అందివ్వొచ్చు అత్తయ్య గారు.. అని చెబుతుంది జానకి.
అత్తయ్య గారు టైమ్ ఇస్తే ఎవరైనా చేసిస్తారు. అదే తక్కువ సమయంలో ఆర్డర్ చేసిస్తే.. మన షాపుకు డిమాండ్ పెరుగుతుంది. ఏదైనా తేడా వస్తే పరువు పోతుంది. ఇన్ని సంవత్సరాలు ఉన్న పరువు పోతుంది.. అని అంటుంది జ్ఞానాంబ.
అయితే… ఎలాగైనా ఈ స్వీట్లను చేయనీయకుండా.. జానకిని ఆపి.. జ్ఞానాంబతో తిట్టించాలని మల్లిక అనుకొని.. స్వీట్ల తయారీ కోసం ఓ 10 మందిని జ్ఞానాంబ పిలుస్తుంది. వాళ్లను స్వీట్ తయారు చేయడానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది మల్లిక. మీరు స్వీట్లు తయారు చేయడానికి వెళ్లకూడదు. మీరు 10 మంది ఉన్నారు కదా. మనిషికి 3 వేల చొప్పున ముప్పై వేలు ఇస్తున్నాను. తీసుకొని తిరిగి ఇంటికి వెళ్లి పండుగ చేసుకోండి.. అని చెబుతుంది మల్లిక.
ఆ పని వాళ్లు రాకపోవడంతో.. ఆర్డర్ చేయడం కష్టం అవుతుంది. దీంతో నా మాట కాదని ఆర్డర్ ఒప్పుకొని ఇప్పుడు చూడండి.. ఏమైందో. ఆర్డర్ ఒప్పుకొని లేట్ చేసినందుకు నాకు క్షమాపణలు చెప్పండి.. అని జానకిని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏమౌతుంది. జానకి.. జ్ఞానాంబకు క్షమాపణలు చెబుతుందా? ఆర్డర్ సమయానికి అందిస్తారా? అందివ్వరా? అనే విషయాలు తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.