janaki kalaganaledu 27 december 2021 full episode
Janaki Kalaganaledu 27 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 201 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా తమ్ముళ్లు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకులు కావాలని ఎన్నో ఆశలు పడ్డాను అని చెబుతాడు రామా. నా తమ్ముళ్లు సాధించారు అని గర్వంతో పొంగిపోవాలనుకున్నాను. ఎన్ని లక్షలు పోసినా సరే.. విష్ణుకు చదువు అబ్బలేదు. చివరకు బట్టల కొట్టు పెట్టుకున్నాడు. నేను, విష్ణు బాగా చదువుకోకపోయినా.. చివరకు అఖిల్ అయినా బాగా చదువుకొని గొప్పగా బతుకుతాడు అనుకున్నాను కానీ.. వీడు కూడా చివరికి ఖార్ఖానాలో పనిచేయడం బాధేస్తుంది అని జానకితో చెబుతాడు రామా. దీంతో మీరు బాధపడకండి రామా గారు అంటుంది జానకి.
janaki kalaganaledu 27 december 2021 full episode
మరోవైపు చీకటి అవుతుంది. రామా, జానకి ఇంటికి వస్తారు. జ్ఞానాంబకు ఈరోజు కలెక్షన్ డబ్బులు ఇస్తాడు రామా. ఇంతలో అఖిల్ వస్తాడు. వీడు చెప్పిన పనిని కొట్టులో తిన్నగా చేస్తున్నాడా.. లేక చదువును తగలబెట్టినట్టే పనిని కూడా అలాగే మొక్కుబడిగా చేస్తున్నాడా అని అడుగుతుంది. వాడికి ఇప్పుడే ఈ పనులన్నీ ఎలా వస్తాయి అమ్మ. కాస్త ఇబ్బంది పడుతున్నాడు అని చెబుతాడు రామా. పుట్టిన వెంటనే ఎవ్వరూ నేర్చుకోరు. 4 రోజులు పోతే అదే అలవాటు అవుతుందిలే అంటుంది జ్ఞానాంబ. వీడు పరీక్షల్లో తప్పాడని నాకు ఎంత బాధ అవుతుందో మీకు తెలియదు. వాడి బంగారం లాంటి భవిష్యత్తును వాడే నాశనం చేసుకున్నాడు అంటూ బాధపడుతుంది జ్ఞానాంబ.
ఇంతలో అత్తయ్య గారు అంటూ జానకి వచ్చి.. మీరు కొప్పడనంటే ఒక విషయం మాట్లాడుతాను అంటుంది జానకి. అఖిల్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో.. అఖిల్ కూడా అంతే బాధపడుతున్నాడు. తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని బతిమిలాడుతున్నాడు. అఖిల్ ను మీరు ఎన్నో సార్లు క్షమించి ఉంటారు. ఈ ఒక్కసారి కూడా దయచేసి క్షమించండి అంటుంది అఖిల్.
అఖిల్ కు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి. అఖిల్ ను ట్యూషన్ కు పంపిస్తే ఈ సారి తప్పకుండా పాస్ అవుతాడు. అప్పుడు ఈ బాధ నుంచి అందరం దూరం అవుతాం అంటుంది జానకి. దీంతో మరోసారి మోసం పోవడమే అవుతుంది అంటుంది జ్ఞానాంబ.
వాడి మాటలను ఇదివరకు గుడ్డిగా నమ్మాను. మళ్లీ మమ్మల్ని పిచ్చోడిని చేయడని నమ్మకం ఏంటి. మరోసారి మోసపోయి ఆ బాధను భరించే శక్తి ఈ అమ్మకు లేదు అంటుంది జ్ఞానాంబ. నాది హామీ అత్తయ్య గారు అంటుంది. ఈసారి అఖిల్ ఖచ్చితంగా పాస్ అవుతాడు అంటుంది.
అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు అంటే ఇప్పటి నుంచి అఖిల్ కు నేను ట్యూషన్ చెబుతాను. తను పాస్ అయ్యేలా చేస్తాను. దయచేసి మూడు నెలలు సమయం ఇవ్వండి అత్తయ్య గారు అంటుంది. ఒకవేళ వాడు మళ్లీ పరీక్షల్లో తప్పితే.. అంటే నాది హామీ అత్తయ్య గారు. ఆ విషయం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను భరిస్తాను అంటుంది జానకి.
అఖిల్ కూడా అదే చెబుతాడు. ఒక్క అవకాశం ఇవ్వు అమ్మ.. ప్లీజ్ అమ్మ అని బతిమిలాడుతాడు అఖిల్. వీడి మీద నమ్మకంతో కాదు.. నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. వీడి కోసం శిక్ష అనుభవించడానికి నువ్వు సిద్ధం అనడంతో కరిగిపోయి ఒప్పుకుంటున్నాను.. అంటుంది జ్ఞానాంబ.
దీంతో జానకి, రామా, అఖిల్ సంతోషిస్తారు. వాడి తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం రాకూడదు. ఒకవేళ అలా జరిగితే నేను ఏం చేస్తానో అది కూడా మీరు చూస్తారు అని చెప్పి అక్కడి నుంచి జ్ఞానాంబ వెళ్లిపోతుంది. తర్వాత జానకికి.. అఖిల్ థ్యాంక్స్ చెబుతాడు.
జ్ఞానాంబ టెన్షన్ గా కూర్చుంటే.. అఖిల్ భవిష్యత్తు గురించి నువ్వేం టెన్షన్ పడకు అంటాడు గోవింద రాజు. అవును.. మనం రేపు రామచంద్రాపురం వెళ్తున్న విషయం మనవాళ్లకు చెప్పావా అని అడుగుతాడు గోవిందరాజు. లేదండి అంటుంది. సరే.. ఇప్పుడు చెబుదాం అని అందరినీ పిలుస్తాడు.
పిల్లలందరూ వచ్చారు. ఇక నువ్వు మొదలెట్టు అంటాడు జ్ఞానాంబను. ఏం లేదురా. మన వెన్నెల కోసం మీనాన్న రామచంద్రాపురంలో ఒక పెళ్లి సంబంధం చూశారు అంటుంది జ్ఞానాంబ. వాళ్లు మన వెన్నెలను ఏదో ఫంక్షన్ లో చూశారట. వాళ్లంతట వాళ్లే తెలిసిన వాళ్లతో కబురు పంపించారు అంటుంది జ్ఞానాంబ.
అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని.. 2 లక్షల జీతం అని చెబుతాడు గోవిందరాజు. అబ్బాయి మంచి వాడని తెలిసింది. మన వెన్నెలను బాగా చూసుకుంటాడని అనిపిస్తుంది అంటుంది జ్ఞానాంబ. అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది జ్ఞానాంబ.
మల్లిక మాత్రం నాకు నచ్చలేదండి అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మీ ఆలోచన నాకు అయితే నచ్చలేదంటే నచ్చలేదు అంటుంది. ఎందుకు అని అడిగితే.. వెన్నెల ఎవరినో ప్రేమించిందని చెబుతుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? నా కూతురు నాకు చెప్పకుండా నిద్ర కూడా పోదు. అటువంటిది ప్రేమించింది అని మాట్లాడుతావా అంటూ మల్లికపై సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి దగ్గరికి వెళ్లి తన ప్రేమ విషయం గురించి చెబుతుంది వెన్నెల. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.