
janaki kalaganaledu 26 october 2022 full episode
Janaki Kalaganaledu 26 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 418 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే జ్ఞానాంబ అందరినీ తన దగ్గరికి పిలుస్తుంది. దీంతో మల్లిక తెగ సంతోషిస్తుంది. విడిపోవడం కోసం అందరికీ తన నిర్ణయం చెప్పడం కోసమే జ్ఞానాంబ పిలిచింది అని అంతా అనుకుంటారు. గోవిందరాజు కూడా అదే జ్ఞానాంబతో చెబుతాడు. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు. జానకి మాత్రం అందరం కలిసి ఉందామని చెబితే బాగుండు అని అనుకుంటాడు. ఉమ్మడి కుటుంబంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంతమందిని ఆవేశానికి, కొంతమందిని ఆనందానికి గురి చేస్తాయి. నిర్ణయం ఏదైనా అందరూ పాటించక తప్పదు. విష్ణు, అఖిల్ మారుతారు. పరిస్థితులను అర్థం చేసుకుంటారు. అనుబంధాల విలువ తెలుసుకుంటారు అని మీరు చెప్పినా నాకైతే నమ్మకం లేదు. వీళ్ల బుద్ధి కుక్క తోక లాంటిది. ఎంత సక్రమంగా చేయాలని చూసినా అది వంకరగానే ఉంటుంది అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 26 october 2022 full episode
కుటుంబంలో తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాళ్ల మీదనే కాదు.. పుట్టబోయే బిడ్డల మీద రాబోయే తరాల మీద పడుతుంది కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయం తీసుకోవాలి అంటుంది. మన ఆవేశం వాళ్లకు శాపం కాకూడదు అంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు వీళ్లను దూరం పెడితే పుట్టబోయే బిడ్డల బంగారు భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉంది. వీళ్లు చేసే తప్పులకు అభంశుభం తెలియని పసికందులకు శిక్ష వేయకూడదు. అంతే కాదు. ఈ ఇంటిని, ఈ ఇంటి పరువును భుజాల మీద మోస్తున్న రామా, జానకి మాటను కాదనలేక.. జానకి మాటలను బలంగా నమ్మి మొన్న చెప్పిన నా నిర్ణయాన్ని మార్చి కుటుంబం కలిసి ఉండటానికి ఒప్పుకుంటున్నాను అని జ్ఞానాంబ చెప్పేసరికి రామా, జానకి చాలా సంతోషిస్తారు.
గోవిందరాజు, జెస్సీ కూడా సంతోషిస్తారు. మల్లికకు మాత్రం కోపం వస్తుంది. ఈవిడ ఒకత్తి ఒక నిర్ణయం మీద మాత్రం ఉండదు అని అనుకుంటుంది. కానీ.. ఒక్క షరతు అంటుంది జ్ఞానాంబ. జానకి అడిగిన గడువులోకా వాళ్లలో మార్పు రాకపోతే ఆ తర్వాత దేవుడు చెప్పినా కానీ కుటుంబం వాటాలుగా విడిపోక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
అఖిల్, విష్ణు బావ గారు మారితే బాగుండు అని అనుకుంటుంది జెస్సీ. జానకి, రామా సంతోషానికి అయితే హద్దులు ఉండవు. సిటీకి వెళ్లి హాయిగా బతకొచ్చు అని అనుకుంటే పోలేరమ్మ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది.
అయినా మూడు నెలల గడవు ఇచ్చింది కదా.. ఆ మూడు నెలల్లో ఏం చేయాలో అది చేస్తా అని అనుకుంటుంది మల్లిక. బయటికి వెళ్లి ఏడుస్తుంది మల్లిక. ఎవరో తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అయి మరొకరికి వరం ఇచ్చినట్టు ఆ పోలేరమ్మ నా ఆశలను అన్నింటినీ నాశనం చేసింది అని అనుకుంటుంది మల్లిక.
ఇంతలో అక్కడికి చికిత వస్తుంది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటుంది చికిత. ఏంటే నన్ను చూసుకుంటూ ఆ పాట పాడుతున్నావు అంటుంది మల్లిక. నాకు ఇప్పుడే ఆ పాట వినపడింది. అందుకే ఆ పాట పాడాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత వెన్నెల కూడా వచ్చి నీ గూడు చెదిరింది.. ఓ పావురమా.. ఎవరు కొట్టారు అంటూ పాట పాడుకుంటూ వెళ్తుంది. ఇంతలో గోవిందరాజు వచ్చి.. గాలి వానలో.. వాన నీటిలో పడవ ప్రయాణం.. అంటూ అక్కడి నుంచి పాట పాడుకుంటూ వెళ్తాడు గోవిందరాజు.
దీంతో మామయ్య గారు అంటూ గట్టిగా అరుస్తుంది మల్లిక. ఏంటమ్మా నీ ఆర్తనాదం. విడగొట్టడానికి అగ్గిపుల్ల గీసి అది తగలబడకపోయే సరికి నువ్వు మండిపోతున్నావా.. చెడు చేయడానికి నువ్వు ఒక్కదానికి నిలబడితే చాలు.. మంచి చేయడానికి ఇంట్లో వాళ్లు అంతా కంచుకోటలా నిలబడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గోవిందరాజు.
కట్ చేస్తే జానకిని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతాడు రామా. తనకు ముద్దుల మీద ముద్దులు పెడతాడు. తనకు లిప్ కిస్ పెట్టబోయి ఆగుతాడు. తన కళ్లలోకి అలాగే చూస్తాడు రామా. ఆ తర్వాత తనకు సిగ్గు వేస్తుంది.
రామా గారు.. అత్తయ్య గారు కలిసి ఉండేందుకు ఒప్పుకోవడంతో చాలా ఆనందంగా ఉంది అంటుంది జానకి. అమ్మ కలిసే ఉంటున్నాం అని చెప్పగానే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటాడు రామా.
ఇంతలో జెస్సీ కళ్లు తిరిగి కిందపడిపోయిందని జానకికి వచ్చి చికిత చెబుతుంది. దీంతో అక్కడికి వెళ్తారు. ఏమైందో అని చూస్తారు. జెస్సీ అని జానకి లేపుతుంది కానీ.. జెస్సీ లేవదు. దీంతో వెంటనే డాక్టర్ కు ఫోన్ చేస్తుంది జానకి.
కంగారు పడకండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అంటుంది. చికిత వెళ్లి నీళ్లు తీసుకురా అంటుంది జానకి. నీళ్లు తన ముఖం మీద చల్లగానే జెస్సీ లేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే పర్వాలేదు అంటుంది జెస్సీ.
ఒకవేళ జెస్సీ కోసం డాక్టర్ వస్తే నా దొంగ ప్రెగ్నెన్సీ బయటపడుతుందేమో. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది మల్లిక. డాక్టర్ వచ్చే లోపు మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవాలి అని అనుకుంటుంది.
ఇంతలో జెస్సీకి గ్లూకోజ్ నీళ్లు కలుపుకొని రా అని మల్లికకు జ్ఞానాంబ చెబుతుంది. దీంతో అలాగే అత్తయ్య గారు అంటుంది మల్లిక. ఆ తర్వాత డాక్టర్ వచ్చి జెస్సీని చెకప్ చేస్తుంది. ఆ తర్వాత మల్లికను కూడా ఒకసారి చెక్ చేయండి అంటుంది జానకి.
కానీ.. మల్లిక తప్పించుకొని వెళ్తుంది. జానకి ఎంత పిలిచినా రాదు. దీంతో జానకికి, మల్లిక మీద డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.