Janaki Kalaganaledu 6 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 273 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్ని చదువుకున్న తెలివితేటలు ఉన్న జానకిని మన ఇంట్లో ఉండనిచ్చే అవకాశమే లేదు అని అనుకుంటుంది జ్ఞానాంబ. నీకోసమే నేను తనను భరిస్తున్నా అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఇంతలో అత్తయ్య గారు మనింటికి పోలీసులు వచ్చారు అత్తయ్య గారు అంటుంది మల్లిక. అదేంటి.. మనింటికి పోలీసులు రావడం ఏంటి అని అంటుంది జ్ఞానాంబ. అదే అర్థం కావడం లేదు.. జ్ఞానాంబ గారిని పిలవండి అని పోలీసులు అడుగుతున్నారు అంటుంది మల్లిక. మీరు ఎందుకు వచ్చారో.. మా ఆవిడను ఎందుకు అడిగారో అర్థం కావడం లేదు అంటాడు గోవిందరాజు.
దీంతో మీ ఆవిడ గారిని రానివ్వండి.. వచ్చాక చెబుతాం అంటాడు పోలీస్. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది ఎస్ఐ గారు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు పోలీస్. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంటుంది. దీంతో మీ పెద్ద కోడలు జానకిని మీరు హింసిస్తున్నారని.. వేధిస్తున్నారని మాకు ఫిర్యాదు అందింది. అందుకే గృహ హింస చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు పోలీస్. మేము జానకిని హింసిస్తున్నామా.. ఎవరు కేసు పెట్టారు.. జానకినా అంటాడు గోవిందరాజు.
దీంతో కాదు.. ఆమె అన్నయ్య యోగి పెట్టాడు అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. జానకిని ఇప్పుడే పిలిచి ఆమెతోనే నిజాలు చెప్పిస్తా అంటాడు గోవిందరాజు. ఇదే తనకు అవకాశం అనుకొని ఇంకెక్కడి జానకి.. తను ఇక్కడ ఉంటే కదా.. కేసు పెట్టడానికి అన్నయ్యతో పాటు వెళ్లి ఉంటుంది అంటుంది.
దీంతో ఇదంతా నిజమే అని అనుకుంటుంది జ్ఞానాంబ. మా కోడలు వచ్చే వరకు కాసేపు ఆగండి ఎస్ఐ గారు అని అంటాడు గోవింద రాజు. ఫిర్యాదు వచ్చినప్పుడు విచారించి కేసు ఫైల్ చేయడం మా డ్యూటీ అంటాడు ఎస్ఐ. జానకి వచ్చే వరకు ఆగండి ప్లీజ్ అంటాడు గోవిందరాజు.
కానీ.. జ్ఞానాంబ మాత్రం ఏవండి.. తన అన్నయ్యతో కేసు పెట్టించినప్పుడే ఈ ఇంటి పరువు పోయింది. తనను కూతురులా చూసుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పించింది. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జానకిని నేను మరిచిపోను.. ప్రాణం పోయినా సరే నేను తనను క్షమించను.. ఎస్ఐ గారు పదండి అని చెప్పి పోలీసులతో వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
మరోవైపు రామా, జానకి గుడికి వెళ్తారు. గుడిలో పూజ పూర్తయ్యాక.. నేను ఇటునుంచి ఇటే ఇంటికి వెళ్లిపోతాను. మీరు ఖార్ఖానాకు వెళ్లండి అని చెబుతుంది జానకి. ఇంతలో దొరబాబు వస్తాడు. మీకు ఈ పని ఇప్పించింది మీ అమ్మగారే అని చెబుతాడు దొరబాబు.
దీంతో రామా షాక్ అవుతాడు. నువ్వు పని కోసం వెంకటేశ్ దగ్గరికి వెళ్లావు కదా. ఆ తర్వాత మీ అమ్మగారు నాకు ఫోన్ చేసి నీకు పని ఇవ్వమని చెప్పారు. అందుకే ఇచ్చాను. నువ్వు నిన్ను తిన్న భోజనం కూడా మీ అమ్మ గారు తీసుకొచ్చిందే అని చెబుతాడు.
ఆ తర్వాత రామా సైకిల్ మీద ఖార్ఖానాకు వెళ్తుంటాడు. ఇంతలో పోలీస్ జీపు అక్కడి నుంచి వెళ్తుంటుంది. అందులో జ్ఞానాంబ కనిపిస్తుంది రామాకు. వెంటనే సైకిల్ ఆపి.. వెనక్కి తిప్పుతాడు. అమ్మ.. అంటూ సైకిల్ మీద వెళ్తూ పిలుస్తుంటాడు కానీ.. జ్ఞానాంబకు వినిపించదు.
జ్ఞానాంబను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తారు. మా బాబు బారసాల ఫంక్షన్ లో మిమ్మల్ని అందరినీ ఆనందంగా కలవాలని అనుకున్నాను కానీ.. ఈ చరసాలలో కలవాల్సి వస్తుందని అనుకోలేదు. దీనికి కారణం ముమ్మాటికీ మీరే.. అంటాడు యోగి.
నా చెల్లెలు చదువు గురించి మీరు అడిగిన వెంటనే చెప్పేద్దామనుకున్నాను కానీ.. చెప్పలేకపోయాను. దానికి కారణం మీరే.. మీ మంచితనమే. అమ్మానాన్న దూరమైన మా చెల్లిని అన్నీ మీరై చూసుకుంటారన్న నమ్మకం, స్వార్థం. అమ్మలా కడుపులో పెట్టి చూసుకుంటారని అనుకున్నా కానీ.. అడుగడుగునా కష్టపెట్టి కన్నీళ్లు పెట్టిస్తారనుకోలేదు అంటాడు యోగి.
జ్ఞానాంబ గారంటే మంచితనానికి మారుపేరు. కానీ.. కోడలు విషయంలో మాత్రం ఆ మంచితనం ఎందుకు పని చేయలేదు అంటుంది. నా చెల్లెలు ఏం తప్పు చేసిందండి.. తనను ఇంట్లో నుంచి గెంటేయడానికి.. మీకు పేగు బంధం కంటే ప్రాణమే ముఖ్యమా అంటాడు యోగి.
కన్నకూతురు ప్రాణాలు పోతాయన్న జాలి మీకు కలగలేదు. ఇక మా చెల్లెలు మీద మీకు జాలి ఎలా కలుగుతుంది అంటాడు యోగి. జ్ఞానాంబ మీద కేసు పెట్టింది యోగి అని తెలుసుకొని రామా.. యోగిపై విరుచుకుపడతాడు. యోగిని కొడతాడు.
కంప్లయింట్ వెనక్కి తీసుకో అని జానకి చెప్పినా యోగి వినడు. ఆమెకు శిక్ష పడేలా చేస్తా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.