Janaki Kalaganaledu 4 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. జానకి కలగనలేదు 4 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 164 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి 15 రోజుల్లో మంచి భార్య, కోడలుగా నిరూపించుకోవాలని జ్ఞానాంబ షరతు విధించిన విషయం తెలిసిందే. నువ్వు ఎలాగైనా గెలుస్తావమ్మా. ఈ ఇంటి మీద నీకున్న నమ్మకం, ప్రేమే నిన్ను గెలిపిస్తుంది అని జానకికి గోవిందరాజు భరోసా ఇస్తాడు. తెల్లారగానే.. జానకి రెడీ అవుతుంటుంది. ఏమైంది.. అంత హడావుడిగా రెడీ అవుతున్నారు అనగానే.. ఏం లేదండి.. అత్తయ్య గారు నాకు పెట్టిన పరీక్షలో ఈరోజు మొదటి రోజు కదా.. అందుకే ఈరోజు నుంచి అన్ని విషయాలు పర్ ఫెక్ట్ గా చేయడం కోసం రెడీ అవుతున్నాను అండి అంటుంది జానకి.
ఉదయానే రామా కూడా గుడికి వెళ్లి వస్తాడు. అదే విషయం చెబుతాడు. ఈ 15 రోజుల పరీక్షలో నా భార్య గెలవాలని మొక్కు అని చెబుతాడు జానకికి. ఈ పరీక్ష కేవలం మీకే కాదు.. మనకి. మన నూరేళ్ల ప్రయాణానికి. మీరు గెలిస్తేనే మనం కలిసి ఉంటాం. లేదంటే శాశ్వతంగా.. ఆ మాట అంటుంటేనే ప్రాణం పోతోందండి. అలాంటిది ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే కష్టం అండి. తట్టుకొని బతకడం చాలా కష్టం అండి అంటాడు రామా. మీ నుంచి దూరం అయితే నేను కూడా బతకలేను అంటుంది జానకి.
పొద్దెక్కినా కూడా మల్లిక ఇంకా నిద్ర లేవదు. అమ్మో 6 అయింది లేవండి.. అని అంటుంది. జానకి మీద యుద్ధానికి నడుం బిగించి మరీ వెళ్తున్నాను. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటుంది. మొదటి రోజే ఏదో ఒక పుల్ల పెట్టి జానకిని ఇంటి నుంచి పంపించేస్తాను అని విష్ణుకు సవాల్ విసురుతుంది మల్లిక.
ఉదయమే జ్ఞానాంబకు కాఫీ తెచ్చి ఇస్తుంది మల్లిక. అక్కర్లేదు అంటుంది. మీ పెద్ద కోడలు ఇస్తేనే తాగుతారా? చిన్న కోడలు చేదా అని అంటుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కోడలు అంటే బోలెడంత ప్రేమ. అందుకే కదా.. ఆమె ఎంత చేసినా క్షమించేసి వదిలేస్తున్నారు అంటుంది. శాశ్వతంగా కాదు కదా.. కేవలం 15 రోజులు మాత్రమే కదా.. ఆ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి అని అనేసరికి ఇంతలో జానకి ఫ్రెండ్ శ్రావణి వస్తుంది.
జానకి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాలి. తను ఏం తప్పు చేసింది.. అని అంటుంది. ఏయ్.. నా ఎదురుగా నిలబడి మాట్లాడటానికే భయపడేదానివి.. ఇప్పడు నువ్వు నా ఎదురుగా అంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నావంటే ఇది నువ్వు మాట్లాడేది కాదు.. నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు.. అంటుంది. ఇంతలో జానకి, రామా వస్తారు.
శ్రావణి వద్దు ఆపు అంటుంది. కానీ.. శ్రావణి వినదు. ఇంతలో మల్లిక అందుకుంటుంది. తనకు మంచి చాన్స్ దొరికిందని.. అగ్నికి ఆజ్యం పోస్తుంది. తప్పు చేసింది జానకి వాళ్ల అన్నయ్య అయితే.. జానకిని ఎందుకు శిక్షిస్తున్నారు. జానకి చదువు వల్ల మీకు వచ్చిన సమస్యలు ఏంటి.. అని ప్రశ్నిస్తుంది శ్రావణి.
అసలు నువ్వు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది.. జానకి. అయినా కూడా వినకుండా శ్రావణి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. నీకసలు బుద్ధుందా.. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా.. విడాకుల కాగితం తెచ్చి ఇస్తావా? అంటూ శ్రావణి అంటుంది.
నోర్మూయ్ శ్రావణి. మీకు మా అత్తయ్య గారి గురించి ఏం తెలుసు. మా అత్తయ్య గారు ఎంత ప్రేమగా చూసుకుంటారో మీకేం తెలుసు. నన్ను కోడలుగా కాదు కూతురుగా చూసుకుంటున్నారు. నాకు మా అమ్మ దూరం అయిందన్న బాధను కూడా రానీయకుండా నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు. దేవత లాంటి మా అత్తయ్య గారి గొప్పతనం, మంచితనం తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతారా? అని శ్రావణిపై జానకి సీరియస్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి పంపించేస్తుంది.
క్షమించండి అత్తయ్య గారు అని జానకి అంటే.. ఇవన్నీ తను మాట్లాడినవి కావు.. నువ్వు మాట్లాడించావు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.