Janaki Kalaganaledu 26 Sep Today Episode : నాన్ వెజ్ ను చాటుగా తిన్న మల్లిక.. ఉండ్రాళ్ల తద్ది వేడుకలో అపశృతి.. దీంతో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం
Janaki Kalaganaledu 26 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 396 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీ పెళ్లి అయితే నాన్ వెజ్ తో విందు ఇద్దామనుకున్నాం కానీ.. కుదరలేదు కదా. అందుకే మేమే స్వయంగా అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ వండుకొని తీసుకొచ్చాం అని చెబుతాడు పీటర్. తన కూతురుకు కూడా నాన్ వెజ్ ఇష్టం అని చెబుతాడు పీటర్. సరే అండి.. మేము వెళ్లి వస్తాం అని చెప్పి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక జానకి.. వాళ్లకు తెలియదు కాబట్టి మన ఇంట్లో అనుమతి లేని తిండి పదార్థాలను తీసుకొచ్చారు. ఇంకోసారి తీసుకురావద్దని చెప్పు.. వాటిని తీసుకెళ్లి బయట పడేయండి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో ఈ ఒక్కసారి తినడానికి అనుమతి ఇవ్వండి అత్తయ్య గారు అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ కోపంతో చూస్తుంది. దీంతో వాటిని నేనే బయట పడేస్తా అత్తయ్య గారు అంటుంది మల్లిక.
ఆ తర్వాత జ్ఞానాంబ ఇంట్లోకి వెళ్లిపోతుంది. బయటికొచ్చిన తర్వాత వాటిని పడేయకుండా ఒకచోట కూర్చొని వాటిని ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేస్తుంది మల్లిక. చాలా బాగుంది అంటూ తినేస్తుండగా విష్ణు వచ్చి చూసి షాక్ అవుతాడు. అమ్మో.. మల్లిక ఏం చేస్తున్నావు.. అని అడుగుతాడు. దీంతో కావాలంటే ఒక్కో దాంట్లో నుంచి ఒక్కో ముక్క తినండి కానీ.. అత్తయ్య గారికి మాత్రం ఈ విషయం చెప్పకండి అంటుంది మల్లిక. బయట పడేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇదంతా తింటున్నావా అంటాడు విష్ణు. దీంతో కడుపుతో ఉన్నవాళ్లకు ఏదేదో తినాలనిపిస్తుంది అంటుంది మల్లిక.
కడుపుతో ఉంటే చాలా కోరికలు ఉంటాయి. మతిలేని పెళ్లానికి గతిలేని మొగుడు అని మీరెక్కడ దొరికారండి నాకు.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీరే దగ్గరుండి తినిపించాల్సింది పోయి.. ఇలా మాట్లాడుతారా అంటుంది మల్లిక.
దీంతో నీకేం కావాలో చెప్పు చేస్తాను అంటాడు విష్ణు. నేను చెప్పింది చేస్తారు కదా మరి అంటే చేస్తా అంటాడు విష్ణు. తనే మల్లికకు కలిపి మరీ తినిపిస్తాడు విష్ణు. కొంచెం తిన్నాక మిగితాది గదిలో పెట్టండి అంటుంది మల్లిక.
Janaki Kalaganaledu 26 Sep Today Episode : జెస్సీ, అఖిల్ ను జ్ఞానాంబతో కలిపేందుకు జానకి, రామా ప్లాన్
కట్ చేస్తే జానకి.. జ్ఞానాంబ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. జెస్సీ, అఖిల్ మీద కోపం పోయేలా చేయాలని రామాతో చెబుతుంది. ఎలా చేయాలి.. వాళ్లిద్దరూ కనిపిస్తేనే అమ్మకు కోపం వస్తోంది. ఏం చేద్దాం అంటాడు రామా.
దీంతో వాళ్లది కోపం కాదు.. బాధ అంటుంది జానకి. మన ప్రయత్నం మన చేద్దాం. రేపు ఉండ్రాళ్ల తద్ది కాబట్టి రేపు అత్తయ్య గారికి జెస్సీ మీద కోపం పోయేలా చేయాలి అంటుంది జానకి. అత్తయ్య గారి కోపానికి ఓర్పుతో ఉంటే తప్ప ఆవిడ మనసుకు దగ్గర కాలేరు.
వాళ్ల పెళ్లి చేయడమే కాదు.. వాళ్ళిద్దరినీ అత్తయ్య గారికి దగ్గర చేసేందుకు మనం శ్రీకారం చుట్టాలి అంటుంది జానకి. మరోవైపు గౌరీ వ్రతం చేద్దామని జ్ఞానాంబకు చెబుతుంది జానకి. కానీ.. వద్దు అంటుంది జ్ఞానాంబ.
దీంతో ఎందుకు అత్తయ్య గారు అని అడుగుతుంది. పండుగ అంటే సంతోషంతో గడవాలి కానీ.. అమ్మలక్కల అవమానంతో కాదు. వచ్చినవాళ్లు ఊరికే ఉండరు. అఖిల్ పెళ్లి గురించి నోరు పారేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు అంటుంది జ్ఞానాంబ.
వాళ్ల గురించి మనమెందుకు పండుగ చేసుకోకుండా ఉండాలి. ఈరోజు కాకపోతే రేపు అయినా అఖిల్ పెళ్లి గురించి తెలుసుకుంటారు.. అంటాడు రామా. మల్లిక మధ్యలో కల్పించుకొని వద్దు అత్తయ్య గారు మీరు మాట పడితే నేను తట్టుకోలేను అంటుంది మల్లిక.
ఉండ్రాళ్ల తద్ది చేద్దాం అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. కట్ చేస్తే గోరింటాకు రుబ్బుతూ ఉంటుంది జానకి. ఇంతలో జెస్సీ వచ్చి ఎందుకు ఇప్పుడు రుబ్బుతున్నావు అని అడుగుతుంది.
దీంతో రేపు ఉండ్రాళ్ల తద్ది ఉంది. అందుకే రుబ్బుతున్నాను అంటుంది జానకి. ఉండ్రాళ్ల తద్ది అంటే ఏంటి.. దాన్ని ఎందుకు చేస్తారు అని అడుగుతుంది జెస్సీ. పెళ్లయిన ఆడవాళ్ల సౌభాగ్యం కోసం, పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త కోసం చేసుకుంటారు అని చెబుతుంది జానకి.
ఐదుగురు ముత్తయిదువులను పిలిచి వాళ్లకు వాయినం ఇవ్వాలి. వాళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం అంటుంది జానకి. అయితే ఈ వ్రతం నేను కూడా చేస్తా. దానికి అత్తయ్య గారు ఒప్పుకుంటారా అంటుంది జెస్సీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.