Janaki Kalaganaledu 8 Feb Today Episode : వెన్నెలపై జ్ఞానాంబ‌ సీరియస్.. తను ప్రేమించిన అబ్బాయిని మరిచిపోవాలని వెన్నెలకు చెప్పిన జ్ఞానాంబ‌.. దీంతో వెన్నెల షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 8 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 232 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన నాయినమ్మకు బాగోలేదని చెప్పి మల్లిక తన భర్తతో పాటు రిసార్ట్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఈత కొడుతూ ఉంటుంది. మరోవైపు తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది జ్ఞానాంబ‌. ఎక్కడ పెట్టి ఉంటాను అని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనకు కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. అక్కడ లవ్ లెటర్స్, లవ్ గ్రీటింగ్ కార్డ్స్ కనిపిస్తాయి. వాటిని చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ‌. ఏంటివి అంటూ ఆశ్చర్యపోతుంది. డెస్క్ ఓపెన్ చేస్తే అన్నీ లవ్ సింబల్ వస్తువులు, టెడ్డీ బేర్స్ ఉంటాయి. వెన్నెలను చూడటానికి వచ్చి అబ్బాయి ఫోటో మీద క్రాస్ మార్క్ పెట్టి ఉండటం కూడా చూస్తుంది జ్ఞానాంబ‌.

janaki kalaganaledu 8 february 2022 full episode

ఇలాంటివన్నీ వెన్నెల దగ్గర ఉండటం ఏంటి.. ఆర్థం కావడం లేదే.. అంటే వెన్నెల ఎవరినైనా ప్రేమిస్తోందా అని డౌట్ పడుతుంది జ్ఞానాంబ‌. తనకు ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఘటనలను గుర్తు తెచ్చుకుంటుంది. మరోవైపు పూజ కోసం జానకి గుడిలో పూలను తెంపుతూ ఉంటుంది. అవి అందకున్నా కూడా వాటిని ఎగిరి మరీ అందుకుంటూ ఉంటుంది. రామా తనను ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఏమైంది అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడుగుతుంది జానకి. ఇందాక కాలు నొప్పి అయిందన్నారు కదా.. ఇంతలోనే ఎలా తగ్గింది అని ఆలోచిస్తున్నాను అని చెబుతాడు రామా. తగ్గలేదు కానీ.. పూజ చేయడం తప్పదు కదా అని చెబుతుంది జానకి.

మరోవైపు జానకి ఐపీఎస్ కలను ఎందుకు వదిలేసుకుంది. దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి అని అనుకుంటాడు రామా. నేను ఐపీఎస్ చదవలేను అని తెలిసినప్పటి నుంచి ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ.. అత్తయ్య గారు నా సర్టిఫికెట్లు తీసేసుకున్నారు అని నేను రామా గారికి ఎలా చేయాలి అని అనుకుంటుంది.

ఇంతలో పూలు కోయడం లేట్ అవుతోంది. నన్ను ఎత్తుకోండి.. నేను త్వరగా పూలు కోస్తాను అని చెబుతుంది జానకి. దీంతో మిమ్మల్ని ఎత్తుకుంటే పూలు కోస్తారా.. సరే.. కొంచెం వెనక్కి రండి అంటాడు రామా. చెట్టు దగ్గరికి వెళ్లి దాని కొమ్మను గట్టిగా ఊపుతాడు. దీంతో చాలా పూలు రాలుతాయి. దీంతో జానకి ఖుషీ అవుతుంది.

వాటిని తన చీర కొంగుతో పట్టుకుంటుంది. కట్ చేస్తే వెన్నెల.. దిలీప్ కు ఫోన్ చేస్తుంది. నా పెళ్లి గురించి మా ఇంట్లో ఇప్పుడప్పుడే ఆ ప్రస్తావన తీసుకురారని అనుకున్నా కానీ.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా భయం వేస్తోంది అని వెన్నెల మాట్లాడుతుండగానే.. జ్ఞానాంబ‌ అక్కడికి వస్తుంది.

వెన్నెల చెంప చెళ్లుమనిపిస్తుంది. అమ్మా.. మా క్లాస్ మేట్ అమ్మ అని చెప్పినా వినదు జ్ఞానాంబ‌. నా క్లాస్ మేట్ తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు అని అడుగుతోంది అంటుంది. చంపేస్తాను.. ఇంకా ఇంకా అబద్ధాలు చెబితే చంపేస్తాను అంటుంది. నీ నోట్లో నుంచి ఇంకో అబద్ధం వచ్చిందంటే కూతురువని కూడా చూడను. నువ్వు గొప్పదానివి అవుతావని అనుకున్నాను కానీ.. అమ్మనే మోసం చేసేంత గొప్పదానివని అనుకోలేదు అంటుంది జ్ఞానాంబ‌.

Janaki Kalaganaledu 8 Feb Today Episode : పూజ విషయంలో జానకిని చాలా ఇబ్బంది పెట్టిన రామా

ఈడు వచ్చిన ఆడపిల్లను తల్లి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది.. తెలిసీ తెలియక ఏదైనా తప్పు చేస్తారేమోనని. కానీ.. నేను మాత్రం అలా చేయలేదు.. ఎందుకో తెలుసా? నా పెంపకం మీద నమ్మకంతో నేను నిన్ను ఏనాడూ అనుమానించలేదు. అక్కడికి వెళ్తా.. ఇక్కడికి వెళ్తా అమ్మా అంటే నీకు ఏనాడూ అడ్డు చెప్పలేదు అంటుంది జ్ఞానాంబ‌.

ఈ అమ్మ ప్రేమ నీకు పిచ్చితనంలా అనిపించిందా? లేదమ్మా.. మా అమ్మ ప్రేమ నాకు ఎప్పుడూ విలువైనదే. మా అమ్మ అంటే నాకు ఎంత ప్రేమో.. అంతే గౌరవం అంటుంది వెన్నెల. దీంతో నోర్మూయ్.. అంటుంది. ఈ అమ్మ అంటే నీకు నిజంగానే గౌరవం ఉంటే ఇలాంటి పాతరేసే పనులు చేయవు అంటుంది జ్ఞానాంబ‌.

రేపు ఎవరైనా వచ్చి.. ఏంటమ్మా నీ కూతురు ఎవరినో ప్రేమించిందట అని అడిగితే తల ఎత్తుకొని తిరగగలమా అంటుంది జ్ఞానాంబ‌. మన ఇంటి పద్ధతులు తెలిసి కూడా ఇలాంటి తలవంపులు తెచ్చే పని చేస్తావా.. ఎల్లుండే నీ నిశ్చితార్థం. నేను చూసిన వాడితో నువ్వు తలవంచి తాళి కట్టించుకోవాలి. లేదంటే నేను ఎంత మంచిదాన్నో అంత మొండిదాన్ని. ఏం చేయడానికైనా వెనుకాడను.. అని చెప్పి జ్ఞానాంబ‌ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నేను బయట ఉంటాను.. మీరు పూజ చేసి రండి అని చెప్పి రామా బయటికి వెళ్తాడు. రామా గారు ఏంటండి మీరు.. మనిద్దరిని కలిసి పూజ చేయమని అత్తయ్య గారు ఇక్కడికి పంపించారు. కానీ.. నన్ను వదిలేసి మీరు వెళ్తున్నారు ఏంటి అంటుంది జానకి.

దీంతో నాకు పూజలో కూర్చోవడం ఇష్టం లేదు. మన మనసులు కలవనప్పుడు నేను పూజలో కూర్చొని ఏంటి లాభం అంటాడు. మళ్లీ రామా.. తన ఐపీఎస్ గురించే మాట్లాడుతాడు. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. ముందు పూజ పూర్తి చేద్దాం రండి అంటుంది జానకి.

నేను పూజలో కూర్చోవాలంటే మీరు ఎందుకు ఐపీఎస్ చదవనంటున్నారో నాకు కారణం చెప్పాలి.. అంటాడు రామా. అబ్బ.. ఒకవైపు పూజకు టైమ్ అవుతుంటే ఈటైమ్ లో ఏంటి రామా గారు మీరు. మనిద్దరం కలిసి పూజ జరిపించకపోతే అత్తయ్య గారు బాధపడతారు.. అంటుంది జానకి.

మీరు చదువుకోవడానికి అమ్మ కూడా ఒప్పుకున్నాక మీకు వచ్చిన సమస్య ఏంటి.. అని అడుగుతాడు రామా. అయ్యో.. ఈయనకు ఎలా చెప్పాలి. ఎందుకు ఈయన అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటుంది జానకి. అంతా నా కర్మ.. అని అంటుంది జానకి.

మీరింకా ఇక్కడే ఉన్నారు ఏంటి.. వెళ్లిపోతా అన్నారుగా వెళ్లిపోండి.. అంటుంది జానకి. మీరు కారణం చెప్పకుండా నేను పూజలో కూర్చోను అని చెప్పాను కదా అంటాడు రామా. మరోవైపు అమ్మవారికి ప్రసాదం సమర్పించేందుకు బ్యాగ్ వెతుకుతుంది జానకి.

కానీ.. అమ్మవారి ప్రసాదం కనిపించదు. దీంతో ప్రసాదం కనిపించడం లేదని జానకి.. రామాకు చెబుతుంది. ఇంతలోనే రామాకు ఫోన్ చేస్తుంది జ్ఞానాంబ‌. అమ్మవారికి ప్రసాదం సమర్పించారా అని అడుగుతుంది. దీంతో జానకి గారు ఇప్పుడే ప్రసాదం సమర్పిస్తున్నారు అని చెబుతాడు రామా. దీంతో జ్ఞానాంబ‌ షాక్ అవుతుంది. ఎందుకంటే ప్రసాదం తనదగ్గరే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

Numerology : న్యూమరాలజీ ప్రకారం ముక్కు మీద కోపం ఉంటే… ఇలా నియాంత్రిచండి….?

Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…

24 minutes ago

Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…

8 hours ago

Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫ‌లించిన పరమేశ్వర్ రెడ్డి కృషి

Uppal  : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…

9 hours ago

Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా… ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా…?

Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…

9 hours ago

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

Snake  : మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…

10 hours ago

Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం…?

Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…

19 hours ago

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…

20 hours ago

Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?

Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…

21 hours ago