Janaki Kalaganaledu 6 Sep Tomorrow Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ప్రతి రోజు ప్రసారం కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. శనివారం, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. శుక్రవారం ఎపిసోడ్ 120లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. అది శుక్రవారం రాత్రి ప్రసారం అయింది.
ప్రతి సంవత్సరం శుక్రవారం.. జ్ఞానాంబ ఫ్యామిలీ తోటకు వెళ్లి ఘనంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే.. ఈ సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతాన్ని తోటలో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తుంది జ్ఞానాంబ. గత శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం కుదరకపోవడంతో.. ఈ శుక్రవారం చేద్దామని.. అందుకే.. అందరూ త్వరగా రెడీ అయితే.. మనం వెంటనే తోటకు వెళ్దామని జ్ఞానాంబ చెబుతుంది.
త్వరగా వెళ్లి అందరినీ రెడీ అవ్వమని చెప్పు అని జానకికి చెబుతుంది జ్ఞానాంబ. అయితే.. ఉదయమే లేచిన జానకి.. ముగ్గు వేయడం కోసం బయటికి వచ్చి చూసేసరికి.. జ్ఞానాంబ ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. దీంతో షాక్ అవుతుంది జానకి. అయ్యో.. అత్తయ్య గారు నేను వేస్తాను లేండి ముగ్గు అంటూ చెప్పినా కూడా జ్ఞానాంబ వినకుండా.. వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతుంది.
కట్ చేస్తే.. వరలక్ష్మీ వ్రతం పేరుతో ఇంత ఉదయాన్నే లేపారు ఏంటి.. అంటూ తెగ చిరాకు పడుతుంది మల్లిక. మల్లిక నువ్వు ఎందుకు ఇంత హడావుడి చేస్తావు. కాస్త పద్ధతిగా ఉండొచ్చు కదా. ఎందుకు అందరి విషయాల్లో వేలు పెడుతుంటావు. ఇక నుంచి అయినా అందరి విషయాల్లో వేలు పెట్టడం ఆపేయ్. నీ పనేదో నువ్వు చూసుకో.. అని ఉచిత సలహా ఇస్తుంది జానకి. అబ్బో.. పెద్ద కోడలుకు కూడా నేను అలుసు అయిపోయానే అని మల్లిక కోపంతో ఊగుతుంది.
కట్ చేస్తే.. వరలక్ష్మీ వ్రతానికి వెళ్లకుండా ఎలాగైనా వీళ్లను ఆపాలని తెగ ప్రయత్నిస్తుంది మల్లిక. అందుకే.. తనకు కడుపునొప్పి బాబోయ్.. అంటూ యాక్షన్ చేస్తుంది. మల్లిక ఎప్పుడైనా.. అందరూ కలిసి మెలిసి ఉంటే తట్టుకోలేదు. ఇదివరకు చాలాసార్లు.. కాళ్ల నొప్పి, తలనొప్పి అంటూ అబద్ధాలు చెప్పింది. ఈ సారి ఏ కడుపునొప్పో అని చెప్పి రానని చెబుతుంది.. అని ముందే అందరికీ చెబుతుంది జ్ఞానాంబ. అదే నిజం అవుతుంది. నాకు కడుపులో నొప్పిగా ఉంది. నేను రాలేను… అంటూ యాక్షన్ చేస్తుంది మల్లిక.
దీంతో అందరూ నవ్వేస్తారు. నాకు కడుపులో నొప్పిగా ఉందంటే మీరు నవ్వుతారా? ఏంటి అసలు..మీరు ఎందుకు నవ్వుతున్నారు.. అంటూ సీరియస్ అవుతుంది మల్లిక. నీకు కడుపునొప్పి వస్తుందని ముందే జ్ఞానాంబ చెప్పిందని.. తన మామయ్య అంటాడు. విష్ణు కూడా అదే అంటాడు. అయినా కూడా నేను.. అంటూ మొండికేస్తుంది మల్లిక.
ఇలా కాదు కానీ.. దాన్ని ఎత్తుకొచ్చి ట్రాక్టర్ లో పడేయ్ విష్ణు.. అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరేనమ్మా అని చెప్పి.. తనను ఎత్తుకొని తీసుకొచ్చి ట్రాక్టర్ లో పడేస్తాడు విష్ణు. ఆ తర్వాత అందరూ ట్రాక్టర్ లో తోటకు వెళ్తారు.
అక్కడ భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని జరుపుకుంటారు. పూజారి వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేస్తాడు. జ్ఞానాంబ ఐదుగురు ముత్తయిదువులను వరలక్ష్మీ వ్రతానికి పిలుస్తుంది. వాళ్లకు తాంబూలాలను ఇవ్వాలంటూ జానకి, మల్లికకు చెబుతుంది. దీంతో ఇద్దరూ కలిసి వాళ్లకు తాంబూలాలు ఇస్తారు.
ఆ తర్వాత పూజారి, ముత్తయిదువులు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక.. కల్చరల్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేస్తారు. అందరూ కలిసి సరదాగా ఆటపాటల్లో మునిగితేలుతారు. జ్ఞానాంబ, తన భర్త.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసి అదరగొడతారు. వాళ్లు డ్యాన్స్ వేస్తుంటే.. రామా ఈలలు వేస్తాడు.
ఆ తర్వాత రామా, జానకి ఇద్దరూ రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తారు. రొమాన్స్ చేస్తే.. ఒకరిని మరొకరు టచ్ చేస్తూ డ్యాన్స్ చేసి అదరగొడతారు. ఇక.. చివరకు మల్లిక, విష్ణు కూడా సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తారు. మొత్తం మీద వరలక్ష్మీ వ్రతం అయిపోయాక.. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. అక్కడే ఆటాపాటలతో కాలక్షేపం చేస్తారు జ్ఞానాంబ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వెయిట్ చేయాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.