janaki kalaganaledu 8 june 2022 full episode
Janaki Kalaganaledu 8 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 318 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగకూడదు. ఇది నేరం. తీయండి.. డబ్బులు తీయండి.. ఫైన్ కట్టండి అని అంటాడు ట్రాఫిక్ ఫోలీస్. దీంతో ఇక్కడ ఫోటోలు తీయడం నేరం.. అని ఎక్కడా రాసి లేదు కదా. అలా రాసి ఉంటే మేము ఫోటోలు తీసుకునేవాళ్లమే కాదు అని అంటుంది జానకి. దీంతో ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు అని అంటాడు పోలీస్. డబ్బులు ఇస్తారా లేక స్టేషన్ కు నడుస్తారా అని అంటాడు పోలీస్. వద్దు సార్.. నేను ఫైన్ కడతాను అంటాడు రామా. ఇక్కడ ఫోటోలు తీసుకోకూడదని మాకు తెలియదు అంటాడు. ఇంతలో అసలు ఒరిజినల్ ట్రాఫిక్ పోలీస్ కాదని అనుమానం వస్తుంది జానకి. దీంతో మీ ఐడి ఇవ్వండి అని అడుగుతుంది.
janaki kalaganaledu 8 june 2022 full episode
దీంతో అతడికి డౌట్ వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చూశారు కదా రామా గారు.. ఆయన అసలైన పోలీస్ కాదు అని అంటుంది. అతడు బెల్ట్ ఉల్టా పెట్టుకున్నాడు. అతడు నిజమైన పోలీస్ కాదు అని అంటుంది జానకి. మరోవైపు జ్ఞానాంబ ఇంకా ఏదో దిగులుగా ఉంటుంది. ఏమైంది జ్ఞానం.. రామా పోటీల్లో బాగానే పాల్గొంటున్నాడు కదా అని అంటాడు గోవిందరాజు. దీంతో ఇప్పుడు ఓకే కానీ.. రేపు వాడికి ఏదైనా అవమానం జరిగితే ఎలా అని అంటుంది జ్ఞానాంబ. మన రాముడు గెలిచి తీరుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు జ్ఞానం అంటాడు గోవిందరాజు. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. ఇంతలో గోవిందరాజుకు మల్లిక ఫోన్ చేస్తుంది. ఒకసారి అత్తయ్య గారికి ఫోన్ ఇవ్వండి అంటుంది మల్లిక. అత్తయ్య గారు.. బావ గారి గురించి ఊళ్లో వాళ్ల సూటి పోటి మాటలు మాట్లాడుతున్నారు అంటుంది మల్లిక.
అంత పెద్ద పోటీలకు వెళ్లడం ఏంటి.. మొదటి రౌండ్ ఏదో అమ్మ సెంటిమెంట్ తో గెలిచారు. తర్వాతి రౌండ్ గెలవడం అంత ఆషామాషీనా అని అన్నారు అంటుంది మల్లిక. ఊళ్లో నేను మన రామా గురించి అందరూ మంచిగా మాట్లాడారు అంటాడు గోవిందరాజు.
మరోవైపు రామా, జానకి హైదరాబాద్ అంతా తిరుగుతారు. చార్మినార్ వెళ్తారు. అక్కడ సరదాగా కాసేపు గడుపుతారు. ఇంతలో రామా కాసేపు తనకు కనబడడు. దీంతో జానకి షాక్ అవుతుంది. రామా ఎటు వెళ్లాడు అని అనుకుంటుంది జానకి.
అక్కడా ఇక్కడా అతడి కోసం వెతుకుతుంది జానకి. కాసేపు టెన్షన్ పడుతుంది. ఇంతలో రామా వస్తాడు. గాజులు కొనుక్కొని వచ్చా మీ కోసం అంటాడు రామా. కోపంతో తన చెంప మీద ఒక్కటి ఇస్తుంది జానకి. మన ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చి చార్మినార్ దగ్గర గాజులు కొనుక్కోవాలి అని అందరూ అంటుంటారు.. అని అంటాడు రామా.
మరోవైపు పోటీలు ప్రారంభం అవుతాయి. గెస్టులు వస్తారు. వారెవ్వా సంజయ్ కపూర్ కూడా వస్తాడు. కాంపిటిషన్ లో టెన్షన్ తో కాకుండా ఇష్టంతో చేయాలని చెఫ్ అంటాడు. వెస్టర్న్ ఫుడ్ తయారు చేయాలని చెఫ్ హెడ్ చెబుతాడు. దీంతో వెస్టర్న్ ఫుడ్ ఎలా తయారు చేయాలో తెలియక సతమతమవుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.