Janaki Kalaganaledu 25 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 417 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎంత డబ్బు సంపాదించినా ఇలాంటి ప్రేమానురాగాలు దొరకవు. ఇలాంటి కల్మషం లేని మనుషులు దొరకరు. అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఒకరికి మరొకరు తోడుగా ఉందాం. ఇంకో కుటుంబానికి ఆదర్శంగా ఉన్న మనం అంతే ఆదర్శంగా కలిసిమెలిసి ఉందాం. అర్థం చేసుకోండి అని మల్లిక, అఖిల్ కు చేతులు జోడించి మరీ వేడుకుంటుంది జానకి. అత్తయ్య గారు రేపే విడిపోదాం అన్న ఆలోచనను దయచేసి మీ మనసులో నుంచి తీసేయండి. నాకు ఒక్క మూడు నెలలు సమయం ఇవ్వండి. వీళ్ల అభిప్రాయాలను నేనే మారుస్తాను అంటుంది జానకి. కనీసం మల్లిక, జెస్సీ కడుపులో పెరుగుతున్న బిడ్డను దృష్టిలో పెట్టుకొని అయినా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ప్లీజ్ అత్తయ్య గారు అంటుంది జానకి.
కట్ చేస్తే మల్లిక వేరు కాపురం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా వేరు కాపురం పెట్టే సమయానికి జానకి ఏంటి అలా మాట్లాడింది అని అనుకుంటుంది మల్లిక. జానకి ఎంత కలిసి ఉందామని వేడుకున్నా.. పోలేరమ్మ ఏం మాట్లాడలేదు. అంటే రేపు విడిపోయి వేరు కాపురం పెట్టడం తథ్యం అన్నమాట. కానీ.. జానకి మాటలకి నా తింగరి మొగుడు కరిగిపోయాడో ఏంటో.. ఆయన మనసు మారకుండా చూడాలి.. అని అనుకోగానే విష్ణు వస్తాడు. రేపు మనం వాటాలుగా విడిపోతున్నామని అత్తయ్య గారికి చెప్పారు కదా.. జానకి ఏమో కలిసే ఉండాలని తెగ ఆరాటపడుతోంది. మనం మాత్రం గట్టిగా విడిపోయే మాట మీదే ఉండాలి. సరేనా అంటుంది మల్లిక. వదిన, అమ్మ రిక్వెస్ట్ చేస్తుంటే చాలా బాధేస్తోంది. వేరుగా వెళ్లే ఆలోచన వద్దు మల్లిక అంటాడు విష్ణు. దీంతో నేనేమన్నా మనకోసం వెళ్దామంటున్నానా.. మనకు పుట్టబోయే బిడ్డ కోసం వెళ్దాం అనుకుంటున్నా అంటుంది మల్లిక.
మన ఊళ్లో అసలు పెద్ద పెద్ద స్కూల్లే లేవు. సిటీలో అయితే పెద్ద స్కూల్స్ ఉంటాయి. మంచిగా చదివించుకోవచ్చు. సిటీలో పెద్ద షాపు పెట్టొచ్చు. అప్పుడు మీరు పెద్ద వ్యాపార వేత్త అయిపోవచ్చు. జానకి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఇక్కడ ఉంటుందా.. అంటుంది మల్లిక.
తను కూడా సిటీకి వెళ్లిపోతుంది. ఎలా ఆలోచించినా మనం వేరు కాపురం పెట్టడమే కరెక్ట్. ఏమంటారు అంటుంది. దీంతో దీని నస భరించలేకపోతున్నాను అని సరే అంటాడు విష్ణు. దీంతో తెగ సంతోషిస్తుంది మల్లిక.
మరోవైపు జానకి ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రామా వచ్చి భోజనం చేయలేదు ఎందుకు. నేను తినిపిస్తాను. తినండి అంటాడు రామా. దీంతో వద్దు రామా గారు.. తిండి గొంతు దాటడం లేదు. ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకండి అంటుంది జానకి.
వాళ్ల మీద కోపంతో అమ్మ కూడా తన నిర్ణయం మీద గట్టిగా ఉంది. అమ్మ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకో అంటే తను కూడా బాధపడుతుంది కదా అంటాడు రామా. అత్తయ్య గారు ఇలా విడిపోయి బతకలేరు అనే విషయం నాకంటే మీకే బాగా తెలుసు అంటుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు చాలా బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించు జ్ఞానం అంటాడు గోవిందరాజు. వాళ్లు తప్పు చేస్తే జానకి ఎందుకు బాధపడాలి. అందులోనూ తన ఐపీఎస్ కల కూడా నెరవేరడం కష్టంగా ఉంటుంది అంటాడు గోవిందరాజు.
మరోవైపు రాత్రి అఖిల్ కు తెగ కడుపునొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. లేచి మంచినీళ్లు తాగి మళ్లీ పడుకుంటాడు అఖిల్. ఇంతలో జెస్సీ లేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది.
దీంతో అఖిల్ కు కడుపునొప్పి లేస్తోందని రామా, జానకిని లేపుతుంది జెస్సీ. ఇంతలో జీలకర్ర కలిపిన మజ్జిగను తీసుకొస్తుంది జానకి. ఇది తాగు తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అంటుంది.
దీంతో దాన్ని తాగుతాడు. మంట తగ్గింది వదిన అంటాడు. తన కడుపునొప్పి కూడా తగ్గుతుంది. చెప్పుడు మాటలు చెవికి ఎక్కించుకొని దేవుళ్ల లాంటి వీళ్లను వదిలి వెళ్లాలని అనుకున్నావు. అదే జరిగితే ఇలాంటి పరిస్థితుల్లో మనకు దిక్కెవరు అఖిల్.
నిన్ను నమ్ముకొని వచ్చిన నా గతి ఏంటి అని అడుగుతుంది జెస్సీ. మనకు పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు ఏముంటుంది అని అడుగుతుంది జెస్సీ. దీంతో అఖిల్ తను చేసిన తప్పునను రియలైజ్ అవుతాడు.
తనను క్షమించమని రామా, జానకిని వేడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
This website uses cookies.