Home » Entertainment » Janaki Kalaganaledu 4 May 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 4 May Today Episode : అంతా నీ వల్లే అని జానకిపై జ్ఞానాంబ సీరియస్.. దీంతో జానకి షాకింగ్ నిర్ణయం.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: May 4, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 4 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మే 2022, బుధవారం ఎపిసోడ్ 292 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిండి వంటలు చేసుకొని బతికేవాడికి ఎవరు విలువ ఇస్తారు అని జానకికి చెప్పి రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో జానకి చాలా బాధపడుతుంది. ఈ విషయాలను జ్ఞానాంబ వింటుంది. నువ్వు ఈరోజు అందరి ముందు అవమాన పడటానికి ఒకరకంగా మీ అమ్మ కూడా కారణం. ఈ అమ్మను క్షమిస్తావా రామా అని అనుకుంటుంది. ఇంతలో జానకి తన దగ్గరికి వస్తుంది. తన కాళ్లను పట్టుకుంటుంది. మీ అబ్బాయి గారికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీరు కాదు అత్తయ్య గారు నేను అంటుంది.

Advertisement

janaki kalaganaledu 4 may 2022 full episode

నా కొడుకు జీవితంలో ఏదైతే జరగకూడదు అనుకున్నానో.. ఏ విషయం గురించి అయితే ఇన్నాళ్లు జాగ్రత్త పడ్డానో ఈరోజు అదే జరిగింది. చదువుకున్న అమ్మాయి వాడికి భార్యగా వస్తే.. ఆ చదువుకున్న అహంతో నా బిడ్డను అవమానిస్తుందని భయపడ్డాను. అందుకే చదువులేని అమ్మాయిని నేను నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఈరోజు నువ్వు వాడి జీవితంలోకి రాకపోయి ఉంటే.. నేడు వాడు అవమాన పడి ఉండేవాడు కాదు. నేడు వాడికి జరిగిన ప్రతి ఒక్కదానికి కారణం నువ్వే. ఇందులో నా నిర్లక్ష్యం కూడా ఉంది. మీ అన్నయ్య నీ చదువును దాచి తన స్వార్థం చూసుకున్నాడు అంటుంది జ్ఞానాంబ.

Advertisement

అటు మోసం చేసిన మీ అన్నయ్య, నువ్వు అందరూ బాగున్నారు కానీ.. నా కొడుకు, నేనే బాధపడుతున్నాం. మున్ముందు ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నాం అంటుంది జ్ఞానాంబ. నా కొడుకు భవిష్యత్తు గురించి నేను ఇప్పుడు భయపడుతున్నాను. ఒక చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి వాడు అవమానపడటానికి కారణం అయ్యానే అని కుమిలి పోతున్నాను అంటుంది జ్ఞానాంబ.

అందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఎదుటి వాళ్లు తమ తెలివితేటలతో మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోతున్నానే అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా కొడుకు దగ్గరికి వెళ్లి బాధపడకు నాన్నా అని ఓదార్చాలని ఉంది. కానీ.. వాడు నన్ను చూస్తే నన్ను పట్టుకొని ఇంకా ఏడుస్తాడు. నా బిడ్డ కాలిలో ముళ్లు గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేను అంటుంది జ్ఞానాంబ.

Advertisement

Janaki Kalaganaledu 4 May Today Episode :  క్షమించమంటూ రామాను వేడుకున్న గోవింద రాజు

మరోవైపు రామా ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. రామా కాళ్లు పట్టుకుంటాడు. దీంతో రామా షాక్ అవుతాడు. నాన్నా.. ఏంటి నాన్నా ఇది. ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు రామా. ఊరుకోండి నాన్న అంటాడు రామా.

నన్ను క్షమించరా. జరిగిన అవమానానికి నీ మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో నాకు తెలుసురా రామా. నా కొడుకును పట్టుకొని వంటవాడు, చదువుకోని వాడు అనడానికి పూర్తిగా ఈ అసమర్థ తండ్రేరా కారణం అంటాడు గోవిందరాజు.

నేనే ముమ్మాటికీ కారణం. ఆరోజు నేను కూలబడిపోయి.. నా నడుము పడిపోకపోయి ఉంటే.. ఈరోజు నువ్వు ఇన్ని అవమానాలు పడి ఉండేవాడివి కాదురా. నా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటే.. నిన్ను బ్రహ్మాండంగా చదివించి ఉండేవాడిని అంటాడు గోవిందరాజు.

మళ్లీ జానకిని బుక్ చేయడానికి మల్లిక ప్రయత్నిస్తుంది. జ్ఞానాంబ ముందు తనను మళ్లీ అవమానిస్తుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి