Janaki Kalaganaledu 5 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 337 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరోవైపు జానకి.. మరోసారి అసైన్ మెంట్ రాసేస్తుంది. మరోవైపు జ్ఞానాంబ.. రామాకు ఫోన్ చేసి ఒక ఊరికి వెళ్లి అక్కడ దివాకర్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి. వెళ్లి ఒకసారి అడుగు అంటుంది. దీంతో వెంటనే జానకికి ఫోన్ చేసి పక్కూరికి వెళ్లి రావాలి అంటాడు రామా. లేట్ అవుతుందేమో అంటాడు. దీంతో దానికి ఎందుకు అంత టెన్షన్. మీరు అత్తయ్య గారు చెప్పిన పని చేసి రండి. నేను ఆటోలో వెళ్తాను అంటుంది జానకి. దీంతో వద్దు.. మీరు ఆటోలో వెళ్లకండి. నేను ముందు అక్కడికి వస్తాను. మిమ్మల్ని అక్కడ దింపి నేను అక్కడికి వెళ్తా అంటాడు రామా. దీంతో వద్దు రామా గారు మీరు ఆ ఊరికి వెళ్లకుండా ఇక్కడికి వస్తే అత్తయ్య గారు అడుగుతారు. అందుకే మీరు ఏం టెన్షన్ పడకుండా అత్తయ్య చెప్పిన పని చేసుకొని వచ్చేయండి అంటుంది జానకి.
మరోవైపు గోవిందరాజు నడుం నొప్పి ఎక్కువవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ నొప్పి తగ్గడం లేదు. ఈ నడుముల నొప్పి ఏంటో.. ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ.. తగ్గేట్టు లేదు. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు ఇవి అని అనుకుంటాడు గోవిందరాజు. డాక్టర్ చిట్టీ పట్టుకొని ఎవరు తెస్తారు అని చూస్తాడు. ఇంతలో మామయ్య గారు.. మీకు ఏమన్నా కావాలా అని అడుగుతుంది జానకి. దీంతో ఇదిగో అమ్మా.. ఈ ట్యాబ్లెట్స్ కావాలి అని అడుగుతాడు. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. ఏమండి.. ఏమైంది అని అడుగుతుంది. ఏంటి అది.. అని అడుగుతుంది. దీంతో బీపీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి.. తెప్పిస్తున్నాను అంటాడు గోవిందరాజు.
ఇంతలో మల్లిక అక్కడికి వస్తుంది. ట్యాబ్లెట్స్ తేవడానికి జానకి ఎందుకు.. అఖిల్ కు చెబితే తెస్తాడు కదా అంటుంది మల్లిక. దీంతో అఖిల్ లేడు.. కాలేజీకి వెళ్లాడు అంటుంది జానకి. దీంతో దానికి బ్యాగ్ ఎందుకు అని అడుగుతుంది మల్లిక. దీంతో అవును.. బ్యాగ్ ఎందుకు అది ఇంట్లో పెట్టి వెళ్లు అంటుంది జ్ఞానాంబ.
దీంతో ఏంటి జ్ఞానం.. ప్రతిదీ నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మల్లిక చెప్పిందే వింటున్నావు. ఈరోజుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు ఆ మాత్రం బ్యాగు కూడా లేకపోతే ఎలా అంటాడు. దీంతో జానకి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది.
ఆటోలో కోచింగ్ సెంటర్ కు వస్తుంది. కానీ.. అసైన్ మెంట్ వాళ్లు తీసుకోరు. అసైన్ మెంట్ సబ్మిట్ టైమ్ అయిపోయింది అని అంటాడు ఆయన. దీంతో ఆయన్ను బతిమిలాడుతుంది. తనది ఐపీఎస్ అవడం ఒక కల అని చెబుతాడు. దీంతో సరే అసైన్ మెంట్ తీసుకుంటా అని చెబుతాడు. దీంతో జానకి సంతోషిస్తుంది.
మరోవైపు నడుం నొప్పి భరించలేనంతగా వస్తుంది గోవిందరాజుకు. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి గోవిందరాజును చూసి షాక్ అవుతుంది. ఇంత నడుం నొప్పి వస్తున్నా ఎందుకు దాచిపెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. దీంతో జానకి ట్యాబ్లెట్లు తీసుకొస్తూ ఉంటుంది. తను రాగానే అవి వేసుకుంటా. తగ్గిపోతుందిలే అంటాడు గోవిందరాజు.
వెంటనే ట్యాబ్లెట్లు తీసుకురమ్మని చెప్పడం కోసం జానకికి ఫోన్ చేస్తుంది జ్ఞానాంబ. కానీ.. తన ఫోన్ తన రూమ్ లోనే ఉంటుంది. దీంతో వెంటనే రామాకు ఫోన్ చేస్తుంది జ్ఞానాంబ. మీ నాన్న గారికి నడుం నొప్పి తిరగబడిందని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు.
నాకు భయంగా ఉంది అని అంటుంది జ్ఞానాంబ. నేను ఇప్పుడే డాక్టర్ ను తీసుకొని వస్తా అంటాడు రామా. మరోవైపు జానకి మెడికల్ షాపునకు వెళ్లి ట్యాబ్లెట్స్ కావాలి అంటుంది. అందులో కొన్న లేవని చెబుతాడు. మిగితావి తీసుకొని మరో షాపు కోసం వెతుక్కుంటూ వెళ్తుంది జానకి.
మరో షాపులో కూడా లేవు అంటారు. దీంతో మరో షాపునకు వెళ్తుంది జానకి. ఇంజెక్షన్ ఇవ్వండి అంటుంది. అక్కడ దొరుకుతుంది. వాటిని తీసుకొని బ్యాగులో పెట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది జానకి. మాత్రల కోసం వెళ్లిన జానకి ఇంకా రాలేదు ఏంటి.. డాక్టర్ ను తీసుకొస్తా అన్న రామా ఇంకా రాలేదు అని అనుకుంటుంది జ్ఞానాంబ.
ఇంతలో రామా.. డాక్టర్ ను తీసుకొని వస్తాడు. డాక్టర్ చెక్ చేస్తాడు. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అంటాడు. వెన్నుపూస మీద ఒత్తిడి పడింది అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.