Janaki Kalaganaledu 30 Sep Today Episode : మల్లికపై జానకి సీరియస్.. అఖిల్ ఎత్తుగడలు పసిగట్టి జ్ఞానాంబ వార్నింగ్.. ఇంతలో జెస్సీకి మరో షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 30 Sep Today Episode : మల్లికపై జానకి సీరియస్.. అఖిల్ ఎత్తుగడలు పసిగట్టి జ్ఞానాంబ వార్నింగ్.. ఇంతలో జెస్సీకి మరో షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :30 September 2022,9:30 am

Janaki Kalaganaledu 30 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 400 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి కావాలని తనకు కాలు నొప్పి ఉన్నట్టు చెబుతుంది. దీంతో రామా తనను మోస్తాడు. ఆ తర్వాత నవ్వుతుంది. దీంతో అసలు విషయం తెలిసి తనను కిందికి దింపుతాడు రామా. కట్ చేస్తే ఇంటికి వెళ్తారు. జానకి.. ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. దీంతో జ్ఞానాంబ వచ్చి చూడు జానకి నువ్వు నీ చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంటుంది జ్ఞానాంబ. ఇంటి పనులు చేయడానికి చాలామంది ఉన్నారు.. అంటుంది జ్ఞానాంబ. దీంతో జెస్సీ ఇప్పుడే వచ్చింది కదా అంటుంది జానకి. దీంతో ఏం తెలియదని అలా వదిలేస్తే ఎలా అంటుంది జ్ఞానాంబ. దాని కోసం నీ చదువును అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. వెళ్లి పరీక్ష కోసం చదువుకో. చేసే వాళ్లు చేస్తారు. రామా.. తనను తీసుకెళ్లు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అమ్మ అంటాడు రామా.

janaki kalaganaledu 30 september 2022 full episode

janaki kalaganaledu 30 september 2022 full episode

ఇవన్నీ విన్న మల్లిక.. వామ్మో నేను ఇంటి పనులు ఎక్కడ చేయగలుగుతా అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు అఖిల్ తెగ ఆలోచిస్తూ ఉంటాడు. జెస్సీతో నా ప్రేమ పెళ్లి నాకు చాలా నష్టం చేకూర్చింది అని అనుకుంటాడు. ఇంట్లో అందరి దగ్గర నాటకం ఆడి ఇంతకు ముందు నన్ను ప్రేమగా చూసుకున్నట్టుగా చేయాలి అని అనుకుంటాడు అఖిల్. ఇంతలో రామా వెళ్లడం చూసి నాటకం స్టార్ట్ చేస్తాడు. ఛా అంటూ కోపంగా ఉన్న అఖిల్ ను చూసి ఏమైంది అని అడుగుతాడు రామా. ఇంతలో జానకి వస్తుంది. మీరు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారు అని అనుకుంటే నేను జెస్సీని ప్రేమించేవాడినే కాదు అన్నయ్య అంటాడు అఖిల్.

దీంతో నువ్వేం బాధపడకు అఖిల్. త్వరలోనే అందరూ నీతో మంచిగానే ఉంటారు. అత్తయ్య గారు కూడా మాట్లాడుతారు. జెస్సీని మంచిగా చూసుకో. నీ భవిష్యత్తు కోసం ఒక దారి చూసుకో అంటుంది జానకి. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. బుజ్జగించడానికి వాడేమీ చిన్నపిల్లాడు కాదు అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 30 Sep Today Episode : రామాను కొట్టుకు పంపించిన జ్ఞానాంబ

రామాను కొట్టుకు ఆలస్యం అవుతుంది వెళ్లు అంటుంది జ్ఞానాంబ. జానకిని వెళ్లి చదువుకో అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అఖిల్ తో మాట్లాడుకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అన్నయ్య, వదినను నమ్మించడానికి పెద్ద కష్టమేమీ కాదు కానీ.. అమ్మ దగ్గర ఈ పప్పులు ఉడకవు అని అనుకుంటాడు అఖిల్.

మరోవైపు జెస్సీ బాధపడుతూ ఉంటుంది. మల్లిక ఏదో ప్లాన్ వేద్దామనుకుంటుంది. జానకి, జెస్సీ ఒక్కటయి పోలేరమ్మకు దగ్గరయ్యారంటే అప్పుడు నా బతుకు దరిద్రంగా ఉంటుంది అని అనుకుంటుంది మల్లిక. అందుకే ఏదో ఒక ప్లాన్ వేయాలని అనుకుంటుంది.

అలా జరగకూడదు అంటే జెస్సీకి జానకి మీద ఉన్న అభిప్రాయాన్ని చెడగొట్టాలి. అలాగే పోలేరమ్మకు జెస్సీ దగ్గర కాకుండా చూడాలి అని అనుకుంటుంది మల్లిక. అందుకే జెస్సీ దగ్గరికి వెళ్తుంది మల్లిక. జెస్సీ అని పిలుస్తుంది. ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది మల్లిక.

దీంతో అదేం లేదక్కా అంటుంది జెస్సీ. నువ్వు ఏం చెప్పకపోయినా నాకు తెలుసు జెస్సీ. మీకు నేనున్నాను జెస్సీ. అత్తయ్య గారికి అన్నీ చేసి పెట్టు. అత్తయ్య గారి వెంట పడి చేస్తే కొన్నాళ్లకు అత్తయ్య గారు నిన్ను చేరదీస్తారు అని అంటుంది మల్లిక. ఇవన్నీ విన్న జానకి మల్లికను మందలిస్తుంది.

నువ్వు ఈ ఇంటి కోడలివి అని మరిచిపోకు. సమస్య వస్తే పరిష్కరించే కృషి చేయాలి కానీ.. ఇలా చేయకూడదు అంటుంది జానకి. నీ పద్ధతి మార్చుకో అంటుంది జానకి. మరోవైపు జానకి, రామా ఇద్దరూ వీడియో కాల్ చేసుకుంటారు. రామా కొట్టులో ఉంటాడు. జానకి రూమ్ లో చదువుకుంటూ ఉంటుంది.

మీరు క్యారేజ్ తీసుకెళ్లలేదు. నేను తీసుకొస్తాను అని అంటుంది జానకి. దీంతో మీరు తీసుకొస్తారా అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది