janaki kalaganaledu 25 january 2022 full episode
Janaki Kalaganaledu 25 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 222 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. గుడికి వెళ్లిన జ్ఞానాంబ ఫ్యామిలీ అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటుంది. రామా, జానకి, మల్లిక, విష్ణు, వెన్నెల, జ్ఞానాంబ, గోవిందరాజు అందరూ చాలా సంతోషంగా భోగి మంటల ముందు డ్యాన్స్ చేస్తుంటారు. ఇంతలో సంక్రాంతి వేడుకలకు సునంద, కన్నబాబు వస్తారు. జానకి, రామాను చూసి కన్నబాబుకు మండిపోతుంది. దీంతో నేను ఒక ప్లాన్ వేశాను. నువ్వేం కంగారు పడకు అంటుంది సునంద. అత్తయ్య గారు మీరు కూడా డ్యాన్స్ చేస్తారా అని మల్లిక, జానకి అడుగుతారు. ప్లీజ్ ప్లీజ్ అనేసరికి జ్ఞానాంబ కాదనలేకపోతుంది.
janaki kalaganaledu 25 january 2022 full episode
దీంతో అందరితో కలిసి జానకి డ్యాన్స్ వేస్తుంది. గోవిందరాజు కూడా వాళ్లతో డ్యాన్స్ వేస్తుంటాడు. దీంతో రామా, అఖిల్.. గోవిందరాజును పక్కకు నెట్టేస్తారు. కాసేపు డ్యాన్స్ వేసి జ్ఞానాంబ పక్కకు వచ్చేస్తుంది. పిల్లలు ఇక రండి.. ఆలస్యం అవుతోంది అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ వచ్చేస్తారు. సరే సరే పదండి అంటుంది జ్ఞానాంబ. గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటుంది జ్ఞానాంబ ఫ్యామిలీ. దేవుడి గుడిలో ఉన్న గంటను కొట్టేందుకు ప్రయత్నిస్తుంది జానకి. కానీ.. తనకు ఆ గంట అందదు. దీంతో రామా వెళ్లి తన చేయి పట్టుకుంటాడు. జానకి గారు.. మీరు కోరుకున్న కోరిక నెరవేరడం కోసం ఆ కలను మీరు చేరడం కోసం నేను మీకు ఒక మెట్టుగా నిచ్చనగా ఉంటాను. మీ కలకు కోరికకు నేను వంతెనను అవుతాను అంటాడు రామా.
దేవుడిని మొక్కుకొని తనను ఎత్తుకొని జానకితో గంట కొట్టిస్తాడు రామా. తర్వాత తనను కిందికి దింపుతాడు. చూడు అటు అంటూ మల్లిక విష్ణును అడుగుతుంది. నిన్ను కూడా కొట్టించమంటావా అంటే అవసరం లేదు అంటుంది మల్లిక. మరోవైపు చికిత, వెన్నెల వెళ్లి వాళ్ల మీద పూలు చల్లుతారు.
తల్లీ ఎప్పుడూ నా కొడుకు కోడలు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మొక్కుతుంది జ్ఞానాంబ. ఉంటారులే జ్ఞానం.. నువ్వు ఉన్నావు కదా అంటాడు గోవిందరాజు. మరోవైపు వాళ్ల మీద పూలు చల్లుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది జానకి. కోరుకున్నారా.. గట్టిగా కోరుకున్నారా అని అంటాడు రామా.
మా ఆయన బంగారం అంటుంది జానకి. మా ఆవిడ కూడా బంగారం అంటాడు రామా. ఏమండి.. అత్తయ్య గారు చూస్తున్నారు అంటుంది జానకి. ఇంతలో లీలావతి వచ్చి ముగ్గుల పోటీలు ప్రారంభం అవుతున్నాయి.. మీ కోడల్లలో ఎవరు వస్తున్నారు అని జ్ఞానాంబను అడుగుతుంది లీలావతి.
ఇదిగో లీలావతి.. ఈ సారి ముగ్గుల పోటీలలో ఒక్క మా కోడల్లు మాత్రమే కాదు.. మా ఆవిడ కూడా పాల్గొంటుంది అంటాడు గోవిందరాజు. దీంతో ఇంకేంటి.. జ్ఞానాంబ వస్తే పోటీ పెరుగుతుంది అంటుంది లీలావతి. మొదటి బహుమతి గెలుచుకున్నవాళ్లకు 50 వేలు, రెండో బహుమతికి పాతిక వేలు, మూడో బహుమతిగా పదివేలు గెలిచిన పోటీదారులకు మన ఎమ్మెల్యే మధులత గారు అందజేస్తారు అని చెబుతారు.
ఇక.. ముగ్గుల పోటీలు ప్రారంభం అవుతాయి. ఇంతలో రామా బైక్ కు బాంబు పెడతాడు కిరాయి రౌడీ. ఆ బండి వేసుకొని రామా బంటి పోటీలలో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.