janaki kalaganaledu 6 december 2021 episode
Janaki Kalaganaledu 6 Dec Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. ప్రతి శని, ఆదివారాల్లో సీరియల్ ప్రసారం కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. తిరిగి సోమవారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. జ్ఞానాంబ.. జానకిని పొగడ్తల్లో ముంచెత్తుతుంది. జానకి.. జ్ఞానాంబను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా చేయడంతో జ్ఞానాంబ తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. దీంతో ఇంట్లో అందరూ సంతోషిస్తారు కానీ.. మల్లికకు మాత్రం తెగ కోపం వస్తుంది. ఎలాగైనా జానకిని ఇరికించాలని చూస్తుంది. అయితే.. మనం ఎంతో క్వాలిటీని మెయిన్ టెన్ చేసే పూతరేకుల్లో కల్తీ ఎలా జరిగిందో వెంటనే తేల్చాలి అని రామా.. జానకితో అంటాడు. దీంతో అవును.. ఇంకోసారి అలా జరగకుండా ఆపాలంటే.. ఖచ్చితంగా ఈ నిజాన్ని వెంటనే తెలుసుకోవాలి అంటుంది జానకి.
janaki kalaganaledu 6 december 2021 episode
వెంటనే ఖార్ఖానాలోని పనివాళ్లను జ్ఞానాంబ పిలిపిస్తుంది. అయితే.. వాళ్లు కూడా తమకు ఏం తెలియదు అంటారు. ఖార్ఖానాకు ఎవరైనా కొత్తవాళ్లు వచ్చారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఎవరూ రాలేదండి అంటారు పనివాళ్లు. వెంటనే మల్లిక అందుకొని ఎవరూ రాలేదు అంటారు ఏంటి.. జానకి వచ్చి నెయ్యి ఇచ్చి వెళ్లింది కదా అంటుంది. మల్లిక కావాలని నెయ్యిలో ఏదైనా కలిపిందేమో. 15 రోజుల పరీక్ష పేరుతో అత్తయ్య గారు హింసించారని అనుకొని కోపంతో అలా చేశారేమో అని అనుమానం రేకెత్తిస్తుంది మల్లిక. కానీ.. మల్లిక మాటలను జ్ఞానాంబ పట్టించుకోదు. అసలు నేరస్తులు ఎవరో త్వరలోనే తేల్చుదాం అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు.
ఇంతలో మల్లిక వెంటనే ఎక్కడ నేరం తన మీద పడుతుందోనని వెంటనే తన రూమ్ లో ఉన్న మందు సీసాను తీసుకెళ్లి దాన్ని పేరట్లో పడేస్తుంది. మల్లిక దాన్ని పడేయడం జానకి చూస్తుంది. వెంటనే దాన్ని తీసుకొని అది ఏం మందో మెడికల్ షాపు అతడికి ఫోన్ చేసి అడుగుతుంది. అది వాంతుల మందు అని చెబుతాడు.
దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు. వెంటనే జానకి ఉన్న విషయం చెప్పేస్తుంది. నెయ్యిలో కలిపింది ఈ మందే. మల్లిక కలిపింది అని చెబుతుంది. దీంతో రామా షాక్ అవుతాడు. తను భయంభయంగా బయటపడేస్తుంటే నేనే తీసుకొచ్చాను. మెడికల్ షాపు అతడికి ఇప్పుడే ఫోన్ చేసి అడిగాను.
దీంతో వెంటనే ఈ కుట్రను అమ్మకు చెబుతాను అంటాడు రామా. వద్దండి.. అత్తయ్య గారికి చెప్పొద్దు అంటుంది జానకి. ఎందుకు చెప్పొద్దు అంటాడు రామా. అలా చేస్తే తనకు లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంట్లో మళ్లీ గొడవలు పెరుగుతాయి. అలా జరగడం నాకు ఇష్టం లేదు అంటుంది జానకి.
దీంతో విష్ణును పిలిచి.. జరిగిందంతా చెబుతారు రామా, జానకి. దీంతో విష్ణు షాక్ అవుతాడు. మల్లిక తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను వదిన అంటాడు. ఇంత జరిగినా.. మల్లిక ఇంత తప్పు చేసినా.. నువ్వు క్షమించావు అంటే గ్రేట్ వదిన అంటాడు విష్ణు.
కట్ చేస్తే.. జానకి బెడ్ రూమ్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. దీంతో పోలీసు టోపీని తీసుకొచ్చి తన నెత్తి మీద పెడతాడు రామా. తనకు సెల్యూట్ కొడతాడు. పోలీస్ క్యాప్ లో అచ్చం పోలీసులా కనిపిస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.