
karthika deepam 25 october 2022 full episode
Karthika Deepam 25 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1492 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాల్తేరు వాణి.. దీప ఇంట్లో ఉండి దుర్గ, దీప తనను నమ్మేలా చేస్తుంది. ఆ మోనిత గురించి అంతా వాణికి చెబుతుంది దీప. దీంతో నీ పగను కూడా నా పగను చేసుకొని దానికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అంటుంది. దానిని అసలు చంపేయాలి అంటుంది వాణి. దీంతో దానితో అంత ఈజీ కాదు. మోనితను తక్కువ అంచనా వేయకు అంటుంది దీప. దుర్గ కూడా అదే చెబుతాడు. కానీ.. వాణి మాత్రం దీప, దుర్గ ఇద్దరినీ చంపేయాలని ప్లాన్ చేస్తుంది. ముందు నువ్వు కార్తీక్, మోనితను ఎలా విడదీయాలో ఆలోచించు అని వాణికి చెబుతాడు దుర్గ.
karthika deepam 25 october 2022 full episode
ఆతర్వాత కార్తీక్ ఇంకా శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది కార్తీక్.. అలా కూర్చున్నావు. పదా భోజనం చేద్దాం అంటుంది మోనిత. దీంతో నాకు ఆకలిగా లేదు అంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్ నువ్వు ఇలా అయిపోయావు. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నా. నువ్వు మాత్రం నన్ను అవమానిస్తున్నావు అంటుంది మోనిత. నన్ను, దుర్గను కలిపి అంటున్నావు కదా.. మరి నువ్వు, వంటలక్క చేసేది ఏంటి. తెల్లారి లేస్తే నువ్వు అక్కడే ఉంటున్నావు. అక్కడ వంట చేస్తున్నావు. షికారు కూడా చేస్తున్నవు. దానికి అయితే సిగ్గు లేదు. కానీ.. నీకేమైంది అంటుంది మోనిత. దీంతో వంటలక్కను ఏదైనా అంటే బాగోదు అంటాడు కార్తీక్. ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ ఉంటాను అంటాడు కార్తీక్.
మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మోనిత. దీంతో ప్రశాంతత కోసం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత దుర్గ, వాణి ఇద్దరూ కలిసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు.
నీకు నిజం చెప్పనా.. ఆ మోనితను నువ్వు టార్చర్ పెడుతున్నావని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నువ్వు నాకు నచ్చావు అంటుంది వాణి. అసలు నాకు ఆడవాళ్ల వాసన అంటే నాకు నచ్చదు అంటాడు దుర్గ.
నాకు ఆడవాళ్లు అంటే పడదు కానీ.. నిన్ను చూడగానే నాకు ఇష్టం కలిగింది అంటాడు. ఎందుకంటే నువ్వు దీపమ్మకు తోడుగా ఉంటున్నావు కదా అంటాడు. డిన్నర్ కు వెళ్దాం కదా అంటుంది.
దీంతో డిన్నర్ కా, నీతోనా అంటాడు. ఎప్పుడూ అమ్మాయిలతో కలిసి డిన్నర్ కు వెళ్లలేదు అంటాడు. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చెబుతా అని అంటాడు. దీంతో సరే అని చెప్పి ఇక నేను వెళ్తాను అంటుంది.
ఇంతలో కార్తీక్.. దీప ఇంటికి వస్తాడు. ఏంటి వంటలక్క ఇప్పుడు గిన్నెలు కడుగుతున్నావు ఎందుకు అని అడుగుతాడు. అదా.. రేపు ఉదయం శౌర్యను వెతకడానికి వెళ్లాలి అందుకే ఇప్పుడే తోముతున్నాను అంటుంది దీప.
నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్లకు అంటాడు. తనకు జాగ్రత్తలు చెబుతాడు. అయితే రేపు శౌర్యను వెతకడానికి వెళ్లాలి అంటుంది దీప. దీంతో వద్దు వద్దు.. రేపు నేను ఊళ్లో ఉండను. నేను వచ్చాక చెబుతా అంటాడు.
వారణాసిని వెతకడానికి వెళ్తున్నా అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇంతలో మోనిత అక్కడికి వస్తుంది. మీరెందుకు వచ్చారు మేడం ఇక్కడికి అంటుంది వాణి. దీంతో నేను నీకోసం రాలేదు.. కార్తీక్ కోసం వచ్చా అంటుంది.
ఇంతలో వాణికి దుర్గ ఫోన్ చేసి డిన్నర్ కు వెళ్దాం అన్నావు కదా.. అంటాడు. దీంతో సరే వస్తున్నా కానీ.. దీప, మోనితలకు ఈ విషయం చెప్పకు అంటుంది. తర్వాత దీప, కార్తీక్ ఇద్దరూ బయటికి రాగానే మోనిత మీద కోపం ప్రదర్శిస్తుంది.
ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. వాణి మాట్లాడటం చూసి నాకు ధైర్యం వచ్చింది. వాణి ఉన్నంత వరకు నీకు ఏం కాదు దీప అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది.
శౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. మరోవైపు ఇడ్లీ చేసి తీసుకొచ్చి ఇస్తుంది దీప. తిను అని దుర్గ, వాణికి ఇస్తుంది. కానీ.. వాణి నాకు వద్దు అంటుంది. దీంతో టిఫిన్ చేయవా.. దీపమ్మ ఎంత బాగా టిఫిన్ చేస్తుందో తెలుసా అంటాడు.
ఈ ఇడ్లీ తినగానే ఇద్దరూ పైకి పోతారు కలాస్ అని అనుకుంటుంది వాణి. అంతలోనే కార్తీక్ కూడా వస్తాడు. వంటలక్క టిఫిన్ పెట్టు అంటాడు. దీంతో రెడీగా ఉంది డాక్టర్ బాబు తినండి అంటుంది దీప.
ఇప్పుడు ఈయన తింటే పోతాడు. ఏం చేయాలి అని అనుకుంటుంది. దుర్గ తింటుండగా దాన్ని విసిరికొడుతుంది. కార్తీక్ సార్ వచ్చాడు కదా. ఆయన తినకముందే నువ్వు తింటావా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
This website uses cookies.