janaki kalaganaledu 29 september 2022 full episode
Janaki Kalaganaledu 29 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 399 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనుషులు కలిసి ఉండి.. మనసులు దూరంగా ఉండి ఉంటే ఏం లాభం. ఓవైపు అఖిల్ పరిస్థితి అలా ఉంది. వ్రతం వద్ద జెస్సీ చేయకూడని పనులు చేసి ముత్తయిదువులు నాలుగు మాటలు అనేలా చేసింది అని జ్ఞానాంబ.. గోవిందరాజుతో అంటుంది. ఇవన్నీ చాటుగా మల్లిక వింటుంది. జానకి కూడా వింటూ ఉంటుంది. అఖిల్ ఏదో సాధించి మంచి పేరు తెస్తాడని అనుకున్నా కానీ.. నా ఆశలన్నీ వమ్ము చేశాడు అంటుంది జ్ఞానాంబ. జానకి కూడా తన చదువును పక్కన పెట్టి ఈ పనుల మీద దృష్టి పెట్టాల్సి వస్తోంది అని అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఆమె దగ్గరికి వచ్చి భోజనం అని అంటుంది. దీంతో తినబుద్ధి కావడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 29 september 2022 full episode
కట్ చేస్తే పాపం.. పోలేరమ్మ, మామయ్య గారు ఎంత బాధపడుతున్నారు అని మల్లిక నవ్వుతుంది. పూజ సంపూర్ణం కాకుండా అమ్మలక్కలు వెళ్లిపోతే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని అనుకుంటుంది మల్లిక. దీంతో సంతోషంలో స్టెప్పులు వేస్తూ ఉంటుంది. డ్యాన్స్ చేస్తుండగా ఇంతలో రూమ్ లోపలికి వచ్చిన విష్ణు తనను చూసి షాక్ అవుతాడు. మల్లిక అని అరిచినా కూడా తను వినదు. తను డ్యాన్స్ వేయడం చూసి షాక్ అవుతాడు విష్ణు. నువ్వు ప్రెగ్నెంటే అంటాడు విష్ణు. దీంతో వెంటనే ఆగిపోతుంది. నేను ఉన్న సంతోషంలో కడుపుతో ఉన్నానన్న విషయాన్నే మరిచిపోయానే. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని అనుకుంటుంది మల్లిక. ఏంటండి.. గుడ్లు అలా పెట్టి నన్నే చూస్తున్నారు అని అంటుంది మల్లిక. దీంతో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దీంతో ఆలోచించడం లేదండి.. నాకు ఏం తెలియని ఇలాంటి మొగుడు దొరికాడని బాధపడుతున్నాను అంటుంది మల్లిక.
కడుపుతో ఉన్నవాళ్లు వ్యాయామం, డ్యాన్సులు వేస్తే మంచిది. సుఖ ప్రసవం జరుగుతుంది అంటుంది మల్లిక. దీంతో అదేంటి మరి.. నువ్వు కదలకూడదు, ఏ పని చేయకూడదు అని చెప్పావు అని అడుగుతాడు విష్ణు. దీంతో ఏ పని చేయకూడదు అండి.. కానీ.. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయాలి. లేకపోతే కాళ్లు పట్టేస్తాయి అని అంటుంది మల్లిక.
తర్వాత విష్ణును ఎలాగోలా బోల్తా కొట్టిస్తుంది మల్లిక. చివరకు తనతోనే కాళ్లు పట్టించేలా చేస్తుంది మల్లిక. మరోవైపు జానకి.. ఇప్పటి వరకు జ్ఞానాంబ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వస్తాడు రామా. జెస్సీ గొడవలో పడి చదువును కొంచెం నిర్లక్ష్యం చేశాను అంటుంది జానకి.
దీంతో అది అయిపోయింది. ఇక దాని గురించి వదిలేయండి. అవేవో ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి కదా. అవ కాగానే వెంటనే మీకు ట్రెయినింగ్ ఉంటుందట. మీరు పరిగెత్తడం, వ్యాయామాలు కూడా చేయాలి అంటాడు. ఇక నుంచి మీ ధ్యాస అంతా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేంత వరకు వీటి మీదే ఉండాలి. ఇంటికి సంబంధించింది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అంటాడు రామా.
మీరు ట్రెయినింగ్ కోసం వెళ్తే మీరు నాకు దూరంగా ఉండాలి కదా. అప్పుడు మీరు నాకు రోజూ కొంచెం శక్తి ఇవ్వాలి అంటాడు రామా. దీంతో ఏం చేయాలి అని అడుగుతుంది జానకి. ఏదో ఒకటి చేయండి అని అంటాడు రామా. ఇంతలో తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది జానకి.
ఏంటండి ఇది అని అడుగుతాడు రామా. దీంతో కావాలన్నారు కదా. పెట్టాను. ఇంకొకటి కావాలా అని అడుగుతుంది జానకి. దీంతో అవును అంటాడు రామా. దీంతో మీరు రాముడు కాదు. కృష్ణుడు అని చెప్పి మరో ముద్దు పెడుతుంది జానకి. కట్ చేస్తే తెల్లవారుతుంది. ఇద్దరూ పార్క్ లో వాకింగ్ చేస్తుంటారు.
రామా, జానకి ఇద్దరూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అన్నీ చేస్తుంటారు. ఇంతలో తన కాళ్లు పట్టేస్తాయి. దీంతో జానకి గారు మీరు కాబోయే పోలీస్ ఆఫీసర్. ఇది సరిపోదు. ఇంకా ఉత్సాహంగా పరిగెత్తాలి అంటాడు రామా. దీంతో ఈరోజే మొదటి రోజు కదా. అందుకే కొంచెం టైమ్ పడుతుంది అంటుంది జానకి.
దీంతో మీరు అలా తిరిగి రండి. నేను ఇక్కడే ఉంటాను అంటాడు రామా. దీంతో సరే అని తను పరిగెడుతూ ఉంటుంది. జానకి గారిలో ఉత్తేజం నింపాలి. ఎలా.. ఏం చేయాలి అని అనుకుంటాడు రామా. ఇంతలో ఓ వ్యక్తిని చూస్తాడు. తనకు ఒక ఆలోచన వస్తుంది.
వెంటనే షర్ట్ విప్పి ముఖానికి ముసుగు వేసుకొని అక్కడ పేపర్ చదువుతున్న ఓ వ్యక్తి ఫోన్ ను కొట్టేసి పరిగెడుతుంటాడు రామా. ఇంతలో దొంగ దొంగ అంటూ ఆ వ్యక్తి రామా వెంట పడతాడు. దొంగ అనుకొని వెంటనే జానకి కూడా రామా వెంట పడి మరీ పట్టుకుంటుంది.
ముసుగు తీసి చూసి షాక్ అవుతుంది. మీరు భలేగా గొప్ప ప్లాన్ వేశారు. మీరు నిజంగానే దొంగ అనుకొని ఆ పెద్దాయన ఎంత టెన్షన్ పడుతున్నాడో అంటుంది జానకి. ఇంతలో వేగంగా పరిగెత్తడం వల్ల జానకి కాలు బెనుకుతుంది. దీంతో తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.