Janaki Kalaganaledu 7 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 274 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా చెల్లెలు గురించి తెలుసుకొని తనవైపు ఏదైనా చిన్న తప్పు ఉంటే.. తనకు సర్ది చెబుతారని నేను అనుకున్నా కానీ.. మీరు నా చెల్లెలను ఇంతలా హింసిస్తారని నేను అనుకోలేదు. నా చెల్లెలు కంట్లో నుంచి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు మీరు మూల్యం చేసుకునేలా చేస్తా అని జ్ఞానాంబతో అంటాడు యోగి. ఇంతలో ఎస్ఐ వచ్చి వెళ్లి మీ చెల్లెలును తీసుకొని రండి.. తన స్టేట్ మెంట్ తీసుకొని కేసు ఫైల్ చేయాలి అంటాడు ఎస్ఐ. దీంతో జానకి దగ్గరికి బయలుదేరుతాడు యోగి.
మరోవైపు కారులో గోవిందరాజు, విష్ణు, అఖిల్ పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఇంతలో యోగి అక్కడి నుంచి వెళ్లబోతుండగా చూసి.. గోవిందరాజు యోగిని పిలిచి ఏంటయ్యా ఇది.. ఇంత బుద్ధి లేని పని ఎందుకు చేశావు అంటాడు గోవిందరాజు. మీకే అంత కోపం వస్తే.. నా చెల్లెలును హింసిస్తే నాకెంత కోపం రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు యోగి. మరోవైపు స్టేషన్ లోపలికి గోవిందరాజును వెళ్లనీయరు. నువ్వేం బాధపడకు జ్ఞానం. నేను ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి చెబుతా అంటాడు. దీంతో వద్దు అంటుంది. నా కోడలును నెత్తిన పెట్టుకున్నందుకు నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే అంటుంది జ్ఞానాంబ.
మీరందరూ ఇంటికి వెళ్లండి అంటుంది జ్ఞానాంబ. ఇంతలో రామా పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అమ్మ అంటాడు. అతడిని లోపలికి వెళ్లనీయరు పోలీసులు. వాళ్లను నెట్టుకొని లోపలికి వెళ్తాడు రామా. అమ్మా.. ఏంటమ్మా ఇది ఏమైందమ్మా. నిన్ను పోలీస్ జీపులో చూడగానే నా ప్రాణం పోయినట్టు అయిందమ్మా.. అని అడుగుతాడు రామా.
చెప్పు అమ్మ.. అంటాడు. దీంతో తన చేయి లాక్కుంటుంది. ఏం మాట్లాడదు జ్ఞానాంబ. నా కోసం ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. వెళ్లిపోమని చెప్పండి అంటుంది జ్ఞానాంబ. అమ్మ అంటాడు రామా. ఏమైందమ్మ అంటాడు. చెప్పు అన్నా కూడా జ్ఞానాంబ వినదు.
దీంతో పోలీసులు వచ్చి రామాను బయటికి లాక్కెళ్లిపోతారు. ఏంటి నాన్నా ఇది.. అమ్మ పోలీస్ స్టేషన్ కు రావడం ఏంటి.. అసలు ఏం జరిగింది అని గోవిందరాజును అడుగుతాడు రామా. ఎవరైనా చెప్పండి అని అడుగుతాడు రామా. దీంతో ఒరేయ్ రామా.. ఆ యోగి మీ అమ్మ మీద కేసు పెట్టాడురా అంటాడు గోవిందరాజు.
దీంతో రామా షాక్ అవుతాడు. అన్ని విషయాలు చెప్పగానే రామాకు కోపం వస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. సైకిల్ తొక్కుతూ కోపంతో అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు జ్ఞానాంబ అరెస్ట్ అవడంతో మల్లిక చాలా సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది.
ఇక ఈ జన్మలో జానకిని పోలేరమ్మ క్షమించదు అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో జానకి.. గుడి నుంచి ఇంటికి వస్తుంది. జానకిని చూసి విషయం తెలియనట్టుంది. తెలిసేలా చేస్తాను అని అనుకుంటుంది. జానకి.. ఎంత పని చేశావు జానకి అంటుంది.
అత్తయ్య గారు అంటుంది. సడెన్ గా మల్లికకు ఏమైంది. ఎందుకు ఏడుస్తోంది అని అనుకుంటుంది జానకి. నువ్వు చేసిన పని వల్ల ఈ ఇల్లే కుమిలి కుమిలి ఏడుస్తోంది అంటుంది మల్లిక. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది.
దీంతో దేవత లాంటి అత్తయ్య గారిని నువ్వు అరెస్ట్ చేయించావు. గుడి మెట్లు ఎక్కే అమ్మోరు లాంటి అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు అంటుంది మల్లిక. ఏం మాట్లాడుతున్నావు.. నీకేమైనా అర్థం అవుతోందా. నేను అత్తయ్య గారిని అరెస్ట్ చేయించడం ఏంటి. అసలు అత్తయ్య గారు పోలీస్ స్టేషన్ కు వెళ్లారన్న విషయమే నాకు అర్థం కావడం లేదు అంటుంది.
ఇంతలో వెన్నెల వచ్చి అసలు విషయం చెబుతుంది. ఇంతకుముందే పోలీసులు అమ్మను స్టేషన్ కు తీసుకెళ్లారు అంటుంది. మీ అన్నయ్య కేసు పెట్టాడని చెప్పారు అంటుంది వెన్నెల. ఇదంతా నువ్వే చేయించావని అమ్మ అనుకుంటోంది వదిన అంటుంది వెన్నెల.
ఇంతలో యోగి.. జానకి దగ్గరికి వస్తాడు. జానకి ఉండే గుడిసెను చూసి చలించిపోతాడు. ఇలాంటి ఇంట్లోనా నువ్వు ఉండేది.. గుండె తరుక్కుపోతుంది అని అనుకుంటాడు. ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. వాళ్లందరూ చెప్పేది నిజమేనా. నువ్వు మా అత్తయ్య గారి మీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చావా అని అడుగుతుంది జానకి.
దీంతో ఇచ్చాను అంటాడు. నిన్ను ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పడేసిన ఆమెకు గుణపాఠం చెప్పాను అంటుంది. దీంతో నీకేమైనా పిచ్చా.. మతి ఉండే చేస్తున్నావా.. నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నావో తెలుసా అని అంటుంది. ఏంటి తప్పు అంటాడు.
నా చెల్లెలును ఇంత భయంకరంగా కష్టపెడుతుంటే నేను ఎలా భరిస్తాను అంటాడు యోగి. కుటుంబం అన్నాక చాలా గొడవలు ఉంటాయి.. అంతమాత్రానికి ఇంత చేస్తారా అంటుంది జానకి. నువ్వు చేసిన పని వల్ల నా జీవితానికే నష్టం కలుగుతోంది అంటుంది జానకి.
ఇప్పటి దాకా నీకు జరిగిన నష్టం చాలు. నువ్వు ఇంకా ఇంకా కష్టపడకూడదు.. నష్టపోకూడదు అంటుంది జానకి. పదా నువ్వు వెంటనే కంప్లయింట్ వెనక్కి తీసుకో అంటుంది జానకి. దీంతో నేను ఆ జ్ఞానాంబకు బుద్ధి చెప్పడానికే ఈ పని చేశాను అంటాడు.
నువ్వు ఏం చెప్పకు.. నేను ఏం వినను అంటాడు యోగి. ఇంతలో రామా అక్కడికి వస్తాడు. కోపంతో వస్తాడు. యోగి కాలర్ పట్టుకొని కొడుతాడు. వద్దు వదలండి అంటుంది జానకి. నీకు ఏం తెలుసు మా అమ్మ గురించి. చీమకు కూడా హాని చేయదు మా అమ్మ. అటువంటిది మీ చెల్లెలను హింసించిందని కేసు పెడతావా అంటూ కొడుతాడు రామా.
మా అమ్మకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను వదిలిపెట్టను అంటాడు రామా. వద్దు.. ఆగండి అని చెప్పినా రామా వినడు. మా అమ్మను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించి పరువు తీస్తావా.. చంపేస్తాను నిన్ను అంటాడు రామా. దీంతో మీకు దండం పెడతాను.. వదిలేయండి రామా గారు అంటుంది జానకి.
మా అమ్మ నిజంగా దేవత కాబట్టి.. నీ చెల్లెలు చదువు గురించి మోసం చేసినా మా అమ్మ క్షమించింది. జానకి గారిని కళ్లలో పెట్టుకొని చూసుకుంటుంది. అలా కాకుండా మా అమ్మది హింసించే మనస్తత్వమే అయితే నిన్ను మా ఇంటి గుమ్మం కూడా తొక్కించేది కాదు అంటాడు.
మరోవైపు యోగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం మీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. మా అమ్మ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయాలనుకున్న విషయం మీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.