Janaki Kalaganaledu 29 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 333 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అత్తయ్య మనసులో ఎంత బాధ ఉందో తెలిశాక కూడా నువ్వు ఇంకా మాట ఇవ్వడం లేదు అని జానకితో అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా వైపు చూసి.. కాసేపు ఆలోచించు మీకు మనవడిని ఇస్తాను అత్తయ్య గారు అని మాటిస్తుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. జ్ఞానాంబ సంతోషిస్తుంది. రామాకు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. తన ఐపీఎస్ కల ఏం కావాలి అని ఆలోచిస్తాడు. మీ మనసులో ఉన్న బాధను నేను దూరం చేస్తాను. భవిష్యత్తులో మీకు ఇలాంటి అవమానాలు ఎదురు అవకుండా చూస్తాను అని మాటిస్తుంది జానకి. మల్లిక కూడా షాక్ అవుతుంది. నాకు తెలుసు అమ్మ. నాకు తెలుసు. ఈ అత్తయ్య బాధను నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో అక్కడికి రామా, గోవిందరాజు అందరూ వస్తారు. బారసాలలో జరిగిన అవమానానికి మీ అత్తయ్య కోలుకుంటారో లేదో అనుకున్నా. కానీ.. మీ అత్తయ్య బాధను నువ్వు దూరం చేశావు.. అంటాడు గోవిందరాజు. వామ్మో.. పెద్ద కోడలును అక్కున చేర్చుకున్నారు. నేను కూడా మాటిస్తే పోలా అనుకొని.. అత్తయ్య గారు. నేను ముందు జానకి కన్నా మాట ఇద్దామనుకున్నా కానీ.. మీ బాధ చూసి నాకు మాట కరువయింది. అందుకే మీకు మాటివ్వలేకపోయాను. నెల తిరిగే కల్లా మీకు శుభవార్తను అందిస్తాను అంటుంది. ముందుగా మీలో ఎవరికి పిల్లాడు పుడితే వారి పేరు మీద 5 సెంట్ల స్థలాన్ని రాయాలనుకున్నాను అంటుంది జ్ఞానాంబ. దీంతో అప్పుడే లెక్కలు వేయడం ప్రారంభిస్తుంది మల్లిక.
మరోవైపు జానకిని.. తన రూమ్ లోకి తీసుకెళ్తాడు రామా. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా? అంత ఉన్నపళంగా అమ్మకు ఎలా మాటిచ్చారు అని అడుగుతాడు రామా. దీంతో ఆవిడ కళ్లలో నాకు బాధ కనిపించింది. ఈ ఇంటి కోడలుగా ఆవిడ బాధ నాకు బాధ్యతను గుర్తు చేసింది అంటుంది జానకి.
అమ్మ మాటల్లో అర్థం ఉంది.. న్యాయం ఉంది. తన బాధ నాకు కూడా అర్థం అవుతోంది. కానీ.. మీ చదువు పూర్తయ్యా అమ్మ మాటను నెరవేర్చాలని అనుకున్నాం కదా అంటాడు రామా. దీంతో అప్పటి వరకు తను ఇలా సూటి పోటి మాటలు పడాల్సిందేనా అంటుంది జానకి.
ఇక నుంచి మీ అమ్మ గారు ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా వెళ్లరు. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో బారసాల ఫంక్షన్ కు ఎప్పుడు పిలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక కాదు.. సమాధానం లేక అంటుంది జానకి. కానీ.. కావాలని ఏమీ మనం అమ్మను బాధపెట్టడం లేదు కదా అంటాడు రామా.
ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారు. ఆ మాట అక్షరాలా నిజం. ముందు కోడలుగా నేను ఈ ఇంట్లో గెలవాలి. అలా గెలవాలంటే అత్తయ్య గారి కన్నీళ్లు తుడవాలి. అంటే ఈ ఇంటికి నేను వారసుడిని ఇవ్వాలి. నేను బలంగా నిర్ణయించుకున్నాను. వారసుడిని ఇస్తున్నాను అంటుంది జానకి.
ఐపీఎస్ కలను వదిలేస్తారా అంటే.. లేదు.. ఓవైపు ఐపీఎస్ కలను.. మరోవైపు ఇంటి బాధ్యతలను కూడా మోస్తాను అంటుంది. రెండు బాధ్యతలు రెండు కళ్లు అయినప్పుడు ఎంత పెద్ద కష్టం అయినా భరించక తప్పదు అంటుంది జానకి. దయచేసి నా బాధను కూడా అర్థం చేసుకోండి. కోడలుగా నా బాధ్యతను నిర్వర్తించనివ్వండి అని అంటుంది జానకి.
మరోవైపు తన రూమ్ లో పండ్లు తింటూ ఉంటుంది మల్లిక. పాటలు పాడుతూ ఉంటుంది. మీ అమ్మకు పిల్లాడిని కని ఇస్తానని మాటిచ్చా అంటుంది మల్లిక. దీంతో నాకో డౌట్ అంటాడు విష్ణు. పట్నం వెళ్లి వేరే కాపురం పెట్టేదాకా పిల్లల్ని కనే ఆలోచన లేదని అన్నావు కదా అంటాడు విష్ణు.
ఒకే ఏడాదిలో 20 లక్షలు వస్తున్నప్పుడు నేనెందుకు వదిలేసి వెళ్తాను అంటుంది మల్లిక. ముందుగా ఎవరు పిల్లల్ని కంటారో వాళ్లకే రామాలయం దగ్గర ఉన్న స్థలాన్ని రాస్తా అని అత్తయ్య చెప్పింది కదా.. అని విడమరిచి తన భర్తకు చెబుతుంది మల్లిక.
మరోవైపు రేపటి లోగా అకాడెమీలో అసైన్ మెంట్ పూర్తి చేయాలి అంటుంది జానకి. రామా గారు.. రేపటి వరకు టైమ్ ఉంది కదా.. నైట్ అంతా మేల్కొని అసైన్ మెంట్ పూర్తి చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి అంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి వాళ్ల రూమ్ ముందు నిలబడి ఉంటుంది.
ఏ విషయం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది జ్ఞానాంబ. కంగారు పడకు అని జానకి చెబుతోంది. అసలు నువ్వు ఏ విషయంలో కంగారు పడుతున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అంటే అమ్మ అది అంటూ ఏదో చెప్పబోతాడు రామా.
అదేనమ్మా.. జానకి గారికి కరెంట్ షాక్ తగిలింది కదా.. ఆ విషయం గురించే అంటాడు రామా. దీంతో ఆ భయం నాలో నుంచి కూడా పోలేదు అంటుంది జ్ఞానాంబ. ఆ సంఘటన ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జ్ఞానాంబ గారు అని ఎవరో వచ్చి పిలుస్తారు.
సత్తిబాబు.. లడ్డులు ఆర్డర్ ఇచ్చాను కదా.. తీసుకెళ్దాం అని వచ్చాను అంటాడు. లడ్డులు చేయమని చెప్పారా ఎప్పుడు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మీ చిన్నకోడలుకు ఆర్డర్ ఇచ్చాం కదండి. మీరు అప్పుడు హైదరాబాద్ వెళ్లాం అని చెప్పారు అంటాడు సత్తిబాబు.
దీంతో మల్లిక అని పిలుస్తుంది జ్ఞానాంబ. మల్లిక అక్కడికి వచ్చి.. సత్తిబాబును చూసి షాక్ అవుతుంది. ఈయన లడ్డులు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అవును అత్తయ్య గారు అంటుంది మల్లిక. మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది.
దీంతో మరిచిపోయాను అంటుంది మల్లిక. బుద్ధి ఉందా నీకు అంటూ తిడుతుంది జ్ఞానాంబ. ఇప్పుడు అతడికి ఏమని సమాధానం చెప్పాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు ఒక్క నిమిషం అంటుంది. మీకు స్వీట్లు ఎప్పటికి అవసరం అని అడుగుతుంది జానకి.
దీంతో రేపు ఉదయానికి అంటాడు. దీంతో రేపు ఉదయం కల్లా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం వెళ్లండి అంటుంది జానకి. మనం అందరం తలా ఒక చేయి వేస్తే ఖచ్చితంగా చేయగలం అంటుంది జానకి. దీంతో అవును జ్ఞానం.. అప్పట్లో జానకి ఇలాగే పూర్తి చేసి ఇచ్చింది కదా అంటాడు గోవిందరాజు.
జానకి తలుచుకుంటే చేసేస్తుంది అంటాడు. దీంతో రామా ఆ ఏర్పాట్లు చూడు అంటుంది జ్ఞానాంబ. అయ్యయ్యో పెద్ద కొడులుకు మళ్లీ పేరు వచ్చేసిందే. చీ నా బతుకు కర్మ అనుకుంటుంది మల్లిక. మళ్లీ జానకిని రూమ్ లోకి తీసుకెళ్లి అసలు మీరు ఏం చేస్తున్నారు అంటాడు రామా.
అది రాసి ఇవ్వడానికే సమయం సరిపోదు అనుకుంటుంటే.. రేపటి కల్లా స్వీట్లు ఎలా అందిస్తారు అంటాడు. అసైన్ మెంట్, స్వీట్ల ఆర్డర్ రెండూ పూర్తి అవుతాయి అని రామాకు భరోసా ఇస్తుంది జానకి. ఇక ఈ విషయం గురించి వదిలేయండి అని అంటుంది జానకి.
అది వదిలేయండి.. నేను అత్తయ్య గారికి మాటిచ్చాను కదా.. ఆ విషయం గురించి మాట్లాడాలి అంటుంది జానకి. ఏ విషయం గురించి అంటాడు రామా. ఫస్ట్ ఆ విషయం మొదలు పెడదామా అంటుంది జానకి. దీంతో ఏ విషయం అంటాడు. అదే పిల్లలను కనే విషయం అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.