Home » Entertainment » Janaki Kalaganaledu 26 November 2021 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 26 Nov Today Episode : జానకిని బ్యాడ్ చేయడానికి మల్లిక మరో స్కెచ్.. తన ఐపీఎస్ కలను వదులుకుంటే జానకి ప్రాణం పోయినట్టే అన్న శ్రావణి

Authored By
Varun G
The Telugu News | Published on: November 26, 2021, 2:40 pm
Advertisement

Janaki Kalaganaledu 26 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 26 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 180 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాణం తీసుకోవాలనుకున్న యువతిని అడ్డుకుంటాడు రామా. నిలబడితే గెలుస్తావు.. అలిసిపోతే ఎలా గెలుస్తావు. నేను మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడుతాను. పదా అని తనను తీసుకెళ్తాడు రామా. ఇంటికి వెళ్తుండగా.. జానకి నడుచుకుంటూ వెళ్తుంటుంది. జానకిని రోడ్డు మీద చూస్తాడు రామా. జానకి మాత్రం ఏదో పరధ్యానంలో నడుచుకుంటూ వెళ్తుంటుంది.జానకి గారు ఏంటి ఈ సమయంలో ఎటు వెళ్తుంది అనుకుంటాడు రామా. జానకి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తుంటుంది.

Advertisement

janaki kalaganaledu 26 november 2021 full episode

దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే గోవిందరాజు మల్లికను పిలుస్తాడు. ఖార్ఖానాలో పూతరేకులు చుట్టడానికి నెయ్యి అయిపోయిందట. వెళ్లి ఇచ్చిరాపో అంటాడు గోవిందరాజు. మీ మాట కాదని అంటున్నందుకు నన్ను క్షమించండి మామయ్య గారు. నాకు ఒకటే కడుపు నొప్పి మామయ్య గారు అంటుంది మల్లిక. దీంతో జానకి నేను వెళ్తాను మామయ్య గారు అంటుంది జానకి. సరే.. జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రా.. అంటాడు గోవిందరాజు.మరోవైపు ఖార్ఖానాలో అందరూ తమ పనులు చేస్తుంటారు. ఇంతలో జానకి నెయ్యి పట్టుకొని వస్తుంది. మామయ్య గారు నెయ్యి పంపించారు అంటుంది జానకి. ఇంతలో మల్లికకు పాడు బుద్ధి పుడుతుంది. విషం ఉన్న బాటిల్ పట్టుకొస్తుంది. కానీ.. పనోళ్లు ఉండటంతో ఆగిపోతుంది.

Advertisement

లోడ్ వచ్చింది దింపాలి.. త్వరగా రండి అని పిలుస్తారు దీంతో పనోళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మల్లిక వెంటనే లోపలికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న వాంతులు అయ్యే విషాన్ని నెయ్యిలో కలుపుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ పూతరేకులు తిన్నవాళ్లంతా ఆసుపత్రికి వెళ్తారు. వాంతులు, విరోచనాలు అవుతాయి.. దీంతో జ్ఞానాంబ షాపునకు షాక్ అనుకుంటుంది.

Janaki Kalaganaledu 26 Nov Today Episode : మీరేం టెన్షన్ పెట్టుకోకండి.. అని రామాకు సర్దిచెప్పిన జానకి

కట్ చేస్తే జానకి.. చదువును మరిచిపోయా అని రామాకు చెబుతుంది. అత్తయ్య గారి మాటకు విలువ ఇవ్వడం మొదలు పెట్టాను అంటుంది. నాకు బాధ ఎందుకు అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం తనను చూసి చాలా బాధపడతాడు.మీరు కూడా మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకండి. అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. భోం చేద్దాం రండి అంటుంది జానకి. కానీ.. రామాకు మాత్రం టెన్షన్ ఎక్కువవుతుంది. కట్ చేస్తే స్వీట్ షాపునకు శ్రావణి వస్తుంది. తను జానకి ఫ్రెండ్. శ్రావణి మళ్లీ ఏమైంది అంటాడు రామా. మీ అమ్మ  గారికి క్షమాపణ చెప్పమని చెప్పండి అంటుంది.

Advertisement

జరిగిన పరిస్థితులకు భయపడి జానకి అలా నిర్ణయం తీసుకొని ఉంటుంది. జానకి తన ఐపీఎస్ కలను వదిలేయడమంటే.. తను ప్రాణాన్ని వదిలేయడమే. ఆరోజు తన అన్నయ్య కోసం తన చదువును త్యాగం చేసింది. ఈరోజు కుటుంబం కోసం..  మీ కోసం ఐపీఎస్ ఇష్టాన్ని వదిలేసి ఉంటుంది అంటుంది శ్రావణి.

కట్ చేస్తే.. జానకికి జ్ఞానాంబ జడ వేస్తుంది. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇంతలో అనసూయ వచ్చి జానకిని అలా ఎలా క్షమించావు జ్ఞానాంబ అంటుంది. దీంతో.. కొంచెం చదువుకున్నా.. కాస్త అందంగా ఉన్నా.. నేటి తరం అమ్మాయిలకు చాలా పొగరు ఉంటుంది. కానీ.. నా జానకి అలా కాదు. అణుకువకు పెట్టింది పేరు అంటూ చెప్పేసరికి.. అనసూయ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి