Janaki Kalaganaledu 30 March Today Episode : జానకిని సైడ్ చేయడం కోసం యోగిని వాడుకున్న మల్లిక.. ఇంతలో జానకికి మరో బిగ్ షాక్

Authored By Varun G | The Telugu News | Published on: March 30, 2022, 11:30 am

Janaki Kalaganaledu 30 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 268 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి వాళ్ల అన్నయ్యతో కుమ్మక్కయి కావాలని అందరినీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోందని మల్లిక మాట్లాడుతుంది. నాకు నిజంగా అసలు ఈ గిఫ్ట్స్ మా అన్నయ్య పంపించాడని నాకు తెలియదు అంటుంది జానకి. దీంతో నువ్వేంటో నాకు తెలుసు. చదువుకున్న తెలివితేటలు నేను కళ్లారా చూశాను అంటుంది జానకి. నువ్వు గట్టిగా దబాయించి మాట్లాడితే నువ్వు, నీ అన్నయ్య ఆడిన నాటకం ఒప్పు అవుతుందనుకుంటున్నావా అంటుంది జ్ఞానాంబ. నాకు అసలు ఈ విషయం నాకు తెలియదు అత్తయ్య గారు. దయచేసి నన్ను నమ్మండి అంటుంది జానకి.

janaki kalaganaledu 30 march 2022 full episode

janaki kalaganaledu 30 march 2022 full episode

కానీ.. జ్ఞానాంబ అస్సలు వినదు. వాళ్ల అన్నయ్య ప్రేమతో పంపించాడేమో అంటాడు గోవిందరాజు. దీంతో ఇంతకుముందు అయితే తను ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేదాన్ని. నా కోడలు బంగారం అనేదాన్ని. కానీ.. ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న నా కొడుకును నెలల్లోనే మార్చేసింది.. అంటుంది. దీంతో అమ్మ జానకి గారు మంచివారమ్మా. అలా ఏనాటికీ చేయరు అంటాడు రామా. నువ్వు కానీ.. నీ చెల్లెలు కానీ ఇన్నేళ్లలో ఏనాడైనా ఈ అమ్మ మాట దాటి ప్రవర్తించారా? తన మాటలు వినే కదా.. మీరిద్దరూ తన మాటలు నమ్మి నన్ను మోసం చేశారు అంటుంది జ్ఞానాంబ.

చివరకు నువ్వు కూడా ఇలా తయారయ్యావేంటని గుండెల్లో పొడిచనట్టు అవుతోంది. నేను ఎంత మంచిదాన్నో అంత మొండిదాన్ని. ఈ జ్ఞానాంబ మనసు మంచితనంతో కరుగుతుంది కానీ.. ఇలాంటి దిక్కుమాలిన పనులతో కాదు.. అని అంటుంది జ్ఞానాంబ.

మరోవైపు యోగి.. రామాకు ఫోన్ చేస్తాడు. గిఫ్ట్ లు పంపించాను.. అందాయా అంటాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక అందాయి అని చెబుతుంది. మరోవైపు మల్లిక మరో ప్లాన్ ను వేస్తుంది. వెంటనే యోగికి ఫోన్ చేస్తుంది. జానకి ఇక్కడ కష్టాలు పడుతోంది అని యోగికి చెబుతుంది.

Janaki Kalaganaledu 30 March Today Episode : జానకి కష్టాలకు చలించిపోయిన యోగి

జానకి గురించి అలా చెప్పేసరికి యోగి టెన్షన్ పడతాడు. ఇంతకుముందే నేను ఫోన్ లో జానకి వాళ్లతో మాట్లాడాను. తను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది అంటాడు. మీకు వీడియో పంపించాను.. ఆమె కష్టాలను మీరే చూడండి అని చెబుతుంది.

ఆ వీడియో చూసి యోగికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు గుడిసెలో కూర్చొని చదువుతూ ఉంటుంది జానకి. రామా వచ్చి మంచంలో పడుకోకుండా కింద పడుకోవడం చూసి.. ఆయన ఖార్ఖానాలో చాలా కష్టపడి వచ్చాడని తెలుసుకొని బాధపడుతుంది.

దీంతో మీరు మంచంలో పడుకోండి.. నేను నేల మీద పడుకుంటాను అని చెబుతుంది. రామా ఎంత చెప్పినా వినదు జానకి. పర్వాలేదండి అంటుంది జానకి. ఇద్దరూ వద్దు వద్దు అంటూ పక్కబట్టలను లాక్కుంటారు. మీరు పైన పడుకోండి.. అంటూ ఇద్దరూ అటూ ఇటూ గింజులాడుకుంటారు.

అలా పరుపులో ఉన్న దూదీని మొత్తం లాగేస్తారు. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp